Salutations to mother earth

समुद्र वसने देवि परवत स्थन मन्दले 
विष्णु पत्नि नमस्तुभयम् पाद स्पर्शम् क्षमस्वमे

సముద్ర వసనే దేవీ పర్వతస్థన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే

Vasana means dress bhoodevi is wearing a dress made of samudra. Why is that so? Dress is to cover our body and make us look more beautiful, now that sanatana dharma don’t have that two piece bikini culture, we cover 70-80% of the body with the dress. If one is able to apply the logic or science 70% is covered with water, wow how scientific it is. our culture taught us indirectly the same science what was being taught in the schools in the name of advanced science.
Now come to the second part parvata stana mandale, we don’t abuse our mother with our body part’s, mother lactate milk from her breasts and that becomes life line for kids. Our mother earth is also lactating jeeva nadi rivers for us. Like we can’t imagine a kid without mother milk in the same way one also can’t imagine world without pure water. so the poet also seeing mother in the earth not just the body parts of a women.

If we start thinking and analyse there is so much science in every hymn of sanatana dharma. sometimes i get a doubt did we learn science or religion in the name of these slokas? The answer is Absolutely science. Unfortunately we became illiterate in learning science behind every hymn in the sanatana dharma. More over if some one says that sanatana dharma is a religion we blindly believe in them, that is even more foolish.

ఉదయాన్నే నిద్రలేచిన తరువాత కాలు కింద మోపే ముందు చదివే శ్లోకం తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో.
వాసం అంటే దుస్తులు లేదా నివసించటం, దుస్తులు మన అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. సముద్రవసనే దేవీ సముద్రాన్ని వాసం గా ధరించిన దేవీ అని లేదా సముద్రం మద్యలో నివసించే దేవి అని. ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? సముద్రాలని దుస్తులుగా ధరించటం ఏమిటి? కాసేపు శ్లోకం పక్కన పెట్టి సాంకేతికంగా ఆలోచించండి మన భూమి అంటే సముద్రము భూభాగాల మిశ్రమం. సాంకేతికంగా చెప్పాలంటే 70 శాతం భూమి నీటితో కప్పబడి వుంటుంది. శరీరం మొత్తం బయల్పడేలా దుస్తులు వేసుకునే పాశ్చాత్య సంస్కృతికాదు మనది. మనం కూడా శరీరాన్ని 70 శాతం దుస్తులతో కప్పుకుంటాం. అంటే మనం భూ మాత ని కూడా ఈ శ్లోకంలో సముద్రాలని దుస్తులగా ధరించావు అని చెప్పడం అన్నమాట. ఈ శ్లోకంలో అర్థమూ సాంకేతికతతో సరిపోవటం యాద్రుచికమా లేదా, మన ఋషులకి ఈ విషయం ముందే తెలుసా? ఇకపోతే శ్లోకంలో రెండవ పాదం పర్వత స్థన మండలే అంటే పర్వతాలను స్థానాలుగా కలిగిన దేవి అని. స్త్రీ శరీర భాగాలని దృష్టిలో వుంచుకుని, పర్వతాలు కూడా ఎత్తుగా వుంటాయి అని పద్యాలు రాసే నీచమైన ఆలోచన కలిగిన వారు కాదు కదా మన ఋషులు. మరి అలా రాయటంలో అర్థం ఏమిటి? మరలా కాసేపు శ్లోకాన్ని పక్కన పెట్టి నిజ జీవితంలో ఆలోచించండి, తన సంతానం ఆకలి అని వ్యక్తపరిచే స్థితిలో లేనప్పుడు ఆ సంతానం ఆకలితో వున్నప్పుడు వారు చెప్పకుండానే, అడగకుండానే అమ్మ తన స్థనాలనుంచి పాలు స్రవిస్తుంది. అమ్మ పాలు లేని సంతానాన్ని మన ఊహించటం కూడా కష్టం, అమ్మ పాలు సంతానానికి జీవనాధారం. ఇక శ్లోకంలోకి వస్తే, భూమి మీద 70 శాతం నీరు వుంది కానీ ఆ సముద్రపు నీరు మనకు పనికి రాదు. మనకూ మంచి నీరు అనే జీవనాధారం కావాలి, మన నీటి ఆర్తి ని మనం చెప్పకుండానే భూమాత, అమ్మ పర్వతాలనుంచి జీవ నదులని శ్రవించేసింది.

ఇలా ఆలోచిస్తూ పోతే మనం మంత్రం పేరుతొ చదివే ప్రతి శ్లోకానికి సాంకేతికతతో ముడి పెట్టచ్చు. అంటే మనకి సనాతన ధర్మంలో నేర్పినది దైవం, లేదా వైరాగ్యమా లేక సామాజిక శాస్త్రమా? ముమ్మాటికీ శాస్త్రమే. మన దౌర్భాగ్యం ఏమిటంటే ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానం మనకు లేకపోవటం. ఇంతటి గొప్ప సనాతన ధర్మం ఒక మతం అనే పదంతో బంధించి మనకు చెప్తే విని నమ్మేయటం అంతకన్నా మూర్ఖత్వం….

What is Dharma

धर्मं यो बाधते धर्मो न स धर्मः कुधर्म तत्

अविरोधात्तु यो धर्मः स धर्मः सत्य विक्रम

ధర్మం యో బాధతే ధర్మో న స ధర్మః కుధర్మ తత్
అవిరోధాత్తు యో ధర్మః స ధర్మః సత్య విక్రమ

Dharma is a non-translatable word originated from Bharat. A crude meaning of this word is way of life. This great subhashita says if someones way of life is obstructing or responsible for disturbances and troubles in someone else’s way life that cannot be called as dharma rather it should be called as kudharma. A way of life should only be called as dharma only if it is not troublesome for any of the living beings. That is the only dharma which will win the truth.
The greatness of sanatana dharma is it teaches the same, सर्वे भवन्तु सुखिनः means every sanatan dharma follower pray god Almighty for the peaceful living of every creature in the world. Please don’t get confused dharma with religion. In sanatan dharma also there are religions Shiva, Vaishnava etc… and some time in between there were fights between these religions too. But then sanatan dharma has greatness to assimilate those religions without their differences in it and stood as a single oldest dharma. Which means followers of those sanatana dharmic religion are able to come out of the trap of religion. In a way every blind follower of the religion has to realize that धर्मो रक्षति रक्षितः.

Unfortunately, now also in the current so called civilized scientific age also there are religions which are propagating hate towards other religions saying their god is the only God, or some other religions say you are a kaphir if you don’t follow my god and our religious texts.

ధర్మం అనే భారతీయ భాషా పదానికి పర్యాయ పదం మరే భాషలోను లేదు. ధర్మం అంటే అది ఒక జీవనశైలి. ఒకరి జీవనశైలి మరొకరికి బాధ కలిగించేదిగా వుంటే అటువంటి జీవనశైలిని ధర్మం అనే అనకూడదు, అది కుధర్మం. ఎవ్వరికీ చేటు కలిగించకుండా వుండే జీవన శైలినే ధర్మం అంటారు. అటువంటి ధర్మమే సత్య విక్రమ సత్యాన్ని గెలవగలుతుంది.

సనాతన ధర్మం గొప్పతనం అదే, సర్వే భవంతు సుఖినః అని సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతీ వ్యక్తీ పరమేశ్వరుని ప్రతి దినమూ ప్రార్థిస్తాడు. చాల మంది ధర్మము మతము ఒక్కటే అని అపోహతో వుంటారు. సనాతన ధర్మంలో కూడా శైవం, వైష్ణవం తదితర మతాలూ వున్నాయి. ఆయా మతాల మధ్యలో, నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అనే కొంతకాలం కలహాలు కుడా చెలరేగాయి. కాని సనాతనధర్మం ఆయా మతాలలో భేద భావాలను, విద్వేషాలను దూరం చేసి సామాజిక స్పృహ పెంపొందించింది. అంటే ఆయా మతాలవారు మతం అనే ఉచ్చులో నుంచి బయటపడి సనాతన ధర్మం బోధించే సామాజిక సమరసతను ఆనందించసాగారు. అంటే గ్రుడ్డిగా మతాన్ని అవలంబించే వారు ధర్మో రక్షతి రక్షితః అని అర్థం చేసుకోవాలి.

దురదృష్ట వశాత్తు నేటికీ సాంకేతిక నాగరిక సమాజంలో కొన్ని మతాలు వారి మతమే గొప్పదని, వారు ఆరాధించేదే దైవమని, మరి కొన్ని మతాలు వారి ఆరాధ్య దైవాన్ని కాక ఎవరినైనా పూజుస్తే వారిని కాఫిర్ అని మత మౌడ్యాన్ని ప్రజల మీద రుద్దుతున్నాయి.

దాంపత్యం

పార్వత్యాః వరపాణి పల్లవతలే యాః పద్మరాగారుణా
క్షిప్తాః శంభు శిరస్థలే ప్రవిమలాః గంగాంబు బిందు ప్రభాః
స్రస్తాః శారద నీరదోపమ తనుద్యుత్యాం విలీనాశ్చతాః
ముక్తాః వాం శివదా భవన్తు గిరిజా శ్రీకంఠ వైవాహితాః

पार्वत्याः वरपाणि पल्लवतले याः पद्मरागारुणा
क्षिप्ताः शंभु शिरस्थले प्रविमलाः गंगांभु बिंदु प्रभाः
स्रसताः शारद नीरदोपम तनुद्युत्यां विलीनाश्चताः
मुक्ताः वां शिवदा भवन्तु गिरिजा श्रीकंठ वैवाहिताः

శివ పార్వతుల కళ్యాణ ఘట్టం:
పార్వతి యొక్క పల్లవం అంటే పువ్వులు పువ్వుల వంటి పాణి అంటే చెయ్యి చేతిని తాక గలిగిన వరం పొందిన ముత్యాల తో చేయబడిన తలంబ్రాలు అమ్మ ఎర్రని గోరింట పండిన చేతిలో పద్మ రాగాలలాగ అరుణా అంటే ఎర్రగా కనిపిస్తున్నాయిట, అవే తలంబ్రాలు క్షిప్తా అంటే రాత్రి నలుపు కి ప్రతీక శంభు శిరస్థలే అంటే పరమశివుని నల్లని జటాజూటం మీద పడి గంగాంబు బిందు ప్రభా అంటే పవిత్రమైన గంగ నీటి బొట్టు వలే మెరిసిపోతున్నాయట ఎంత చీకటైనా పక్కనే చంద్ర కాంతి వుంది కదా, అవే తలంబ్రాలు స్రస్తా అంటే విడిపెట్టిన అని శరత్ కాలంలో నీరదం మేఘం వదలి పెట్టినట్లు జల జలా పరమశివుని తనువు మీద పడి తెల్లని శివుని కాంతిలో కలిసి తనువులోనే విలీనం అయిపోయినట్టు అనిపిస్తన్నాయిట. గిరిజ వివాహంలో ఆ ముత్యాలు శివదా భవంతు మనకు శుభం కలిగించు గాక అని శ్లోకం. చాలా మంది పెళ్ళిళ్ళలో శుభలేఖలమీద జానక్యాః కమలామలాంజలి పుటేయాః అని సీతారాముల కళ్యాణ ఘట్టం గురించిన శ్లోకం రాసి ఆయా నూతన దంపతుల జీవితం సీతారాముల వలే ఆదర్శ ప్రాయంగా వుండాలని దీవిస్తారు. ఈ పై శ్లోకం ఆది దంపతులు శివపార్వతుల కళ్యాణ ఘట్టంలోనిది. మా పెళ్ళి శుభలేఖ మీద ఇదే శ్లోకం ప్రచురించారు.

During the wedding of Lord Shiva and Parvati, the akshatas made of perls in the red hand of parvati looked likes natural ruby stone, and then from there when she left on the dark black head of shiva are shining like pure ganga drops, the same perls again when they were falling down like clouds raining during monsoon season are getting merged with the white color of lord shiva, such akshatas may give you love and prosperity. Normally many people would have read a sloka on the wedding invitation about Lord Sita & Rama जानक्याः कमलामलान्जलि पुटेयाः… By writing this sloka our elders are wishing the newly wed couple to lead a role model marital life sita rama. The above sloka is also of the similar type but shiva parvati are known as aadi dampati means first couple. On our wedding invitation this shiva parvati sloka was printed.

ఏ కోరిక లేని శివుడు మన్మధుని భస్మం చేసిన శివుడు పార్వతితో కలసి ఎందుకుంటాడు అని అనుమానం రావచ్చు. దానికి చమత్కారంగా ఈ పద్యం చెబుతారు.

Lord shiva doesn’t have any wishes and requirements, he even killed manmadha for disturbing him during his tapasya, then why did married parvati? With a little wit this sloka is told to answer this question.

అసారభూతే సంసారే, సారభూతా నితంబినీ,
ఇతి సంచిత్య వై శంభుః, అర్ధాంగే కామినీం దధౌ.

असारभूते संसारे सारभूता नितंबिनी
इति संचित्य वै शंभुः अर्धाड्गे कामिनीम दधौ

సృష్టి జరగిన తరువాత పరమశివునికి, అసారభూతే సంసారే అంటే ఈ సృష్టి లో సారమేలేదు అని అనిపించిందిట, మరి సారం అంతా ఎక్కడుంది అని పరికించి చూస్తే సారభూతా నింతిబినీ అంటే అందమైన నడుము కలిగిన అమ్మ పార్వతి లో కనిపించిందిట వెంటనే తన శరీరంలో శరీరంలో అర్థభాగం ఇచ్చి సారాన్ని తన సొంతం చేసుకున్నాడట పరమశివుడు. ఎంత గమ్మత్తయిన ఊహ…

When lord paramaSiva looked at the world that is created, it seems he felt that the world is so lifeless or without saara (असारभूते संसारे), then he started searching for the saara and found in nitambini सारभूता नितंबिनी (a beautiful lady with well developed hips) which mother parvati. Immediately then Sambhu, gave his half body to keep that saara with him only. what a beautiful thought.

Like in the above sloka, i am a person without any saara, she became the saara in me after our wedding. Today is our 10th wedding anniversary. I pray to the lord shiva parvati and all our elders for our joy and prosperity.

ఈ రోజుకి అమ్మానాన్నలు పెట్టిన శ్రీరామకృష్ణ పేరులో శ్రీ సార్ధకం అయ్యి నేను శ్రీమంతుడినయ్యి ఒక దశాబ్ది పూర్తి అయ్యింది, ఈ రోజు మా 10వ పెళ్ళి రోజు. ఏ సారం లేని నాకు సారం అంతా తనే అయ్యింది నా అర్ధాంగి. ఇలాగే ఆ ఆదిదంపతుల, పెద్దల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మాతో వుండాలని ఆశిస్తూ….

సనాతన ధర్మం అంటే…

సనాతన ధర్మం అంటే ఏమిటో ఒక్క మాటలో చెప్పగలిగే నిర్వచనం కాదు. సనాతన అంటే ఎప్పుడూ వుండేది అని అర్థం, ఇంచుమించు శాశ్వతానికి పర్యాయపదం.

ధర్మం అంటే సత్యాన్ని కాపాడుకుంటూ వుండే ఒక జీవనశైలి (ఇంచు మించు నాగరికత అని అనవచ్చు). మరి సత్యం అంటే ఏమిటి అని అడుగుతారేమో…

నారదుడు ఇంద్రుడి చెరనుండి ప్రహ్లాదుడి తల్లిని (ప్రహ్లాదుడు గర్భంలో వున్నప్పుడు) విడిపించి తనకు సత్యం అంటే ఏమిటో ఇలా చెప్తాడు.

సత్యస్య వచనం శ్రేయః సత్యాదపి హితం వదేత్

యావత్భూతానాం హితం ఏతత్ సత్యం మతం మమ.

నిజం మాట్లాడటం మంచిది, నిజం కన్నా హితం మాట్లడటం అలవాటు చేసుకోవాలి. యావత్ భూతానాం అంటే సకల చరాచర జగత్తుకు హితం చేసేది సత్యం అని నా అభిమతం అంటాడు.

ఇక్కడ ముఖ్యంగా మూడు పదాలున్నాయి ఒకటి సత్యం, మతం చివరగా ధర్మం. నారదుడంతటివాడు ఇది సత్యం నా అభిమతం అన్నాడు, మతిః ఇతి మతం అంటే ఒకరి ఆలొచనలనుంచి పుట్టేది మతి దాన్ని ఆచరిస్తే అది మతం. కానీ అందరి ఆలోచనలు అందరికీ హితం చేసేలా వుండవు కదా, ఆయా ప్రకారంగా మతాలూ వాటి బోధనలు ఏర్పడ్డాయి. నారదుడి ఆలోచన ప్రకారం రాక్షస రాజు భార్యని బిడ్డను కాపాడటం హితం (యావత్ భూతానాం ) కాబట్టి దాన్ని కాపాడటం ధర్మం.

ధర్మం అనే పదానికి పర్యాయ పదాలు లేవు. అసలు ధర్మం అనే పదం వేరే ఏ దేశ భాషలలోను లేదు. వారికి అర్థం అయినంత వరకు మతమూ ధర్మమూ ఒక్కటే, మన దురదృష్ట వశాత్తూ భావదాస్యంలో వున్న మనం మన గొప్పతనాన్ని మరిచి వారు చెప్పిన నిర్వచనాలు అవలంబించాలో లేదో తెలియని అయోమయ స్థితికి దిగజారిపోయాం. పాస్చాత్య నిర్వచనం ప్రకారం మతం అంటే ఒక గ్రంధం ఒక దేవుడు ఓకే ప్రవక్త ఉండాలి, మరి హైందవం ఆకోవలోకి రాదు కానీ దాన్ని బలవంతంగా హిందూ ధర్మాన్ని హిందూ మతం అని వ్యవహరించటం మొదలు పెట్టాం.

నిజానికి సప్త సింధు అంటే 7 నదుల మధ్య వున్నా భూభాగంలో వున్న ప్రజలు అవలంబించిన జీవనశైలి సింధు నాగరికత ఆ సింధు కాలక్రమేణా హిందూ రూపంతరం చెందింది. ఇది హిందూ ధర్మం అని అనకూడదు సనాతన ధర్మం అని అనాలి ఎందుకంటే, ఈ విధమైన భారతీయ జీవన శైలి ఎప్పుడు నుండి అవలంబించటం మొదలు పెట్టారో ఎవ్వరికీ తెలియదు ఎన్ని యుద్ధాలు దండయాత్రలు జరిగిన చెదిరిపోకుండా నిలబడింది అందుకే అది సనాతనం అయ్యింది. సనాతన ధర్మం కాకుండా ప్రపంచ పటంలో ~49 రకరకాల జీవన శైలులు (నాగరికతలు) వున్నాయి అని చరిత్ర (ఈజిప్టియన్లు , మెసపొటేమియన్లు , రోమన్లు , గ్రీకులు, మయాన్లు , కుషాణులు ఇంకా చాలా…) కానీ మతాంధకారంలో జరిగిన దండయాత్రల వలన ఆ జీవన శైలులన్నీ తుడిచిపెట్టుకుపోయి కేవలం క్రిస్టియన్, ఇస్లాం లాంటి మతాలుగా మారిపోయాయి. కానీ సనాతన ధర్మం మాత్రం ఎన్ని దండయాత్రలు చవిచూసినా చెక్కు చెదరలేదు అందుకే సనాతనం.
సనాతన ధర్మం గురించి ఇంకొక్క మాట గర్వంగా చెప్పుకోగలిగినది ఏమిటి అంటే

భగవత్గీత లో కృష్ణుడు జాతస్య హి మరణం ధృవం అంటే పుట్టిన వాడు మరణిస్తాడు, మరణించిన వాడు వేరే రూపంలో మళ్ళీ పుడతాడు అని చెబుతాడు. మరి ఆలోచనల ద్వారా వచ్చిన మతాలకి పుట్టుక వుంది కాబట్టి వాటికి ఒక జీవన కాలం ఉంటుంది అది చరిత్ర ద్వారా మనకు తెలుసు కూడా, సనాతన ధర్మం పుట్టుక లేనిది అంటే దానికి జీవన కాల పరిమాణం కూడా ఉండదు అది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది.

అదీ నాకు తెలిసిన నాకు అర్థం అయ్యిన సనాతన ధర్మం కథ.

Teacher-Student relationship గురుశిష్య బంధం

Recently i watched a scene from swami vivekananda movie. Though i watched this movie many times, I felt this scene very heart touching. It really depicted the relationship between guru and sishya, the relationship between Ramakrishna paramahamsa and Swami Vivekananda. The experience of watching this scene visually can’t be explained in words. On top of that when ever watch this scene, some how i felt like i am listening to veda mantras in the back ground, and this sloka is coming into my mind again and again.

ॐ सहनाववतु सहनौभुनक्तु
सहवीर्यंकरवावहै
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै
ॐ शांति शांति शांतिः

this is a shanti matra from kenopanishad, many people recite this mantra before taking food and think that this is bhojan mantra. This mantra is clear depiction of the relation between the guru and sishya. Both guru and sishya are praying the god almighty.

सहना ववतु may the god bless us when we (both guru & sishya) live together,
सहनौ भुनक्तु may the god give us food so that we (both guru & sishya) eat together (probably this is the reason this mantra is used as bhojana matra)
सह वीर्यम् करवावहै,may the god help us so that we together use our (both guru & sishya) cumulative energy to complete the task.
तेजस्विनावधीतम्स्तु in the process of learning let our (both guru & sishya) cherisma improve.
मा विद्विषावहै don’t let the any of the differences to enter in between us (both guru & sishya).

Peace peace peace.

In the grammar of any language there are two degrees of speech one singular and plural. But the beauty of Sanskrit is it has dual.
This entire sloka is written in that dual form of speech. One may wonder if there are 100 students and one teacher how can this be a dual form of speech instead of plurality. It should be duality it the relationship between the teacher and individual student. So one teacher will have 100 individual dual relationship we call it as one-to-one relationship but not one-to-many.

At the end we have peace recited three times. In the life anyone may encounter three different types of difficulties or obstacles they are,
aadi daivika: God sent such as natural calamity. (Things that we or no one has a control over them)
aadi bhoutika: Physical like a fire accident (Things that are affecting us due to some others actions or mistakes, this also we don’t have much control)
and aadi aatmika: personal things like lack of faith, insincerity, lethargy etc… (Things we can control and correct by continuous practice and prayers)

Invoke peace three time to reduce the influence of such obstacles.

ఈ మద్య స్వామీ వివేకానంద చలనచిత్రంలో ఒక సన్నివేసం చూసాను. నేను ఆ సినిమా చాలా సార్లు చూసినా, ఈ సన్నివేసంలో శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానందల మద్య గల గురుశిష్యల సంబంధం హత్తుకునేలా చూపించారు. ఆ సన్నివేసం చూసినప్పుడల్లా నన్ను నేను మరిచిపోయాను. పైగా నాకు వెనకాల వేదమంత్రాలు వినిపించినట్లు అనిపించింది. ముఖ్యంగా ఈ క్రింద శ్లోకం…

ఓం సహనా వవతు సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతి శాంతి శాంతిః

ఇది కేనోపనిషత్తులోని శాంతి మంత్రం. గురు శిష్యుల మద్య సంబందం ఎలావుండాలో చెప్పిన మంత్రం. చాలామంది దీన్ని శాంతి మంత్రంగా చదివి విని వుంటారు, ఇంకొందరు దీనిని భోజన మంత్రంగా కూడా విని వుంటారు. నిజానికి చెప్పాలంటే భోజనానికి ఈ మంత్రానికి సంబంధంలేదు. గురు శిష్యలు పరమేశ్వరుని పూజించేమంత్రం ఇది.

సహనా వవతు: మన ఇద్దరినీ పరమేశ్వరుడు రక్షించు గాక.
సహనౌ భునక్తు: మనిద్దరినీ ఆ పరమేశ్వరుడు కలసి భుజించటానికి సరిపడు ఆహారం ఇచ్చు గాక. (ఇక్కడ భోజనం గురించి వచ్చింది కాబట్టి దీన్ని భోజన మంత్రంగా వాడి వుండవచ్చు)
సహవీర్యం కరవావహై: మన మిరువురము శక్తివంతులమై శ్రమించెదము గాక.
తేజస్వినావధీతమస్తు: మన అధ్యయనము తేజోవంతము అగు గాక.
మావిద్విషావహై: మనం ఇద్దరమూ ఎప్పుడు ద్వేషము లేకుండ మెలుగుదుము గాక.

ఓం శాంతి శాంతి శాంతిః

ప్రతీ భాషలోనూ ఏక వచనం, బహు వచనం అని రెండు వుంటాయి. సంస్కృతంలో గొప్పతనం ఇక్కడ ద్వి వచనం వుంటుంది. ఈ మంత్రం మొత్తం ద్వి వచనంలో రాయబడింది. ద్వివచనానికి అంత ప్రాధాన్యత ఎందుకు అనుకుంటారేమో.
ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు, 100 మంది విద్యార్ధులు ఉంటే బహు వచనంకదా వాడాలిసినది, ద్వివచనం ఎందుకు అని అనుమానమూ రావచ్చు. గురు శిష్యుల మద్య సంబంధం ఏక-అనేక గా వుండకూడదు. ఏక-ఏక గా వుండాలి అందుకే ద్వి వచనానికి అంత ప్రాధాన్యత. అదే మన సంస్కృతి గొప్పతనం.

చివరగా ప్రతీ శాంతి మంత్రానికి మూడు సార్లు శాంతి అని చదువుతాము. సాధారణంగా జీవితంలో ఎదుర్కునే సమస్యలను మూడురకాలుగా చెబుతారు.

ఆది దైవిక: దైవం వలన సంభవించేవి (ప్రళయం, తుఫాను, భూకంపం ఇలా). వీటిని మన ఆధీనంలో తీసుకోలేము, వాటిని పరిగణించి మన జీవితం పాడు చేసుకోలేము.
ఆది భౌతిక: చిన్న చిన్న ప్రమాదాల వంటివి పక్కవారి (తెలసి తెలియని) తప్పిదాల వలన మనకు ఎదురయ్యే ఇబ్బందులు. వీటని కాస్త జాగ్రత్తతో వుండటం వలన అధిగమించవచ్చు.
ఆది ఆత్మిక: ఇవి పూర్తగా మన అజాగ్రత్త, మన సోమరితనం, మన దుర్గుణాల వలన వచ్చేవి, వీటిని మన ప్రయత్నంతోనే దూరంచేసుకోవాలి.
మూడుసార్లు శాంతి చెబుతూ ఇటువంటి సమస్యల ప్రభావంనుంచి శాంతి పొందాలనే ప్రార్ధన.