ఏది ఆభరణం? what is real ornament?

केयूराणि न भूषयंति पुरुषं हारा न चंद्रोज्वला
न स्नानं न विलोपनं न कुसुमं नालंकृता मूर्धजा
वाण्येका समलंकरोति पुरुषं या संस्कृताधार्यते
क्षियंते खलु भूषणानि सततं वाक्भूषणं भूषणं

కేయూరాణి న భూషయంతిపురుషం హారానచంద్రోజ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే
క్షియంతే ఖలు భూషణాణి సతతం వాగ్భూషణం భూషణం..

మనిషికి ఆభరణం ఏమిటో ఈసుభాషితం చెపుతుంది. చిన్నప్పుడు రేడియలో విన్నట్లు గుర్తు, కేయూరాలు అంటే బాహువులు అందంగా కనిపించటానికి వేసుకునే ఆభరణాలా? కాదు. చంద్రకాంతితో సమానంగా ప్రకాశించే దండలు కాని, స్నానాలు,పైపూతలు పూలు కానేకావు. ఎటువంటి వాక్కు అయితే సంస్కృతాన్ని ధరించి వుంటుందో అటువంటి ఒక్క వాక్కు మాత్రమే సరిగ్గా అలంకరిస్తుంది. అన్ని ఆభరణాలు నశించి పోతాయి కానీ ఒక్క మాట వాక్కు మాత్రమే శాశ్వతమైన ఆభరణం.

This subhashita explains what are ornaments for the people. Shinning Jewelry, garlands, scents, sandalwood bath all these are actually not the ornaments. The good words we speak are the only real ornaments to the people.

Advertisements

Qualities of an ideal person

पात्रे त्यागी गुणो रागी संविभागी च बन्धुषु ।
शास्त्रे बोद्धा रणो योद्धा स वै पुरुष उच्यते ॥

పాత్రే త్యాగీ గుణే రాగీ సంవిభాగీ చ బంధుషు

శాస్త్రే బోద్ధా రణే యోద్ధా స వై పురుష ఉచ్యతే

पात्रे त्यागी: one who donates to a deserving person, गुणो रागी: appreciates good qualities in others, संविभागी च बन्धुषु : shares joys and sorrows with friends, शास्त्रे बोद्धा: accumulates knowledge of science, and रणो योद्धा: is excellent warrior on the battlefield.  A person with these qualities is called a true man.

One might get a doubt that do such man with all these qualities exist? In our puranas and history there are plenty of such people. I would like to give an example about one such person who is well known to every one.

Srirama is the best example of this sloka, when he found Vibheeshana he gave the kingdom lanka to him saying he is the better person than me to rule Lanka. Inspite of being an enemy Srirama appriciated the brahma tejas and siva bhakti of Ravana. Srirama is always lovable to every on of his family and people. Finally there is no one who has greater knowledge of shatras and who could win a bettle with Srirama. That is Srirama became god and people started worshiping him for his qualities.

పాత్రే త్యాగీ గుణే రాగీ సంవిభాగీ చ బంధుషు
శాస్త్రే బోద్ధా రణే యోద్ధా స వై పురుష ఉచ్యతే
పాత్రే త్యాగీ: ఒక పదవికి తనకన్నా పాత్రత (అర్హత) వున్నవాడు ఎదుట పడితే వెంటనే ఎలాంటి పదవీ వ్యామోహం లేకుండా అటువంటి పదవినుంచి తప్పుకుని సమర్ధునికి ఆ పదవిని అప్పజెప్పగలగటం.
గుణే రాగీ: సద్గుణాలను గుర్తించటం వాటిని ఎక్కడున్నా అభినందించటం
సంవిభాగీచ బంధుషు: బంధువులందరికీ సమానమైన ఆదరాభిమానాలను పంచడం
శాస్త్రే బోద్ధా: అనంతమైన శాస్త్ర జ్ఞానాన్ని ఔపోసపట్టడం లేదా ఎప్పుడూ అధ్యయనం చేసేవాడు
రణే యోద్దా: రణ రంగంలో తనను మించిన యోధుడులేనట్టు పోరాటం చేయడం.
ఇలాంటి గుణాలు ఎవరికుంటాయో వారిని స వై పురుష ఉచ్యతే అంటే అవి సత్పురుష లక్షణాలు వారినే పురుషుడు అని పిలుస్తారు.
ఇలాంటి గుణాలన్ని ఒకరి లో వుంటాయా అని అనుమానం రావచ్చు. మన పురాణాలలో చాలా ఉదాహరణలు వున్నాయి. అందరికీ తెలిసిన ఒకటి ఇక్కడ ప్రస్తావిస్తాను.
రాముడు లంకని జయించిన తరువాత విభీషణుడికి తన కన్నా పాత్రుడని లంకా రాజ్యాన్ని తృణ ప్రాయంగా వదిలేసాడు.
రావణుడు శత్రువు అయినా అతని బ్రహ్మ తేజస్సు కి శివ భక్తి కి మురిసిపోయాడు.
ప్రజలందరికీ ప్రీతిపాత్రుడు, శాస్త్రం లో యుద్దంలో శ్రీరాముని గెలిచిన వారేలేరు. అందుకే రాముడు ఆదర్శ పురుషుడయ్యాడు.

ఆదర్శ పురుషుడి గుణగణాలు

రామాయణం ఒక గొప్ప సందేశం:— వాల్మీకి మహా ముని నారదునితో ఇలా అడిగాడు….

కోన్వస్మిన్సామ్ప్రతం లోకే గుణవాన్కశ్చ వీర్యవాన్ .ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత:৷৷1.1.2৷৷ 
అస్మిన్ లోకే గుణ వాన్ కః?  ఈలోకంలో చెప్పబడిన సద్గుణాలన్నీ కలిగిన వాడు, వీరు ల్లో కెల్లా వీరుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు సత్య వాక్ పరిపాలకుడు, ఈ లోకంలో వున్నాడా?
చారిత్రేణ చ కో యుక్తస్సర్వభూతేషు కో హిత: .విద్వాన్క: కస్సమర్థశ్చ కశ్చైకప్రియదర్శన: ৷৷1.1.3৷৷
అతని చరిత్రలో ఎటువంటి మచ్చ లేని వాడు, సర్వ భూతాలకూ హితం మాత్రమే చేయదలిచేవాడూ, సర్వ విద్యలూ నేర్చుకున్నవాడూ సమర్ధుడూ,మళ్ళీ మళ్లీ చూడాలనిపించే ప్రియ దర్శి ఉన్నాడా?
ఆత్మవాన్కో జితక్రోధో ద్యుతిమాన్కోనసూయక: కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ৷৷1.1.4৷৷ 
ఆత్మవాన్ కః? తనను తాను నిగ్రహించుకోగలిగేవాడు, క్రోధాన్ని జయించినవాడూ అసూయ లేనివాడూ, ఎవరి రోషంతో దేవతలు కూడా భయభ్రాంతులవుతారో అటువంటి వాడు ఈ భూలోకంలో వున్నాడా?
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవంవిధం నరమ్ ৷৷1.1.5৷৷
ఇటువంటి గుణాలున్నవాడు ఈ భూలోకంలో వున్నాడా నాకు చాలా కుతూహలం గా వుంది అన్నిటా సమర్ధుడైన అటువంటి వాడి గురించి ముల్లోకాలూ చుట్టే మీకు తెలిస్తే వినాలనుంది అని వాల్మీకి నారదం పరిపపృచ్ఛ అంటే పరి పరి విధాల గుచ్చి అడిగాడు.
దానికి నారదులవారు ఇలా జవాబుచెప్పారు. జగ్రత్తగా విను నువ్వడిగిన గుణాలన్నీ కలిగిన వాడు దొరకటం అరుదు, సామాన్యమైన విషయం కాదు. కానీ అలాంటి గుణాలున్నవాడు ఈ లోకంలో ఒక్కడున్నాడు
ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైశ్శ్రుత: .నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ధృతిమాన్ వశీ ৷৷1.1.8৷৷ 
నియతాత్మ అంటే శరీర మనో నిగ్రహం కలిగినవాడూ, మహా వీరుడూ, ధ్యుతిమాన్ అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగిన శక్తి వున్నవాడూ, ధృతిమాన్ ధృతి అంటే వెగం, వెగంగా సమస్య పరిషరిచగలిగె శక్తి వున్నవాడూ, చివరగా వశీ అంతె తన మంచితనంతో అందరినీ వశపరుచుకునే వాడూ ఒకడు  వున్నాడు.
బుద్ధిమాన్నీతిమాన్వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణ: .విపులాంసో మహాబాహు: కమ్బుగ్రీవో మహాహను: ৷৷1.1.9৷৷
బుద్ధిమంతుడూ, నీతిమంతుడూ, వాగ్వీ అంటే వేదాలను చదువుకున్నవాడూ శ్రీమాన్ అంటే లక్ష్మీ కటాక్షంతో మంగళకరంగా వున్నవాడు, శత్రువులను నాశనం చేసేవాడూ, ఆజానుబాహుడూ, శంఖంలాంటి మెడ, గుండ్రని చెక్కిళ్ళు వున్నవాడు,
అతడే, ఇక్ష్వాకు వంశంలో ప్రభవించి రాముడనే పేరుతో ప్రజలు పిలిచుకుంటారు. శ్రీరాముడు సకల గుణాభిరాముడు, రాముని గుణాలను వర్ణించటానికి భాషకు పదాలు చాలవు అని నారదుడు జవాబు చెప్పాడు.
రామాయణం ఇతిహాసమా పురాణమా అనే ప్రశ్న పక్కన పెడితే మనకు వాల్మీకి రామాయణం ద్వారా ఒక ఆదర్శ పురుషుడి ఆవిష్కారం జరిగింది. ఒక్క రాముని గుణాలను తెలుసుకుని జీవితంలో ఆచరణలో పెడితె చాలు మన జన్మ సార్ధకం అయిపొతుంది. ఇలా రాముని గుణాలను రామయణంలో మూడు చోట్ల ఆవిష్కరించారు. సమయం వచ్చినప్పుదు మిగితా గుణాలను కూడా వివరించే ప్రయత్నం చేస్తాను.
బాపు గారి శ్రీరామరాజ్యం సినిమాలో ఇన్ని గుణాలను ఒక్క పాటలో జొన్నవిత్తుల వారు చాలా అందంగా చెప్పారు
ఒక  నాడు నారద  మహర్షుల వారిని నెనొక ప్రశ్న అడిగాను
ఎవడున్నాడీ  లొకంలొ ఇదివరకెరుగనివాడు ఎవడున్నాడీ కాలంలొ సరియగు నడవడివాడు 

నిత్యము  సత్యము పలికే వాడు, నిరతము ధర్మము నిలిపే వాడు  

చేసిన మేలు మరువని వాడు, సుర్యునివలనే  వెలిగేవాడు

యెల్లరికి చలచల్లని వాడు, యెద నిండా దయ గల వాడు

ఎవడు ఎవడు ఎవడూ?

అపుడు నారద మహర్షులవారు ఇలా సెలవిచ్చారు 

ఒకడున్నాడీ  లోకంలో ఓం కారానికి సరిజోడు 

ఇనకులమున ఈ  కాలంలో జగములు పొగిడే  మొనగాడు 

విలువలు కలిగిన విలుకాడు, పలు సుగుణాలకు చెలికాడు 

చెరగని నగవుల నెలరేడు, మాటకు నిలబడు ఇలరేడు

దశరథ తనయుడు దానవ దమనుడు జానకి రమణుడు 

అతడే శ్రీరాముడూ శ్రీ… రాముడు…