సౌశీల్యం: Charecter

यथा हि मलिनै: वस्त्रै: यत्र कुत्र उपविष्यते |
वॄतत: चलितोपि एवं शेषं वृतं न रक्षति ||

యథా హి మలినైః వస్త్రైః యత్ర కుత్ర వుపవిష్యతే
వృతతః చలితోపి ఏవం శేష వృతం న రక్ష్యతి

మాయని వస్త్రాలను కాపాడే ప్రయత్నం చిన్న మరక పడితే ఆపేసి ఎక్కడ పడితే అక్కడ శుభ్రంగా వున్నా లేకపోయినా మాసిన బట్టే కదా అని కూర్చోవడానికి సిద్ధం అయిపోతాముఇక్కడ సుభాషితకారుడు మలిన వస్త్రాలని మన సౌశీల్యంతో పోల్చ తలిచాడు ఒక్క సారి మన మంచితనం అనే బట్టలు మీద చిన్న మరక పడితే మిగతా వస్త్ర శుద్ధి మరిపోయి ఎంతటి దురాగతాలకయినా సిద్ధం అయిపోతారు .

మొదటి మరక పడకుండా జాగ్రత్త వహించాలి అది దుస్తులు అయనా శీలం అయినా ఒక సారి మరక పడిందా మిగతా శుభ్రత గురించి మరచి ఇంకా అశుభ్రంగా అవుతున్నా పట్టించుకోరు . దుస్తులు తిరిగి శుభ్రంగా చేయగలం కానీ శీలం శుభ్రం చేయటం తరమా???

As a person with the dirty clothes does not hesitate to sit anywhere, a person whose character is spoiled, will not hesitate to do bad. Everyone must have experienced this ( the first half I mean 🙂 ) particularly on rainy days when we come out of your home, we will take all care to protect yourself from the mud etc. But once somebody splashes some of it on us, we are tension free. you will not be bothered by the mud thereafter Similarly to save your character, you have to take care only at first time.

Advertisements

కొన్ని విషయాలు ఎలా/ఎందుకు నశిస్తాయి? : How/Why things perish?

निर्गुणस्य हतं रूपं दु:शीलस्य हतं कुलम्। 
असिद्धस्य हता विद्या अभोगस्य हतं धनम् ।।

నిర్గుణస్య హతం రూపం దుఃశీలస్య హతం కులం
అసిద్ధస్య హతా విద్యా అభోగస్య హతం ధనం

This subhashita says about things why they perish.
1. Beauty of the virtueless or lack of quality.
Beauty without virtue is like body without soul– it is fey and can’t last long.
2. Leanage of Wicked
Like a rotten apple injures all its companion, a wicked member destroys his entire family.
3. knowledge of the undeserving
Knowledge of the undeserving is the most deadly weapon for self-destruction.
4. Wealth of the unenjoyer
Wealth is meant to be enjoyed; those who preserve and protect it without enjoying it, lose it eventually.

ఈ సుభాషితము రకరకాల విషయాలు ఎలా ఎందుకు నశించిపోతాయో తెలియచేస్తుంది.
1. గుణం లేని రూపం
గుణహీనమైన రూపం ప్రాణం లేని శరీరంతో సమానం, అటువంటి శరీరం ఎంతో కాలం వుండదు.
2. దుశ్శీలస్య హతం కులం
చెరుకు తుద వెన్నుపుట్టిన చెరుకు తీపెల్ల చెరచు అన్నట్లు ఒక్క దుశ్శీలవంతుడి వలన అతని వంశం మొత్తం నాశనం అవుతుంది
3. అసిద్ధస్య హతా విద్యా
విద్య వలన మనకు అష్ఠసిద్ధులు లభిస్తాయి. విద్యకు పరమార్దం కైవల్యం మోక్షం. అటువంటి సిద్ధులు నేర్పలేని కైవల్యపదాని దారి చూపలేని విద్య నాశనం అయిపోతుంది మరచిపోతాము.
4. అభోగస్య ధనం
దాన ధర్మాలు చేయకుండా ఎటువంటి భోగమనుభవించకుండా దాచిపెట్టిన ధనం చివరకు దొంగలపాలు అయి నశిస్తుంది.

ఏది ఆభరణం? what is real ornament?

केयूराणि न भूषयंति पुरुषं हारा न चंद्रोज्वला
न स्नानं न विलोपनं न कुसुमं नालंकृता मूर्धजा
वाण्येका समलंकरोति पुरुषं या संस्कृताधार्यते
क्षियंते खलु भूषणानि सततं वाक्भूषणं भूषणं

కేయూరాణి న భూషయంతిపురుషం హారానచంద్రోజ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే
క్షియంతే ఖలు భూషణాణి సతతం వాగ్భూషణం భూషణం..

మనిషికి ఆభరణం ఏమిటో ఈసుభాషితం చెపుతుంది. చిన్నప్పుడు రేడియలో విన్నట్లు గుర్తు, కేయూరాలు అంటే బాహువులు అందంగా కనిపించటానికి వేసుకునే ఆభరణాలా? కాదు. చంద్రకాంతితో సమానంగా ప్రకాశించే దండలు కాని, స్నానాలు,పైపూతలు పూలు కానేకావు. ఎటువంటి వాక్కు అయితే సంస్కృతాన్ని ధరించి వుంటుందో అటువంటి ఒక్క వాక్కు మాత్రమే సరిగ్గా అలంకరిస్తుంది. అన్ని ఆభరణాలు నశించి పోతాయి కానీ ఒక్క మాట వాక్కు మాత్రమే శాశ్వతమైన ఆభరణం.

This subhashita explains what are ornaments for the people. Shinning Jewelry, garlands, scents, sandalwood bath all these are actually not the ornaments. The good words we speak are the only real ornaments to the people.

Correct definitions to few words: కొన్ని పదాలకు సరైన నిర్వచనాలు

न रणे विजयात् शूरोऽध्ययनात् न च पण्डितः
न वक्ता वाक्पटुत्वेन न दाता चार्थ दानतः ।
इन्द्रियाणां जये शूरो धर्मं चरति पण्डितः
हित प्रायोक्तिभिः वक्ता दाता सन्मान दानतः ॥

న రణే విజయాత్ శూరో, అధ్యయనాత్ న చ పండితః
న వక్తా వాక్పటుత్వేన, న దాతాచ అర్థ దానతః
ఇంద్రియాణాం జయే శూర, ధర్మం చరతి పండితః
హిత ప్రయోక్తిభిః వక్త దాతా సమ్మాన దానతః

This beautiful subhashita explains the greatness of our sanatana dharma.
न रणे विजयात् शूरो Just by winnig in a battle one can not be called as valor or a hero.
अध्ययनात् न च् पन्डितः In the same way just because somebody has read few books he will not be called as a litterate .
न वक्ता वाक्पटुत्वेन, eloquent speaking capability does not make any one a good speaker.
न दाता च अर्थ दानतः in the same way just by donating money doesn’t make any one as a donor.
Then who is a valor? Who is a pandit? Who should be called as a speaker? And who is a donor?
इन्द्रियाणाम् जये शूरो conqueror of sensual pleasure is a hero. Our ancestors understood the fact that conquering the 5 sensual pleasure is more difficult than winning the world. That is why the oldest civilization on the earth never propagated by means of war, and this is the same reason why oldest civilization on earth survived. In ancient India there was war only when ever dharma is not followed. Lord Krishna says

यदा यदाहि धर्मस्य ग्लानिर्भवति भारत
अभ्युथ्थानमधर्मस्य तदात्मानम् स्रुजाम्यहम्

With out this basic understanding many of world civilizations went on a war spree to propagate their civilization and decimated in the history. Alexander world conqueror, but all of his civilization got decimated.

धर्मम् चरति पन्डितः if any one who is following dharma he will be called as pandita. For sanatana dharma just bookish knowledge doesn’t mean littaracy.

हित प्रयोक्तिभिः वक्ता eloquently speaking on any topic doesn’t make any one as speaker. We call one as vakta only if he is teaching hitam means good things. Dr. Zakir Naik is one such example of eloquent speaker but doesn’t have a social status of vakta.

दाता सम्मान दानतः giving due respect to individuals in other words we call samajik samarasata. A person who can maintain respect of the others is a daata donor.

ఇదొక అద్భుతమైన సుభాషితం. సనాతన ధర్మం గొప్పతనం చాటి చెబుతుంది.

న రణే విజయాత్ శూరో: రణ రంగంలో విజయం సాధించినంత మాత్రాన శూరుడు అని పిలవకూడదు.

అద్యయనాత్ న చ పండితః : శాస్త్రాలు అధ్యయనం చేసినంత మాత్రాన పండితుడనిపించుకోడు.

న వక్తా వాక్పటుత్వేన: ఏవిషయమైనా అనర్ఘళంగా మాట్లాడగలినంత మాత్రాన వక్త అని పిలవకూడదు.

నదాతా చ అర్ దానతః: ధనం, లేదా ఆస్తి దానం చేసినంతమాత్రాన దాత అనీ పిలవకూడదు.

మనకు లౌకిక అర్థం ప్రకారం శూరుడంటే యుద్ధం గెలిచినవాడే, శాస్ర్తాధ్యయనం చేసిన వాడే పండితుడు, అనర్ఘళంగా మాట్లాడగలిగిన వాడే వక్త ధన దానంచేసినవాడే దాత కానీ సనాతన ధర్మ అవేవి కాదు అని చెబుతుంది. మరి ఎవరెవరిని ఏమని పిలవాలి?

ఇంద్రియాణాం జయే శూర: ఇంద్రియాలను జయించినవాడు శూరుడు. ఈ విషయం మన సనాతన ధర్మం మాత్రమే నేర్పుతుంది. అందువలనే ప్రపంచంలోనే అతి పురాతనమైనది అయిన సనాతన ధర్మం ప్రేమ మార్గం ద్వారా మాత్రమే వ్యాపించింది. ఇది తెలియక 2000 సంవత్సరాల చరిత్ర మాత్రమే కలిగిన ఎన్నో నాగరికతలు తమ తమ నాగరికత పెంచడం కోసం యుద్ధం అనే మార్గం ఎంచుకుని తమ శూరత్వం నిరూపించుకునే ప్రయత్నం చేసి తమ నాగరికత నామ రూపాలు లేకుండా చేసుకున్నారు. విశ్వ విజేత అని చెప్పుకునే అలెగ్జాండర్ గ్రీకు నాగరికత ఇప్పుడు ఇక లేదు.
సనాతన ధర్మం లో యుద్ధం ఎప్పుడూ మాధ్యమం కాదు. గీత లో కృష్ణుడు
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుథ్థానమధర్మస్య తదాత్మానం సృజసమ్యహం
ధర్మానికి లోటు జరిగితే నే యుద్ధం అని చెప్పటం లో భావం ఇదే.

ధర్మం చరతి పండితః: ధర్మం ఆచరించినవాడు పండితుడు.

హిత ప్రయోక్తిభిః వక్తా: హితం చెప్పేవాడే వక్త కానీ ఏది పడితే అది మాట్లాడే వాడి వక్త కాడు.

దాతా సమ్మాన దానతః సామాజిక సమరసతకి సనాతన ధర్మం అచ్చమైన ఉదాహరణ ఎదుటివారి మాన సమ్మానం కాపాడగలిగే వాడే దాత. రాముడు దీనికి నిలువెత్తు ఉదాహరణ, ఆయనకి ఒక కోతి, ఒక బోయ వాడు, ఒక భల్లూకము, ఒక జటాయువు స్నేహితులు. వారి మాన సమ్మానాలను తన సొంత విషయం గా భావించి జీవించిన మహానుభావుడు.

What should be done first: ఏది ముందు చేయాలి?

शतं विहाय भोक्तव्यं सहस्रं स्नानमेवच
लक्षं विहाय दातव्यं कोटिंचत्वा हरिं भजे

శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమేవచ
లక్షం విహాయ దాతవ్యం కోటించత్వా హరిం భజే

This verse tells how to prioritize our tasks.
Give priority to take a meal even if you have hundred works as the energy required to do these hundred works will only come from the food that we consume. Take bath before thousand things, maintain neetness and cleanliness is good for the self and also for the others. Donate first even before a lac things as any good thing that we think of should be done with quick and rapid action otherwise no one knows how ones mindset will change and overtake the decision of helping. Finally pray to god before a crore important things. In a nut shell give more priority to the society related works and give least priority to the personal…

ఈ సుభాషితం మనం నిర్వర్తించాల్సిన పనులకు ప్రాధాన్యత ఎలా కల్పించాలో చెప్తుంది. వందపనులున్నా భొజనం ముందు చేయాలి ఎందుకంటే ఆ వంద పనులు చేయటానికి కావలసిన శక్తి ఆహారం ద్వారానే వస్తుంది. వేయి పనులున్నా స్నానం చేయాలి ఎందుకంటే అశుభ్రత ఎదుటివారికి కూడా హానికారకం. లక్ష పనులున్నా దానం ముందు చేయాలి, ఏ క్షణమైనా మారిపోయే మనస్సు చిన్న కష్టానికో అవసరానికో చేద్దామనుకున్న దానం వాయిదా వేసేటట్లు చేస్తుంది. చివరగా కోటి పనులున్నా భగవత్ ధ్యానం మరిచిపోకుండా చేయాలి. ఒక్క మాట లో చెప్పాలంటే మొదట భగవంతుడు రెండు సమాజ శ్రేయస్సు చివర స్వ విషయం లేదా స్వార్ధం

జీవిత పరమార్ధం : Purpose of Life

इंद्रियार्धाननुभवन् बुद्धिमान लोकपूजितः
सम्मतः सर्वभूतानामुच्छस्वन् को न जीवति

देवतातिथिभृत्यानां पितृणामात्मनश्चयः
न निर्वपति पंचानामुच्छस्वन् न सजीवति

ఇంద్రియార్ధాననుభవన్ బుద్ధిమాన్ లోకపూజితః
సమ్మతః సర్వభూతానాంముచ్ఛ్వసన్ కో న జీవతి

దేవతాతిథిభృత్యానాం పిత్రూణామాత్మనశ్చ యః
న నిర్వపతి పంచానాముచ్ఛ్వసన్ న స జీవతి

These verses are one of yaksha prasnas from Mahabharata
Yaksha ask yudhistir (dharmraja):
who is a person inspite of experiencing with all his five senses, being intelligent, respected and acknowledged by all, breathing but still to be considered as dead?
Dharmaja answers:
One who does not respect and ill-treat, Devatas, atithi (guest), bhrutaya (servants) pitru(ancestors) and finally atmanah (self) is to be considered dead even if he is breathing.

ఇది మహాభారతంలో యక్ష ప్రశ్నలు ఘట్టం లోనిది. యక్షుడు ధర్మరాజుని ఇలా అడిగాడు:
ఎవరు ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ, బుద్ధిమంతుడు, లోక పూజితిడు సర్వభూతాలకూ సమ్మతమైన వాడూ, ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగిస్తున్నా జీవచ్ఛవంతో సమానము??
దానికి ధర్మజుడు ఇలా అన్నాడు:
ఎవరైతే దేవతలకు, అతిథులకు, భృత్యులకు అంటే పనివారు, పితృదేవతలకు చివరగా ఆత్మనః అంటే స్వార్ధం ఈ అయిదుగురికీ తగినట్లుగా ఉపచారాలు చేయడో వారి బాగోగులు చూసుకోడో వాడు బ్రతికివున్నా మరణించినట్లు…

Things to learn from nature (animals): ప్రకృతి నుంచి కార్యసాధకుడు నేర్చుకోవలసిన విషయాలు

सिंहादेकम् बकादेकम् शिक्षेच्चत्वारि कुक्कुटात्

वायसात्पन्ञन्च शिक्षेच्च ़षट्शुनस्त्रीणि गर्धभात्

Everone should learn one quality from the lion, one from Swan, four from the hen, five from the crow, six from the dog and three qualities from a donkey.

సింహాదేకం బకాదేకం శిక్షేచ్చత్వారి కుక్కుటాత్

వాయసాత్పంచ శిక్షేచ్చ షట్శునస్త్రీణి గర్దభాత్.

మనుష్యులు సింహమునుండి ఒక గుణమును, కొంగ నుండి ఒక గుణాన్ని, కోడి నుండి నాలుగు గుణాలను, కాకినుండి ఐదు గుణాలను, కుక్కనుండి ఆరు గుణాలను, గాడిదనుండి మూడు గుణాలను నేర్చుకోవాలి.

प्रभूतम् कार्यमल्पम् वा यन्नरः कर्तुमिच्छति

सर्वारंभेण तत्कार्यम् सिंहादेकम् प्रचक्षते

No matter how big or small the task is, it has to be handled with full energy like a lion goes for a kill.

ప్రభూతం కార్యమల్పం వా యన్నరః కర్తుమిచ్ఛతి

సర్వారంభేణ తత్కార్యం సింహాదేకం ప్రచక్షతే.

మానవుడు గొప్ప పనినైనా, చిన్న పనినైనా చేయాలనుకొన్నప్పుడు దానిని తన శక్తినంతా వినియోగించి, ధీరముగా చేయాలనే సంగతిని సింహం నుండి నేర్చుకోవాలి.

इन्द्रियाणि च संयम्य बकवत पन्डतितो नरः

समदुःखसुखः शान्तः तत्वज्ञः साधुरुच्यते

keeping in full control of all senses, doing meditation like a swan,  one who treats good and bad times equally with a peaceful mind is called as a sage.

ఇంద్రియాణి చ సంయమ్య బకవత్ పండితో నరః

సమదుఃఖసుఖః శాంతః తత్త్వజ్ఞః సాధురుచ్యతే.

బుద్ధిమంతుడు కొంగవలె ఇంద్రియాలను వశపరచుకొని , ధ్యానమగ్నుడై సుఖ,దుఃఖములయందు సమభావం శాంత స్వభావంకలిగి, తత్త్వాన్ని గ్రహిస్తే సజ్జనుడనిపించుకుంటాడు.

प्रत्यत्थानम् च युद्धंच संविभागम् च बन्धुषु

स्वयमाक्रम्य भुक्तम् च शिक्षेच्चत्वारि कुक्कुटात्

1. Waking up timely 2. Always be ready for a fight 3. Sharing food and resources equally to fellow beings,  and 4. Jumping and grabbing one’s own meal if it is required, are the 4 qualities to be learnt from a hen.

ప్రత్యుత్థానం చ యుద్ధం చ సంవిభాగం చ బంధుషు

స్వయమాక్రమ్య భుక్తం చ శిక్షేచ్చత్వారి కుక్కుటాత్ .

ఎల్లప్పుడు సకాలంలో మేల్కొనుట, యుద్ధానికి సంసిద్ధంగా ఉండుట, ఆహారంలో తన వారికి ఇవ్వదగిన బాగాన్ని ఇచ్చుట, అవసరమైనపుడు ఆక్రమించి భజించుట అనే నాలుగు గుణాలు కోడినుంచి నేర్చుకోవాలి.

गूढम् च मैधुनम् दार्ष्यम् काले काले च संग्रहम्

अप्रमत्तमविश्वासम् पन्ञ शिक्षेच्च वायसात्

1. Secretly mating with partner, 2. Stubbornness 3. Timely earning food and resources 4. Always being attentive and alert, and 5. Not believing anyone, are the 5 qualities to be learnt from a crow.

గూఢం చమైథునం దార్ష్ట్యం కాలే కాలే చ సంగ్రహం

అప్రమత్తమవిశ్వాసం పంచ శిక్షేచ్చ వాయసాత్.

రహస్యంగా మైథునం చేయటం, మొండితనం, సమయానుకూలంగా సంపాదించటం, అప్రమత్తంగా ఉండటం, ఎవరి యందూ నమ్మకం లేకపోవటం అనే ఐదు గుణాలు కాకి నుండి నేర్చుకోవాలి.

बह्वाशी स्वल्प सन्तुष्टः सनिद्रो लघुचेत्ः

स्वामिभक्तश्च शुरश्च षडेते श्वानतो गुणाः

1. A good digestion capability, 2. Getting satisfied with small quantities of food, 3. Sleeping happily 4. Able to wake up for even small disturbances 5. Being loyal and faithful to owner 6. Aggressiveness, are the 6 qualities to be learnt from a dog.

బహ్వాశీ స్వల్పసంతుష్టః సనిద్రో లఘుచేతనః

స్వామిభక్తశ్చ శూరశ్చ షడేతే శ్వానతో గుణాః.

ఎక్కువగా తినే శక్తి , దొరికిన కొద్దిపాటి ఆహారంతోనే తృప్తి చెందటం, సుఖంగా నిద్రించటం, కొద్దిపాటి అలికిడి యైనా మేల్కొనటం, యజమాని పై విశ్వాసం కలిగి ఉండటం, పౌరుషం అనే ఆరు గుణాలు కుక్క నుండి నేర్చుకోవాలి.

सुश्रान्तोऽपि वहेद्भारम् शीतोष्णम् न च पश्यति

सन्तुष्टश्चरते नित्यम् त्रीणि शिक्षेच्च गर्धभात्

1. keep working even after being tired, 2. being ignorant for hot and cold, 3. always being in the happy state are the three qualities to learn from a donkey.

సుశ్రాంతోఽపి వహేద్భారం శీతోష్ణం న చ పశ్యతి

సంతుష్టశ్చరతే నిత్యం త్రీణి శిక్షేచ్చ గర్దభాత్ .

బాగా అలసిపోయినా బరువును మోయటం, శీతోష్ణాలను లెక్క చేయకపోవటం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం అనే మూడు గుణాలను గాడిద నుండి నేర్చుకోవాలి.

य एतान्विंशति गुणानाचरिष्यति मानवः

कार्यावस्थासु सर्वासु अजेयः स भविष्यति

Who ever follow these 20 qualities, will always be successful in fulfilling his task.

య ఏతాన్వింశతిగుణానాచరిష్యతి మానవః

కార్యావస్థాసు సర్వాసు అజేయః స భవిష్యతి .

ఈ ఇరువది గుణాలను ఏ మానవుడు ఆచరిస్తాడో అతడు సర్వ కార్యాలయందు, సర్వావస్థలయందు విజయ సాధకుడౌతాడు.