ఆదర్శ పురుషుడి గుణగణాలు

రామాయణం ఒక గొప్ప సందేశం:— వాల్మీకి మహా ముని నారదునితో ఇలా అడిగాడు….

కోన్వస్మిన్సామ్ప్రతం లోకే గుణవాన్కశ్చ వీర్యవాన్ .ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత:৷৷1.1.2৷৷ 
అస్మిన్ లోకే గుణ వాన్ కః?  ఈలోకంలో చెప్పబడిన సద్గుణాలన్నీ కలిగిన వాడు, వీరు ల్లో కెల్లా వీరుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు సత్య వాక్ పరిపాలకుడు, ఈ లోకంలో వున్నాడా?
చారిత్రేణ చ కో యుక్తస్సర్వభూతేషు కో హిత: .విద్వాన్క: కస్సమర్థశ్చ కశ్చైకప్రియదర్శన: ৷৷1.1.3৷৷
అతని చరిత్రలో ఎటువంటి మచ్చ లేని వాడు, సర్వ భూతాలకూ హితం మాత్రమే చేయదలిచేవాడూ, సర్వ విద్యలూ నేర్చుకున్నవాడూ సమర్ధుడూ,మళ్ళీ మళ్లీ చూడాలనిపించే ప్రియ దర్శి ఉన్నాడా?
ఆత్మవాన్కో జితక్రోధో ద్యుతిమాన్కోనసూయక: కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ৷৷1.1.4৷৷ 
ఆత్మవాన్ కః? తనను తాను నిగ్రహించుకోగలిగేవాడు, క్రోధాన్ని జయించినవాడూ అసూయ లేనివాడూ, ఎవరి రోషంతో దేవతలు కూడా భయభ్రాంతులవుతారో అటువంటి వాడు ఈ భూలోకంలో వున్నాడా?
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవంవిధం నరమ్ ৷৷1.1.5৷৷
ఇటువంటి గుణాలున్నవాడు ఈ భూలోకంలో వున్నాడా నాకు చాలా కుతూహలం గా వుంది అన్నిటా సమర్ధుడైన అటువంటి వాడి గురించి ముల్లోకాలూ చుట్టే మీకు తెలిస్తే వినాలనుంది అని వాల్మీకి నారదం పరిపపృచ్ఛ అంటే పరి పరి విధాల గుచ్చి అడిగాడు.
దానికి నారదులవారు ఇలా జవాబుచెప్పారు. జగ్రత్తగా విను నువ్వడిగిన గుణాలన్నీ కలిగిన వాడు దొరకటం అరుదు, సామాన్యమైన విషయం కాదు. కానీ అలాంటి గుణాలున్నవాడు ఈ లోకంలో ఒక్కడున్నాడు
ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైశ్శ్రుత: .నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ధృతిమాన్ వశీ ৷৷1.1.8৷৷ 
నియతాత్మ అంటే శరీర మనో నిగ్రహం కలిగినవాడూ, మహా వీరుడూ, ధ్యుతిమాన్ అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగిన శక్తి వున్నవాడూ, ధృతిమాన్ ధృతి అంటే వెగం, వెగంగా సమస్య పరిషరిచగలిగె శక్తి వున్నవాడూ, చివరగా వశీ అంతె తన మంచితనంతో అందరినీ వశపరుచుకునే వాడూ ఒకడు  వున్నాడు.
బుద్ధిమాన్నీతిమాన్వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణ: .విపులాంసో మహాబాహు: కమ్బుగ్రీవో మహాహను: ৷৷1.1.9৷৷
బుద్ధిమంతుడూ, నీతిమంతుడూ, వాగ్వీ అంటే వేదాలను చదువుకున్నవాడూ శ్రీమాన్ అంటే లక్ష్మీ కటాక్షంతో మంగళకరంగా వున్నవాడు, శత్రువులను నాశనం చేసేవాడూ, ఆజానుబాహుడూ, శంఖంలాంటి మెడ, గుండ్రని చెక్కిళ్ళు వున్నవాడు,
అతడే, ఇక్ష్వాకు వంశంలో ప్రభవించి రాముడనే పేరుతో ప్రజలు పిలిచుకుంటారు. శ్రీరాముడు సకల గుణాభిరాముడు, రాముని గుణాలను వర్ణించటానికి భాషకు పదాలు చాలవు అని నారదుడు జవాబు చెప్పాడు.
రామాయణం ఇతిహాసమా పురాణమా అనే ప్రశ్న పక్కన పెడితే మనకు వాల్మీకి రామాయణం ద్వారా ఒక ఆదర్శ పురుషుడి ఆవిష్కారం జరిగింది. ఒక్క రాముని గుణాలను తెలుసుకుని జీవితంలో ఆచరణలో పెడితె చాలు మన జన్మ సార్ధకం అయిపొతుంది. ఇలా రాముని గుణాలను రామయణంలో మూడు చోట్ల ఆవిష్కరించారు. సమయం వచ్చినప్పుదు మిగితా గుణాలను కూడా వివరించే ప్రయత్నం చేస్తాను.
బాపు గారి శ్రీరామరాజ్యం సినిమాలో ఇన్ని గుణాలను ఒక్క పాటలో జొన్నవిత్తుల వారు చాలా అందంగా చెప్పారు
ఒక  నాడు నారద  మహర్షుల వారిని నెనొక ప్రశ్న అడిగాను
ఎవడున్నాడీ  లొకంలొ ఇదివరకెరుగనివాడు ఎవడున్నాడీ కాలంలొ సరియగు నడవడివాడు 

నిత్యము  సత్యము పలికే వాడు, నిరతము ధర్మము నిలిపే వాడు  

చేసిన మేలు మరువని వాడు, సుర్యునివలనే  వెలిగేవాడు

యెల్లరికి చలచల్లని వాడు, యెద నిండా దయ గల వాడు

ఎవడు ఎవడు ఎవడూ?

అపుడు నారద మహర్షులవారు ఇలా సెలవిచ్చారు 

ఒకడున్నాడీ  లోకంలో ఓం కారానికి సరిజోడు 

ఇనకులమున ఈ  కాలంలో జగములు పొగిడే  మొనగాడు 

విలువలు కలిగిన విలుకాడు, పలు సుగుణాలకు చెలికాడు 

చెరగని నగవుల నెలరేడు, మాటకు నిలబడు ఇలరేడు

దశరథ తనయుడు దానవ దమనుడు జానకి రమణుడు 

అతడే శ్రీరాముడూ శ్రీ… రాముడు…

Teacher-Student relationship గురుశిష్య బంధం

Recently i watched a scene from swami vivekananda movie. Though i watched this movie many times, I felt this scene very heart touching. It really depicted the relationship between guru and sishya, the relationship between Ramakrishna paramahamsa and Swami Vivekananda. The experience of watching this scene visually can’t be explained in words. On top of that when ever watch this scene, some how i felt like i am listening to veda mantras in the back ground, and this sloka is coming into my mind again and again.

ॐ सहनाववतु सहनौभुनक्तु
सहवीर्यंकरवावहै
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै
ॐ शांति शांति शांतिः

this is a shanti matra from kenopanishad, many people recite this mantra before taking food and think that this is bhojan mantra. This mantra is clear depiction of the relation between the guru and sishya. Both guru and sishya are praying the god almighty.

सहना ववतु may the god bless us when we (both guru & sishya) live together,
सहनौ भुनक्तु may the god give us food so that we (both guru & sishya) eat together (probably this is the reason this mantra is used as bhojana matra)
सह वीर्यम् करवावहै,may the god help us so that we together use our (both guru & sishya) cumulative energy to complete the task.
तेजस्विनावधीतम्स्तु in the process of learning let our (both guru & sishya) cherisma improve.
मा विद्विषावहै don’t let the any of the differences to enter in between us (both guru & sishya).

Peace peace peace.

In the grammar of any language there are two degrees of speech one singular and plural. But the beauty of Sanskrit is it has dual.
This entire sloka is written in that dual form of speech. One may wonder if there are 100 students and one teacher how can this be a dual form of speech instead of plurality. It should be duality it the relationship between the teacher and individual student. So one teacher will have 100 individual dual relationship we call it as one-to-one relationship but not one-to-many.

At the end we have peace recited three times. In the life anyone may encounter three different types of difficulties or obstacles they are,
aadi daivika: God sent such as natural calamity. (Things that we or no one has a control over them)
aadi bhoutika: Physical like a fire accident (Things that are affecting us due to some others actions or mistakes, this also we don’t have much control)
and aadi aatmika: personal things like lack of faith, insincerity, lethargy etc… (Things we can control and correct by continuous practice and prayers)

Invoke peace three time to reduce the influence of such obstacles.

ఈ మద్య స్వామీ వివేకానంద చలనచిత్రంలో ఒక సన్నివేసం చూసాను. నేను ఆ సినిమా చాలా సార్లు చూసినా, ఈ సన్నివేసంలో శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానందల మద్య గల గురుశిష్యల సంబంధం హత్తుకునేలా చూపించారు. ఆ సన్నివేసం చూసినప్పుడల్లా నన్ను నేను మరిచిపోయాను. పైగా నాకు వెనకాల వేదమంత్రాలు వినిపించినట్లు అనిపించింది. ముఖ్యంగా ఈ క్రింద శ్లోకం…

ఓం సహనా వవతు సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతి శాంతి శాంతిః

ఇది కేనోపనిషత్తులోని శాంతి మంత్రం. గురు శిష్యుల మద్య సంబందం ఎలావుండాలో చెప్పిన మంత్రం. చాలామంది దీన్ని శాంతి మంత్రంగా చదివి విని వుంటారు, ఇంకొందరు దీనిని భోజన మంత్రంగా కూడా విని వుంటారు. నిజానికి చెప్పాలంటే భోజనానికి ఈ మంత్రానికి సంబంధంలేదు. గురు శిష్యలు పరమేశ్వరుని పూజించేమంత్రం ఇది.

సహనా వవతు: మన ఇద్దరినీ పరమేశ్వరుడు రక్షించు గాక.
సహనౌ భునక్తు: మనిద్దరినీ ఆ పరమేశ్వరుడు కలసి భుజించటానికి సరిపడు ఆహారం ఇచ్చు గాక. (ఇక్కడ భోజనం గురించి వచ్చింది కాబట్టి దీన్ని భోజన మంత్రంగా వాడి వుండవచ్చు)
సహవీర్యం కరవావహై: మన మిరువురము శక్తివంతులమై శ్రమించెదము గాక.
తేజస్వినావధీతమస్తు: మన అధ్యయనము తేజోవంతము అగు గాక.
మావిద్విషావహై: మనం ఇద్దరమూ ఎప్పుడు ద్వేషము లేకుండ మెలుగుదుము గాక.

ఓం శాంతి శాంతి శాంతిః

ప్రతీ భాషలోనూ ఏక వచనం, బహు వచనం అని రెండు వుంటాయి. సంస్కృతంలో గొప్పతనం ఇక్కడ ద్వి వచనం వుంటుంది. ఈ మంత్రం మొత్తం ద్వి వచనంలో రాయబడింది. ద్వివచనానికి అంత ప్రాధాన్యత ఎందుకు అనుకుంటారేమో.
ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు, 100 మంది విద్యార్ధులు ఉంటే బహు వచనంకదా వాడాలిసినది, ద్వివచనం ఎందుకు అని అనుమానమూ రావచ్చు. గురు శిష్యుల మద్య సంబంధం ఏక-అనేక గా వుండకూడదు. ఏక-ఏక గా వుండాలి అందుకే ద్వి వచనానికి అంత ప్రాధాన్యత. అదే మన సంస్కృతి గొప్పతనం.

చివరగా ప్రతీ శాంతి మంత్రానికి మూడు సార్లు శాంతి అని చదువుతాము. సాధారణంగా జీవితంలో ఎదుర్కునే సమస్యలను మూడురకాలుగా చెబుతారు.

ఆది దైవిక: దైవం వలన సంభవించేవి (ప్రళయం, తుఫాను, భూకంపం ఇలా). వీటిని మన ఆధీనంలో తీసుకోలేము, వాటిని పరిగణించి మన జీవితం పాడు చేసుకోలేము.
ఆది భౌతిక: చిన్న చిన్న ప్రమాదాల వంటివి పక్కవారి (తెలసి తెలియని) తప్పిదాల వలన మనకు ఎదురయ్యే ఇబ్బందులు. వీటని కాస్త జాగ్రత్తతో వుండటం వలన అధిగమించవచ్చు.
ఆది ఆత్మిక: ఇవి పూర్తగా మన అజాగ్రత్త, మన సోమరితనం, మన దుర్గుణాల వలన వచ్చేవి, వీటిని మన ప్రయత్నంతోనే దూరంచేసుకోవాలి.
మూడుసార్లు శాంతి చెబుతూ ఇటువంటి సమస్యల ప్రభావంనుంచి శాంతి పొందాలనే ప్రార్ధన.

ఆనతి నీయ్యరా…

ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిది చేరగా

ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిది చేరగా

ఆనతి నీయరా హరా  

తన మీద దయ చూపని గురువుగారి ని శివుని తో పోల్చి గురువుని స్తుతించటానికి, (పూజించటానికి) గురువు సన్నిధి చేరటానికి సమ్మతి (అనుమతి) కోరటం ఈ పాట లోని ప్రత్యేకత. 

నీ ఆన లేనిదే రచింప జాలున వేదాల వాణితో విరించి విశ్వ నాటకం

నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయతో మురారి దివ్యపాలనం

వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై

వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై

 కదులును గా సదా సదాశివ ఆనతి నీయరా హరా 

ని నీ స ని ప నీ ప మ గ స గ ఆనతి నీయరా

అచలనాధ అర్చింతును రా ఆనతి నీయరా

 పమ పని పమ పని పమ పని గమ పని

సని సగ సని సగ సని సగ పని సగ

గమగసా నిపమ గమగస మగసని ఆనతి నీయరా  

జంగమ దేవర సేవలు గొనరా

మంగళ దాయక దీవెనలిడరా

సాష్ఠాంగమున దండము చేతు ర ఆనతి నీయరా 

ఇక్కడ పరమ శివుని (తన గురువు)  గొప్పతనాన్ని చెప్పటానికి ప్రయత్నం చేయతం జరిగింది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఆ విషయాన్నే మరింత గొప్పగా వివరించతం జరిగింది. నీ (శివుడు) ఆజ్ఞ లేకుండా విరించి అంటే బ్రహ్మ దేవుడు కూడా వేదాల రూపంలో విశ్వనాటకాన్ని రచించ గల్గేవాడేకాదు, శివుని అనుమతి లేనిదే మురారి అంటే మురాసురుని చంపినవాడు (కృష్ణుడు) అంటే శ్రీమహావిష్ణువు ముల్లోకాలని ఏలేవాడే కాదు. శివుడికి వున్న పేర్లలో అచలనాధుడు అనేది కూడా ఒక పేరు. జంగముడు అంటే బసవన్నని (నందిని) పూజించేవాడు, జంగమ దేవర అంటే శివుడు,   ఎల్లప్పుడూ పశుపతిని అధిష్ఠించి కదిలే ఓ సదాశివా, ఓ పరమశివా నా సేవలు అందుకుని మంగళదాయకమైన దీవెనలు ఇయ్యినాకు నీదరి చేరటానికి, నిన్ను స్తుతించటానికీ అనుమతి ప్రసాదించు అని శిష్యుడు కోరుతున్నాడు. 

సానిప గమపనిపమ, గమగ పప పప మపని పప పప

గగమ గస సస నిసగ సస సస సగ గస గప పమ పస నిస గసని సగ సగ

 సని సగ సగ పగ గగ గగ సని సగ గ గసగ గ

 పద గస గ మ స ని పమగ గ ఆనతి నీయరా 

 శంకరా శంకించకురా వంక జాబిలిని తలను ముడుచుకొని

విషపు నాగులను చంకనెత్తుకొని నిలకడ నెరుగని గంగనేలి

ఏ వంకలేని  నా వంకనొక్కకడగంటి చూపు పడనీయవేమి

ఈ తరుణిగ  సేవించుకొందురా ఆనతి నీయరా 

పరమ శివుని (గురువుగారి) మెప్పు పొందటానికి చాలా మార్గాలుంటాయి, అందులో ఒకటి పక్కవాడిలో లొపాన్ని చూపించి వాడికన్నా నేను మంచివాడినే అనిపించుకోవటం, దీన్నే చాలామంది reverse engineering అంటారు.  ఇక్కడ కూడా అలాటిదే, ఓ శంకరా నన్ను బ్రోవటానికి శంకించవలసిన అవసరం లేదు, వంక జాబిల్లిని తలన ముడుచుకున్నావు, విషపునాగులను మెడను చుట్టుకున్నావు, నిలకడ అంటూ ఎరుగని గంగని నెత్తి కెక్కించుకున్నావు, ఇన్ని వంకలున్న వీరందరినీ అక్కున చేర్చుకున్నావు మరి ఏ వంక లేని నా వైపు నీ ఓరకంట కూడా చూడవేమి? అలా చూసినా చాలు ఆ తరుణం కోసం నిన్ను సేవించటానికై ఎదురు చూస్తున్నాను.  

పప పమప నినిపమగస గగ

పప పమప నినిపమగస గగ

గమపని గ మపనిస మ పనిసగ ని స ప ని మ పా గా మా స

 పప పమప నినిపమగస గగ

 గమపని గా మపనిస మా

పనిసగ ని స ప ని మ ప గ మ స గా మ

పప పమప నినిపమగస గగా

గమపని గమపని స మపనిసగని

గమపని గమపని స మపనిసగని

స పని మ ప గ మ స గ మ

పప పమప నినిపమగస గ గా

గామపని గమాపాని స మపానిసగని

స పని మ ప గ మ స గ మ

పప పమప నినిపమగస గ గా గా

గగ మమ పప నిగ తక తకిట తకదిమి

మమ పప నినిసమ తక తకిట తకదిమి

పపనినిసస గని తక తకిట తకదిమిసపని

మప గమ సగమ

 పప పమప నినిపమగస గ గా 

రక్ష ధర శిక్షా దీక్ష ధ్రక్ష

విరూపాక్ష నీ కృపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష చేయక

పరీక్ష చేయక రక్ష రక్ష అను ప్రార్ధన వినరా

ఆనతి నీయరా హరాసన్నుతి సేయగ సమ్మతి నీయరా

దొరా సన్నిధి చేరగాఆనతి నీయరా హరా 

ఓ విరూపాక్షా నీ కృపావీక్షణ కోసం ఆశ తో ఎదురు చూస్తున్నాను, ఇంక ఆలస్యము చేయక నన్ను ఇంక పరీక్ష చేయక నా మొర విని నిన్ను స్తుతించటానికి, నిన్ను స్తుతించటానికి అనుమతినివ్వు. ఈ పాటను విన్నప్పుడు నాకు గజేంద్రమోక్షము గుర్తుకు వస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా గజేంద్రుడు మొదట మద గర్వంతో శ్రీమహావిష్ణువుని వేడగా విష్ణుమూర్తి కదలలేదు కానీ లావొక్కింతయు లేదు అన్నీ నువ్వే అని వేడితే విష్ణుమూర్తి దిగి వచ్చాడు. ఇక్కడ శిష్యుడు కూడా అదే మాదిరిగా ముందు పక్కవాళ్ళ లోపాలని చూపి వేడటం ఆ తరువాత రక్ష రక్ష అని ప్రార్థించటం జరిగింది.

ఎప్పుడూ వొప్పుకోవద్దురా వోటమీ

ఎప్పుడూ వొప్పుకోవద్దురా వోటమీ ఎన్నడూ వొదులుకోవద్దురా వోరిమీ
విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం |ఎప్పుడూ|

నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు చిన్నదేనురా
సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు తక్కువేనురా

ఈ పాట లో ఓటమిని ఒప్పుకోవద్దు అని తెలియజేయటానికి ఒక చిన్న చేప పిల్ల ముందున్న పెద్ద సముద్రము, గువ్వపిల్ల ముందున్న పెద్ద నింగిని ఉదాహరణగా తీసుకున్నారు (సిరివిన్నెల), గువ్వపిల్ల కానీ చేపపిల్ల కానీ ఓటమిని ఒప్పుకుంటే అవి బ్రతకలేవు, అవి ఓటమిని ఒప్పుకోలేదు కనుకనే వాటికి పెద్ద సముద్రము, నింగి చిన్నవిగా కనిపిస్తున్నాయి.
పశ్చిమాన పొంచి వుండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా
గుటక పడని అగ్గివుండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుందిరా

నిశా విలాసమెంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా

రగులుతున్న గుండె కూడ సూర్య గొళమంటిదేనురా|ఎప్పుడూ|

సంధ్యని అసుర సంధ్య అని కూడా అంటారు ఎందుకంటే అది పశ్చిమాన వుండి వెలుతురుని (సూర్యుడిని) మింగేస్తుంది కనుక, అటువంటి అసుర సంధ్య కూడా రవి (సూర్యుడు) నిరంతర ప్రయత్నం వలన ఒక్కసారి కూడా నెగ్గలేకపోయింది. అసుర సంధ్య గొంతులోనున్న అగ్గివుండ (సూర్యుడు) సాగరాలని కిందనుంచి ఈదుకుంటూ తిరిగి తూర్పున తేలుతుంది (ఉదయిస్తుంది). నిశ అంటే చీకటి ఇక్కడ నిశ అంటే కష్టము. చీకటి, కష్టము జీవితములో ఎంతోకాలం వుండవు, ఉషోదయము అంటే కవి దృష్టిలో సుభప్రదము (మంచి రోజులు)… ఉషోదయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇక్కడ రగులుతున్న గుండెని సూర్యునితొ పోల్చి చెప్పి దానికి కూడా ఓటమి వుండదు అని చెప్పటం… నాకు చాల బాగా నచ్చింది. ఇక్కడ నాకు నచ్చిన మరొక విషయం ఎమిటంటే కవి సంధ్యా సమయాన్ని పరమ పవిత్రంగా వేరొక పాటలో  పోల్చారు.

నొప్పిలేని నిముషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా

నీరశించి నిలుచునుంటె నిముషమైన నీది కాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణా

దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా

ఆశ నీకు అస్త్రమౌను శ్వాశ నీకు శస్త్రమౌను ఆశయమ్ము సారధౌనురా

ఆయువంటు వున్న వరకు చావు కూడ నెగ్గలేక శవముపైనె గెలుపు చాటురా

నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా |ఎప్పుడూ|

జననం నుంచి మరణం వరకూ జీవితంలో అడుగూడుగునా నొప్పిలేని నిముషాలు అంటూ లేవు, బ్రతుకు అంటేనే నిత్యం ఘర్షణలతో నిండి వుంది. అలా అని నీరశించి కూర్చుంటే జీవితాన్ని ఆస్వాదించేదెప్పుడు? ఈ బాధలనుంచి బయటకి రావటానికి వేరే ఎవరి సహాయము కోరనవసరము కూడా లేదు. దేహం, ప్రాణం, నెత్తురు మరియు సత్తువ వీటికి మించిన సైన్యం ఎక్కడా వుండదు. ఆయువు వున్నవరకూ చావు కూడా నెగ్గలేక ఊపిరి లేని (ప్రయత్నం చెయ్యని) శవం పైన తన ఆధిక్యాని చూపించగల్గుతుంది. నిరంతర ప్రయత్నము వలన నిరాశకి కూడా నిరాశ కలుగుతుంది.అందుకే ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోవద్దు.

ఈ పాట ఏ cinema లోదో నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే దయచేసి నాకు చెప్పండి. కానీ ఇది సిరివెన్నెల రాసినది అని తెలుసు, if you can get the original song please send me…