జీవిత పరమార్ధం : Purpose of Life

इंद्रियार्धाननुभवन् बुद्धिमान लोकपूजितः
सम्मतः सर्वभूतानामुच्छस्वन् को न जीवति

देवतातिथिभृत्यानां पितृणामात्मनश्चयः
न निर्वपति पंचानामुच्छस्वन् न सजीवति

ఇంద్రియార్ధాననుభవన్ బుద్ధిమాన్ లోకపూజితః
సమ్మతః సర్వభూతానాంముచ్ఛ్వసన్ కో న జీవతి

దేవతాతిథిభృత్యానాం పిత్రూణామాత్మనశ్చ యః
న నిర్వపతి పంచానాముచ్ఛ్వసన్ న స జీవతి

These verses are one of yaksha prasnas from Mahabharata
Yaksha ask yudhistir (dharmraja):
who is a person inspite of experiencing with all his five senses, being intelligent, respected and acknowledged by all, breathing but still to be considered as dead?
Dharmaja answers:
One who does not respect and ill-treat, Devatas, atithi (guest), bhrutaya (servants) pitru(ancestors) and finally atmanah (self) is to be considered dead even if he is breathing.

ఇది మహాభారతంలో యక్ష ప్రశ్నలు ఘట్టం లోనిది. యక్షుడు ధర్మరాజుని ఇలా అడిగాడు:
ఎవరు ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ, బుద్ధిమంతుడు, లోక పూజితిడు సర్వభూతాలకూ సమ్మతమైన వాడూ, ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగిస్తున్నా జీవచ్ఛవంతో సమానము??
దానికి ధర్మజుడు ఇలా అన్నాడు:
ఎవరైతే దేవతలకు, అతిథులకు, భృత్యులకు అంటే పనివారు, పితృదేవతలకు చివరగా ఆత్మనః అంటే స్వార్ధం ఈ అయిదుగురికీ తగినట్లుగా ఉపచారాలు చేయడో వారి బాగోగులు చూసుకోడో వాడు బ్రతికివున్నా మరణించినట్లు…

Advertisements

జీవన లక్ష్యం: The destiny of Life

संसारिणो स्वया बुद्ध्या समीहन्ते धनादिकम्
मेधाविभिस्तु दीप्यन्ते मुक्त्यै संविद्धुताशनाः

సంసారిణో స్వయా  బుద్ధ్యా సమీహంతే ధనాదికం
మేధావిభిస్తు దీప్యంతే ముక్త్యై సంవిద్ధుతాశనాః

భగవత్ప్రసాదంగా లేదా పూర్వ జన్మ సుకృతం వలన మనకు లభించిన బుద్ధి, శక్తులని ఏ విషయాలకు ఉపయోగించాలో, లేదా దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో చెబుతుంది ఈ సుభాషితం. సంసారిణో అంటే ఇక్కడ సాధారణ మానవాళి అని అర్థం, వారంతా తమ స్వంత బుద్ధి లేదా తెలివితేటలు, ధనధాన్యాదులు సమీకరించటం కోసం ఉపయోగిస్తారట, కానీ మేధావులు ఇలా తన తెలివితేటలను ధనధాన్యాల సేకరణ కోసం కాకుండా తమ తమ జ్ఞానాగ్నిని ప్రదీప్తం చేసుకోవటానికి, లేదా ముక్త్యై అంటే ముక్తి సాధించటానికి మాత్రమే ఉపయోగిస్తారట. అందుకని మనము ఎంత సంపాదించాము అన్నదాని కన్నా జ్ఞాన సముపార్జనకే పెద్ద పీట వెయ్యాలి. ఎవరో చేస్తే నేను ఎందుకు చెయ్యాలి అని అనుమానం రావచ్చు అందుకే గీతలో కృష్ణ భగవానుడు.

యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః
స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే

శ్రేష్ఠః అంటే ఉత్తములు యద్ యద్ ఆచరతి అంటే ఏ ఏ వాటిని ఆచరిస్తారో తత్ తత్ ఇతరో జనః ఆయా విషయాలను ఇతర జనులు స యత్ ప్రమాణం కురుతే వాటిని ప్రమాణముగా తీసుకుని లోకం ఆ ఉత్తమ జనులు ఆచరించిన దారినే అనువర్తతే అంటే అనుసరిస్తారు. మనకి దారి తెలియని నాడు ఉత్తముల మార్గాన్ని అనుసరించటం ఉత్తమం కదా…

This sloka tells us how to use, or for what we have to spend the energy and intelligence that was gifted to us by god or due to our past life deeds. In general everyone in this world use their energy and intelligence for collecting wealth in the materialistic form of money, land, food etc… whereas sages or intelligent people spend their energy and intelligence in enlightening their learning path for the ultimate liberation. some might get a doubt that why should I follow someone else’s path, to clarify that only in Geeta lord Sri Krishna said

यद्यदाचरति श्रेष्टः तत्तदेवेतरो जनः
स यत् प्रमाणम् कुरुते लोकस्तदनुवर्तते

Everybody follows the actions of a noble person. The world follows the standard set by him. When we don’t know the destiny of the path that we follow it is always good to follow the noble person’s path.

కార్యసాధకుడు-The Determined

क्वचित् भूमो शय्या क्वचिदपिच पर्यन्क शयनम्
क्वचित् शाखाहारी क्वचिदपिच शल्योदन रुचिः
क्वचित् कन्धाधारी क्वचिदपिच दिव्याम्बरधरो
मनस्वी कार्यार्थी न गणयति दुःखम् न च सुखम्

క్వచిత్ భూమో శయ్యా క్వచిదపిచ పర్యంక శయనం
క్వచిత్ శాఖాహారీ క్వచిదపిచ శాల్యోదన రుచి
క్వచిత్ కంధాధారీ క్వచిదపిచ దివ్యాంబరధరో
మనస్వీ కార్యార్థీ న గణయతి దుఃఖమ్ న చ సుఖం

I have learned this sloka from my father. This life is full of happiness as well sorrows. Sometimes one will end up sleeping on the difficult rocky land in some other time, enjoy sleep on soft bed.
Sometimes one may get just piece of fruits and potatoes and some other time, enjoy a full course meal.
Sometimes one might get to wear some old torn clothes and some other time, soft silky glorious clothes.
What ever may be the position a dedicated worker will not count the happiness or sorrows that he encounter in the process of completing his task.

ఈ శ్లోకం నేను మా నాన్నగారు తెలుగులో చెబుతుంటే వినేవాడిని, దానికి సంస్కృత మూలం ఇది.
మన జీవితంలో మనం ఎన్నో సార్లు ఒడిదుడుకులకు గురికావచ్చు. ఒకసారి నొప్పి పుట్టే కఠిక నేలమీద నిద్రించవలసిరావచ్చు మరొకసారి మెత్తని తల్పం మీద హాయిగా నిద్రించే అవకాశమూ రావచ్చు,
ఒకసారి తిండి లేక ఆకులు అలములు తినవలసిరావచ్చు మరొకసారి పంచభక్ష పరమాన్నములు లభించవచ్చు,
ఒకసారి వంటి ని కప్పుకోవడానికి సరైన దుస్తులు లేక చిరగిన బట్టలు ధరించవలసి రావచ్చు, మరొకసారి పట్టు పీతాంబరాలతో సత్కారం జరగవచ్చు.
కార్యార్థి తన పని సాధించే వరకూ ఇలా ఎన్ని ఉత్థాన పతనాలకు లోనైనా ఎదురైన సుఖ దుఃఖాలను గణించకుండా తన పని తను చేసుకుపోతూ చివరకు విజయాన్ని వరిస్తాడు.

Good Qualities and Difficulties

गुणवन्तः क्लिश्यन्ते प्रायेण भवन्ति निर्गुणाः सुखिनः 

बन्धनमायन्ति सुका यथेष्टसंचारिणः काकाः 

గుణవంతః క్లిశ్యంతే ప్రాయేణ భవంతి నిర్గుణాః సుఖినః

బంధనామాయంతి సుకా యథేష్టం సంచారిణః కాకః

Great people with all good qualities (‘Gunvaan’ is the exact Sanskrit word) have to take many troubles while the wicked people live peacefully. Like a parrot lives in a cage while a crow flies freely in the sky!! (Sometimes the good qualities of a person may invite trouble to him).

The meaning of the subhashita might look confusing if all the good qualities are just to invite troubles why one should try to cultivate good qualities? The answer to this question is also there in the subhashita itself with an example of parrot. A parrot even it is caged it never shows its difficulties to the others, at the same time it will never leave its dharma of chanting Rama Nama, keeps entertaining others with its grace. So even a parrot is caged, the difficulties of the parrot will not harm the bird anymore, and people care for it. On the other hand a crow even it is has freedom no one will respect it. not only a crow,  a caged parrot which speaking bad words will be respected as well.  In a nutshell, people who face difficulties as a part of their life journey will end up as winners of life.

The best examples for this given in our puranas, Lord Rama was sent to exile, but people call him and worship him as Maryada purushottam.
In mahabhaarata Pandavas went to exile once Arjuna got paasupata astra, second Lord Krishna himself helped them to get their kingdom back.  So even it is not easy to go through difficulties, but one should not lose faith in Dharma, continue to follow the same path he will attain eternity because of his good deeds and qualities.

గుణవంతులకే కష్టాలు అన్నీ, చెడ్డవారందరు సుఖంగానే వుంటారు, రామచిలుకను పంజరంలో బంధిస్తారు కానీ కాకి యథేచ్ఛగా సంచరిస్తుంది అని భావం. ఇది అందరి నోటా వింటూ ఉంటాం కూడా మనమేమో మడి కట్టుకుని కూర్చుందాం అందరూ సుఖపడుతుంటారు అని వెటకారం కూడా చేస్తారు.

ఈ సుభాషితం భావం చాలా ప్రశ్నర్థకంగా ఉంటుంది, అవును అన్ని కష్టాలు మంచివాళ్ళకే వస్తున్నప్పుడు మంచివాళ్ళగా వుంది ప్రయోజనం ఏమిటి అని మెట్ట వేదాంతం చెప్పేవాళ్ళు చాలా మంది వుంటారు. దానికి జవాబు సుభాషితంలోనే వుంది ఇక్కడ మంచి వాళ్ళను (గుణవంతులను) రామచిలుకతో పోల్చారు, ఇక్కడ రామచిలుకను పంజరంలో బందిచారు అని అది తాను చేసే రామనామం మానదు సరికదా తన కష్టం పరులకు తెలియకుండా పదిమందిని ఉత్తేజ పరుస్తుంది, అదే చిలకను చూసి మెచ్చుకుని దానికి పంచభక్ష పరమాన్నాలు పెడతారు, కావు కావు అని గోల చేసే కాకి కి ఆ స్వేచ్ఛ వున్నా చిలకకు వున్నా ఆదరణ లభిస్తుందా? ముమ్మాటికీ లభించదు.పోనీ రామనామం మాని దుర్భాషలు మాట్లాడే చిలుకకు ఆదరణ ఉంటుందా అదీ ఉండదు. అందుచేత గుణవంతులు వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఈశ్వరేచ్ఛగా శ్వీకరిస్తారు విజేతలుగా నిలబడతారు.

మన పురాణాలలోనే చాలా ఉదాహరణలు వున్నాయి

సకల గుణాభిరాముడు అని పిలువబడే రాముడే అరణ్యవాసం చేశాడు, భార్యా వియోగం తో తీవ్ర మనస్తాపం చెందాడు, అయినా తన ధర్మాన్ని వదలకుండా జీవించాడు అందుకే రాముడు దేవుడయ్యాడు.

పంచపాండవులు వనవాసంలో వున్నప్పుడు ఒకసారి పరమశివుని మెప్పించి పాశుపతం గెలుచుకున్నాడు అర్జునుడు, పాంచాలిని గెలుచుకున్నారు, మరొక్కసారి ఏకంగా పరమాత్మ  శ్రీకృష్ణుడే తమ వెంట వుంది జయం కలిగేలా చేసాడు.

అందుచేత ఇన్ని మంచిగుణాలున్న నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని నిరాశ చెంది చెడ్డవారిగా మారపోకూడదు, తన ధర్మాన్ని ఎప్పుడు వదలకుండా అంటిపెట్టుకుని వున్నవారిని కష్టాలు తాత్కాలిక ఇబ్బంది కలిగించినా చివరకు వారే విజయులు అవుతారు ఆదర్శ పురుషులవుతారు.