విష్ణువు ఎందుకు కొయ్యబారిపోయాడు? : Why god has become stone or wooden?

एका भार्या प्रकृति-मुखरा चञ्चला च द्वितीयाः
पुत्रस्तव एको भुवन विजयी मन्मथो दुर्निवारः
शेषः शय्या शयनम् उदधो वाहनम् पन्नगारिः
स्मरं स्मरं स्वगृह चरितं दारुभूतो मुरारिः

ఏకా భార్యా ప్రకృతి-ముఖరా చఞ్చలా చ ద్వితీయా
పుత్రస్త్వ ఏకో భువన విజయీ మన్మధో దుర్నివారః
శేషః శయ్యా శయనమ్ ఉదధో వాహనం పన్నగారీః
స్మరం స్మరం స్వగృహ చరితం దారుభూతో మురారిః

Many people used to raise this question, why God has become a wooden idol or stone idol. This question is answered with wit by a poet. The poet started thinking of god’s (Vishnu Bhagavan in this case) family how happily he lives with his house.
God Vishnu has two wives one by nature very talkative, here the poet is referring to Bhoomi or mother earth, for every thing she responds with nature. The second wife is whimsical. The duty of God Vishnu is to protect the nature but where is world conquering son Manmatha is unstoppable. Because of such unrest in the family if he wants to take some rest but then his bed is made of snake, and more over that bed is placed on the sea. His vahanam is panngari eagle which is the enemy of the snake. Thinking of such household problems, again and again, he became wooden. This is the greatness of our poets. They see things with humor as well as with a lot of devotion.

చాలామంది భగవంతుడు బండరాయిగా ఎందుకు మారిపోయాడు, లేదా ఎందుకు కొయ్యబారిపోయాడు అని అడుగుతూ ఉంటారు. దానికి సమాధానంగా ఒక కవి ఈ చమత్కారమైన పద్యం చెప్పాడు.
ఏకా భార్యా ప్రకృతి-ముఖరా: ఒక భార్య ప్రకృతి సిద్ధంగా ముఖరా అంటే అస్తమానూ చిర్రుబుర్రు లాడుతూ వుంటుంది (భూమి కంపించటం లేదా మరేదో ప్రకృతి వైపరీత్యాలకి కారకమవుతూ వుంటుంది), మరి రెండవ భార్యో ఆవిడైనా స్థిరంగా ఉంటుందా అంటే అదీ లేదు ఆవిడకున్నంత చంచల స్వభావం ఎవ్వరికీ లేదు.(లక్ష్మి ఒక్కచోట స్థిరంగా వుండదు). పుత్రుడు భువనవిజయి అలాంటి మన్మథని వారించ గలిగేవారేలేరు. లోకాలని పాటించవలసిన మహా విష్ణువు తన తనయుడే అసందర్భంగా మన్మథ బాణాలతో సృష్టి నాశనానికి పాల్పడుతున్నాడు. పోనీ పెళ్ళాం పిల్లలతో పడలేను కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే శేష శయ్యా మంచమేమో పాము, పోనీ అదైనా స్థిరమైన చోట వుందా అదీ లేదు శయనం ఉదధౌ అంటే సముద్రం మీద పాము మంచం. ఎక్కడికైనా పోదాం అనుకుంటే వాహనమేమో పన్నగారి అంటే పాములకు శత్రువయిన గరుత్మంతుడు. ఇన్ని సమస్యలను మళ్ళీ మళ్ళీ తలచుకుని మహా విష్ణువు కొయ్యబారిపోయి బండరాయిలా మారిపోయాడట. ఇదే మన కవుల, ఋషుల గొప్పతనం వారు ప్రతి విషయాన్ని అత్యంత భక్తి భావనతోనేకాదు, చమత్కారంతో కూడా ఆలోచించేవారు.

Advertisements