కొన్ని విషయాలు ఎలా/ఎందుకు నశిస్తాయి? : How/Why things perish?

निर्गुणस्य हतं रूपं दु:शीलस्य हतं कुलम्। 
असिद्धस्य हता विद्या अभोगस्य हतं धनम् ।।

నిర్గుణస్య హతం రూపం దుఃశీలస్య హతం కులం
అసిద్ధస్య హతా విద్యా అభోగస్య హతం ధనం

This subhashita says about things why they perish.
1. Beauty of the virtueless or lack of quality.
Beauty without virtue is like body without soul– it is fey and can’t last long.
2. Leanage of Wicked
Like a rotten apple injures all its companion, a wicked member destroys his entire family.
3. knowledge of the undeserving
Knowledge of the undeserving is the most deadly weapon for self-destruction.
4. Wealth of the unenjoyer
Wealth is meant to be enjoyed; those who preserve and protect it without enjoying it, lose it eventually.

ఈ సుభాషితము రకరకాల విషయాలు ఎలా ఎందుకు నశించిపోతాయో తెలియచేస్తుంది.
1. గుణం లేని రూపం
గుణహీనమైన రూపం ప్రాణం లేని శరీరంతో సమానం, అటువంటి శరీరం ఎంతో కాలం వుండదు.
2. దుశ్శీలస్య హతం కులం
చెరుకు తుద వెన్నుపుట్టిన చెరుకు తీపెల్ల చెరచు అన్నట్లు ఒక్క దుశ్శీలవంతుడి వలన అతని వంశం మొత్తం నాశనం అవుతుంది
3. అసిద్ధస్య హతా విద్యా
విద్య వలన మనకు అష్ఠసిద్ధులు లభిస్తాయి. విద్యకు పరమార్దం కైవల్యం మోక్షం. అటువంటి సిద్ధులు నేర్పలేని కైవల్యపదాని దారి చూపలేని విద్య నాశనం అయిపోతుంది మరచిపోతాము.
4. అభోగస్య ధనం
దాన ధర్మాలు చేయకుండా ఎటువంటి భోగమనుభవించకుండా దాచిపెట్టిన ధనం చివరకు దొంగలపాలు అయి నశిస్తుంది.

Advertisements

Medhavi

नापृष्टः कस्यचिद्भ्रूयान्नचान्यायॆन पृच्छतः
जानन्नपि च मेधावी जडवल्लॊक आचरेत्

నాపృష్టః కస్యచిద్బ్రూయాన్నచాన్యాయేన పృచ్ఛతః,
జానన్నపి చ మేధావీ జడవల్లోక ఆచరేత్.

पद विभाग:
कस्यचिद भ्रूयात न अपृष्टः न अन्यायेन पृच्छतः
जानन् अपि च मेधावी जडवत् लोक आचरेत्

Until asked for help or suggestion one should never take initiative and tell, in the same way, one should never answer to a person who is asking with bad intentions. A noble knowledgeable person will behave like an illiterate, he will open up his flow of knowledge only when asked with right intentions of learning. Sage narada is one best example for this subhashita, everyone looked at narada muni as kalaha bhojana (instigator of quarrels). To same narada muni when valmiki asked about an ideal person’s existance, narada muni told 100 slokas of sankshepa ramayana, which in turn gave sage valmiki an inspiration to write 24000 slokas of srimadraamayanam.

పదాల అన్వయ క్రమం:
కస్యచిద్ భ్రూయాత్ న అపృష్టః, న అన్యాయేన పృచ్ఛతః
జానన్ అపి చ మేధావీ జడవత్ లోక ఆచరేత్

ఎవరికీ (అపృష్టః) అడగకుండా (కస్యచిద్ న భ్రూయాత్) చెప్పకూడదు. (అన్యాయేన) అన్యాయంగా (నిజంగా తెలుసుకుందామని కాక వేరే ఆలోచనలతో) అడిగేవారికీ చెప్పకూడదు (కస్యచిద్ న భ్రూయాత్). మేధావి తనకు తెలిసినా లోకంలో ఏమీ తెలియనివానిలా (జడ పదార్ధంలాగా) ఉండాలి. నేర్చుకోవాలనే తపనతో అడిగినప్పుడు మాత్రం ఆ మేధావిలోని జ్ఞాన గంగ పొంగి బయటకి వస్తుంది. వాల్మీకి రామాయణానికి మూలం ఇదే.  అందరూ నారదుడిని కలహ భోజనుడు అని అవహేళన చేస్తారు, కానీ అదే నారదుడిని వాల్మీకి ఆదర్శ పురుషుడి గురించి అడిగినప్పుడు “నారదం పరి పప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం”, నారదుడు చెప్పిన 100 శ్లోకాలు (సంక్షేప రామాయణం), 24000 శ్లోకాల శ్రీమద్రామాయణంగా రాయగలిగేటంతగా ప్రేరేపించింది.