కాల గణన-5

వారం: వారం అంటే ఏడు తిథుల కాలం, ప్రస్తుతం పాశ్చాత్య కాలమానం కూడా ఏడు రోజుల కాలానికి వారం అనే పేరు. ఇక వారాల పేర్లు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అసలు ముందు వారానికి ఏడురోజులే ఎందుకు ఉండాలి? ఎవరికైనా ఈ సందేహం వచ్చిందా?
మనకు సౌరమండలంలో తొమ్మిది గ్రహాలున్నాయి.

ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
గురుశ్శుక్రశ్శనిభ్యశ్చ రాహవే కేతువే నమః

అని శ్లోకం. ఆధునిక పరిజ్ఞానం ప్రకారం కూడా తొమ్మిది గ్రహాలే. ఇవి కాక ఆస్టరాయిడ్స్, ఇంకా చిన్న చిన్న గ్రహ శకలాలు చాలా వున్నాయి వాటికి ప్రాధాన్యం అంత లేదు.

బుధుడు, శుక్రుడు, భూమి ,కుజుడు (అంగారకుడు) బృహస్పతి (గురుడు) శని, యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో

2006 తరువాత ప్లూటో గ్రహం కాదు అని వారి నవగ్రహ ప్రతిపాదనలను వారే సవరించుకునే పరిస్థితి.

కానీ మన పూర్వీకులు గ్రహించిన విషయం ఏమిటంటే ఇలాంటి గ్రహాలూ, గ్రహ శకలాలు ఎన్ని వున్నా మన జీవన శైలిని ప్రభావితం చేసేవి ఏడే. అవే మన వారాల పేర్లు .

ఇవికాక ఒక రోజులో రాహు కేతువుల ప్రభావం కూడా మన వాళ్ళు నిర్దిష్టంగా కనిపెట్టి మన పంచాంగంలో రాహుకాలం, వర్జ్యం దుర్ముహూర్తం అని మనకి తెలియచేసారు.

ఇంతకు ముందు వివరించినట్లు ఇంగ్లీషు కాలమానంలో రోజు తరువాత నెల మాత్రమే వస్తుంది, కానీ వారు కూడా, కాలం పట్ల మనకున్న అవగాహనకి ఆశ్చర్యపడి వారం అనే సిద్దాంతాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. కావాలంటే చూడండి వారి వారాల పేర్లు మన గ్రహాలతో ముడిపడి ఉంటాయి.

sunday ఆదివారం (ఆదిత్య-సూర్యుడు)
monday సోమా వారం (మూన్ సోమ చంద్రుడు)
tuseday మంగళవారం (మార్స్ కుజుడు)
wednesday
thursday
friday
saturday శనివారం (సాటర్న్ శని).

మాసం (నెల): భూమి సూర్యుడిని ఒకసారి చుట్టి రావడానికి పట్టే సమయాన్ని సౌర సంవత్సరం అంటారు. కానీ మనకు నెలలు ఏర్పడడం ఈ భూభ్రమణం వలన కాదు. చంద్రుడు భూమి చుట్టూ తిరగటం వలన నెలలు ఏర్పడతాయి, అదే మన తెలుగు లేదా భారతీయ మాసం.ఇంగ్లీషు వారు ఈ చంద్ర మాసాలని లెక్క గట్టకుండా వారికి నచ్చినట్టు 12 నెలలను వాటికి రోజులను నిర్ణయించేసారు. 12 ఎందుకు అని అడుగుతారేమో మనకు రాశులు 12. నిజానికి సౌర మాసం అంటే ఒక్కొక్క సౌరమాసంలో సూర్యుడు ఒక్కొక్క రాశి లోకి మారతాడు. కనీసం ఈ సిద్ధాంతం ప్రకారం సౌర మాసాల లెక్కింపు చేసినా వారి కాలగణనలో అన్ని అవకతవకలు ఉండేవి కాదేమో.

ఇక చంద్ర మాసం అంటే ఏమిటో చూద్దాం. మనకు నక్షత్రాలు 27. ఒక్కొక తిథి ఓ చంద్రుడు ఒక్కోలా నక్షత్రాన్ని చేరతాడు. ఇలా ఒక చంద్ర మాసం అంటే ~29.5 రోజులు పడుతుంది. అదే మన తెలుగు మాసం.

చంద్ర సంవత్సరం సౌర సంవత్సరం
ఇటువంటి ~29.5 రోజులు *12 నెలలు = 354.3 రోజులు ఒక చాంద్రమాన సంవత్సరం. కానీ సూర్యుడి చుట్టు భూమి తిరగడానికి 365 రోజులా, 6 గంటలు, 11 నిముషాలు 31 సెకెండ్లు పడుతుంది. వీరిద్దరి మధ్య సుమారు 11 రోజులు తేడా ఉంది. ఆ లెక్కన ప్రతి ముప్పై రెండున్నర సౌర మాసాలకు ఒక చంద్ర మాసం అధికంగా వస్తుంది. ఈ విషయాన్ని మొట్టమొదట గ్రహించిన వారు భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞలే.
అంటే ఈ అధిక మాసంలో సూర్యుడు రాశి సంక్రమణం చేయడు. అందుకే దాన్ని అధిక మాసం అంటారు.

ఈ అధిక మాసము ఎప్పుడూ చైత్రమాసము నుండి ఆశ్వయుజమాసము (ఇంచుమించు మొదటి ఆయనం) మధ్యలోనే వస్తుంది. ఒక సారి అధిక మాసము వచ్చాక తిరిగి 28 నెలలకు మరోసారి వస్తుంది. ఆ తర్వాత 34, 34, 35, 28 నెలలకు వస్తుంది. అధిక మాసం ముందు వచ్చి ఆతర్వాత నిజ మాసం వస్తుంది.

మన భారతీయుల గొప్పతనం చూడండి. ఎవ్వరికైనా ఒక నిర్ణీత సమయం తరువాత వంటి నుంచి మలం బయటకు వస్తుంది (కళ్ళలో పుసులు, వంటిమీద స్వేదం, కడుపులో మలం ఇలా), ఈ మలం శుభ్రం చేసుకోవటం తోనే మనం రోజు ప్రారంభిస్తాం స్నానం చేసి బయట కనిపించే మలం, నిత్య కర్మలు (సంధ్యా వందన విధులు) చేసి అంతః కల్మషం కడుగుకొని మన రోజు మొదలు పెడతాం. ఇలాగే సూర్య చంద్రులకూ మలం వస్తుంది, వారు రాశి సంక్రమణం, నక్షత్ర సంక్రమణం ద్వారా తన మలం తొలగించుకుంటారు. అధిక మాసంలో సూర్యుడు రాశి సంక్రమణం చేయలేదు కానీ చాంద్రమాసం గడిచిపోయింది. నిజ మాసం లోకాని సూర్యుడు రాశి మారడు, అంటే అదే రాశిలో ఉండటం వలన ఈ అధిక మాసాన్ని మైల మాసం అని అంటారు. అందుకే అశుభ్రమైన ఈ అధిక మాసంలో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు అని ఆచారం. కానీ నిత్యకర్మలు మాత్రం మానకూడదు అందుకే సంధ్యావందనం, పితృకార్యాలు మానరు.

ప్రపంచంలో ఎక్కడా సైన్సు, స్పిరిట్యువాలిటీ (ఆధ్యాత్మికతకు) కలగలిపి అర్థం చెప్పలేరు. వారి దృష్టిలో సైన్సు వున్నచోట ఆధ్యాత్మికత మూఢ నమ్మకం లేదా ఆధ్యాత్మికత వున్నచోట సైన్సు మూగబోయి జవాబు చెప్పలేని స్థితి. కానీ మన భారతీయత, సనాతన ధర్మం మాత్రమే శాస్త్రీయమైన పధ్ధతి అందులోనూ ఆధ్యాత్మికతకు శాస్త్రీయమైన నిర్వచనం చెప్పగలిగిన ఏకైక ధర్మం.

ఒక్కసారి ఆలోచించండి ఇంతటి గొప్ప ధర్మాన్ని పాటిస్తున్నందుకు మనం ఎంత గర్వపడాలి?? ఆ గొప్పతనాన్ని తెలియక ఎవరో సనాతన ధర్మం అంటే మూఢనమ్మకం ఎవరైనా కించపరిస్తే మనం ఎంత సిగ్గుపడాలి??

హిందువునని జీవించు హిందువుగా మది గర్వించు.

భారతమాతకు జయము.

కాల గణన-4

ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే పాశ్చాత్యులు వారికి విజ్ఞానం పరిధిలో ఒక సంవత్సరం అంటే భూమికి సూర్యుని చుట్టూ తిరగటానికి 365.24… రోజులు పడుతుంది అని అంటే రోజుకు 24 గంటల సమయం అని కొంత సేపు పగలు కొంత రాత్రి కలిపి ఒక రోజు అని నిర్ధారణ చేసేసారు. అంటే వారి ఉద్దేశ్యం ప్రకారం సూర్యుడు కదలడు భూమి మాత్రమే కదులుతుంది కాబట్టి కదలని సూర్యుడిని ఆధారంగా చేసుకుని కాలం లెక్కకడితే సరిపోతుంది అని అభిప్రాయం. నిజానికి సూర్యుడు కదలటంలేదా? కాదు యావత్ నక్షత్ర మండలం (గెలాక్సీ) కదులుతున్నప్పుడు సూర్యుడు కదలడా? ఇదే పాశ్చాత్యుల ప్రతిపాదన ప్రకారం బిగబాంగ్ థీరీ లో సృష్టి లో అనేక నక్షత్ర మండలాలున్నాయి మన నక్షత్ర మండలం పేరు మిల్కీవే పాలపుంత అని చదువుకున్నాం పై ఈ నక్షత్ర మండలాలు కూడా కదులుతున్నాయి అని వారి ప్రతిపాదన. అందుచేత దూరాలు కాలాలు కొలిచే టప్పుడు ఒక కదలని వస్తువుని ఆధారంగా చేసుకుని కొలవాలి. లేదా రెండు మూడు కదిలే వస్తువుల ఆధారంగా చేసుకుని కొలవాలి. పాశ్చాత్యులు చేసిన తప్పు అదే.

కానీ భారతీయులు కాలమానం తయారు చేయటానికి సుర్యడు చంద్రుడు భూమిల మద్య దూరాలను ఆధారంగా చేసుకుని తయారు చేసారు.
మన నూతన సంవత్సరం చైత్రమాసం శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. అక్కడి నుంచే మన కాలమానం కూడా…

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యుడు చంద్రుడు భూమీ ఒకే సరళ రేఖలో వుంటాయి. అంటే చంద్రుడు భూమి సూర్యడి మద్య కోణం 0 డిగ్రీలు. అదే మన మొదటి తిథి. అసలు తిథి గురించి తెలుసుకునే ముందు కొంత ఉపోద్ఘాతం అవసరం.

నిజానికి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతన్నా భూమి మీద నిలబడిన మనకి భూమి స్థిరంగా నూ సూర్యుడు, చంద్రుడు కదులుతున్నట్లు కనిపిస్తాయి. దీన్నే ఇంగ్లీషు లో relative motion అంటారు. మన లెక్కలు అన్నీ ఇలాంటి relative frame of reference మీద ఆధారపడి వుంటాయి.

భూమి మీద వుండి చూసే మనకు సూర్య చంద్రుల మద్య కోణం మారుతున్నట్లు కనిపిస్తుంది. తిథి అంటే రోజులో కొంత సమయం. సూర్యుడికి చంద్రుడికి మద్య కోణం 12 డిగ్రీలు మారితే, అలా మారడానికి పట్టే సమయాన్ని తిథి అంటారు. 12 డిగ్రీలు ఎందుకని అడుగుతారేమో… ఇంతకు ముందు చెప్పినట్లు మనకు ఒక నెల అంటే ముప్పై తిథులు (శుక్ల పక్షంలో 14 తిథులు, కృష్ణ పక్షంలో 14 తిథులు అమావాస్య, పౌర్ణమి కలిపి 30). 360 డిగ్రీలు/30 తిథులు అంటే 12 డిగ్రీలు.

అంటే ఇప్పుడు చంద్రుడు, భూమి సూర్యుల మధ్య కోణం
0-12 డిగ్రీలు ఉంటే ప్రథమ తిథి పాడ్యమి
12-24 డిగ్రీలు విదియ లేదా ద్వితీయ
24-36 తదియ లేదా తృతీయ
36-48 చవితి
tithi_calculationఇలా లెక్క కట్టుకుంటూ పోతే మొత్తం 30 తిథులు పూర్తి అవుతాయి. సులభంగా అర్థం కావాలంటే తూరుపు తిరిగి సూర్యుడిని చూసిన తరువాత చంద్రుడిని చూడాలంటే ఆ రోజు తిథి ప్రకారం అన్ని డిగ్రీలు పక్కకు తిరిగితే చంద్రుడు కనబడతాడు.

తిథి ఆ 12 డిగ్రీలు కోణం మారే సమయం 19 గంటల నుంచి 26 గంటల సమయం పడుతుంది. ఇంగ్లిష్ రోజే బాగుంది సరిగ్గా 24 గంటల తరువాత రోజు మారుతుంది అనుకుంటారేమో…
మన సిద్ధాంతం ప్రకారం తిథి వార నక్షత్రాలలో ఏది మారినా ఆ మార్పు ప్రకృతి సిద్ధంగా కనిపిస్తుంది, కానీ అర్ధరాత్రి 12 గంటలకు ప్రకృతి లో ఏ మార్పు లేని సమయంలో రోజు మారదు.

ఇక ఈ తిథి కాల వ్యవధి 19-26 గంటలు ఎందుకు మారుతుందో చూద్దాం.

భూమి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో(elliptical orbit) తిరుగుతుంది అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఆలా తిరుగుతున్నప్పుడు భూమి గతి వేగములని కెప్లర్ గమన నియమాలు (keplar laws of planetary motion) అని మనకు చిన్నప్పుడు అదేదో ఒక ఆంగ్లేయుడు ప్రతిపాదించినట్లు నేర్పించేవారు. అదే కెప్లర్ గమన నియమాల ప్రకారం భూమి సూర్యునికి దూరంగా వున్నప్పుడు నెమ్మదిగాను దగ్గరగా వున్నప్పుడు వేగంగాను కదులుతుంది. అందుకే భూమికి సూర్యునికి మధ్య వేగం తక్కువగా వున్నప్పుడు తిథి 26 గంటలు పడుతుంది.
kepler-second-law
అంటే భూమి యొక్క గతి విధులను ఆంగ్లేయుడు పుస్తకాలలో ప్రతిపాదించటానికి ముందే మన దేశంలో ప్రతి వూరిలో పంచాగం లెక్కకట్టే ప్రతి వారికి తెలుసన్నమాట, దురదృష్ట వశాత్తు మన చరిత్రను మనమే మర్చిపోయి పక్కవాడు చెప్పినదే చరిత్రగా చదువుకుంటున్నాం.

కాల గణన-3

ఇప్పుడు మనం భారతీయ కాల మానం గురించి తెలుసుకుందాం.

పంచాంగం : 5 అంగాలు తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం అనే ఐదు భాగాలను కలిపిన ఒకచోట జత పరచిన గ్రంథం పంచాంగం.

ప్రస్తుత పాశ్చాత్య కాలమానంలో కాలం కొలవటానికి వున్న ప్రమాణాలు, 1 సెకను, 1 నిముషం, 1 గంట ఇంక ఆ తరువాత పూట (ఇది కూడా సరిగా వివరించబడలేదు) తిన్నగా ఒక రోజు, వారం, నెల సంవత్సరం.

earth_sunకానీ మన భారతీయ ఋషులు శాస్త్రజ్ఞులు, కాలం కొలవటానికి ఎంత ప్రాముఖ్యత వహించారో చూడండి

 

రెప్పపాటు అతి చిన్న ప్రమాణము
విఘడియ = 6 రెప్పపాట్లు
ఘడియ = 60 విఘడియలు
గంట = 2 1/2 ఘడియలు
ఝాము = 3 గంటలు లేదా 7 1/2 ఘడియలు
రోజు = 8ఝాములు లేదా 24 గంటలు
వారము = 7 రోజులు
పక్షము = 15 రోజులు
మండలము = 40 రోజులు
నెల = 2 పక్షములు లేదా 30 రోజులు
ఋతువు = 2 నెలలు
కాలము = 4 నెలలు (వేసవి, వర్ష, శీతా కాలాలు)
ఆయనము = 3 ఋతువులు లేదా 6 నెలలు
సంవత్సరము = 2 ఆయనములు
పుష్కరము = 12 సంవత్సరములు

ఇవి కాక, నాలుగు యుగాలు,
కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు

yugas.jpg

మహా యుగము= నాలుగు యుగాలు కలసి ఒక మహా యుగం =43,20,000 మానవ సంవత్సరములు.
మన్వంతరము= ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు.
మన ప్రస్తుత మనువు వైవస్వతుడు అందుకే మనం నిత్యా పూజలలో వైవస్వత మన్వంతరే కలియుగే అని చెప్పుకుంటాం

ఒక చతుర్యుగము = 43,20,000 సౌర (మానవ) సంవత్సరాలు లేదా 12,000 దివ్య సంవత్సరాలు
71 చతుర్యుగములు 30,67,20,000 సౌర (మానవ) సంవత్సరాలు లేదా 8,52,000 దివ్య సంవత్సరాలు
ప్రతి కల్పాదియందు వచ్చు సంధ్య 17,28,000 సౌర (మానవ) సంవత్సరాలు లేదా 4,800 దివ్య సంవత్సరాలు
14 సంధ్యా కాలములు 2,41,92,000 సౌర (మానవ) సంవత్సరాలు లేదా 67,200 దివ్య సంవత్సరాలు
ఒక సంధ్యాకాలముతో పాటు ఒక మన్వంతరము 30,84,48,000 సౌర (మానవ) సంవత్సరాలు లేదా 8,56,800 దివ్య సంవత్సరాలు
14 సంధ్యలతో పాటు కలిపిన 14 మన్వంతరములు 4,31,82,72,000 సౌర (మానవ) సంవత్సరాలు లేదా 1,19,95,200 దివ్య సంవత్సరాలు
14 మన్వంతరములు + కల్పాది సంధ్య = ఒక కల్పము = బ్రహ్మకు ఒక పగలు 4,32,00,00,000 సౌర (మానవ) సంవత్సరాలు లేదా 1,20,00,000 దివ్య సంవత్సరాలు
అంతే సమయం బ్రహ్మకు రాత్రి ఉంటుంది.

అది భారత కాలమాన గొప్పతనం. ఇప్పుడు మన కాలమానం యొక్క విశేషాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

కాల గణన-2

ఇక నెలలకు పెట్టిన పేర్లను గూర్చి తెలుసుకొందాము.

జనవరి: జానస్ అన్న రెండుతలల దేవుడు స్వర్గంలో ప్రధాన ద్వారం వద్ద వుంటూ ఒక తలతో జరిగిన వర్షమును ఒక తలతో జరగబోయే వర్షమును చూస్తూఉంటాడట. ఆయన పేరుతో ఈ నెల ఏర్పడింది. 29 రోజులు కల్గిన ఈ నెల 31 రోజుల నేలగా జూలియస్ సీజరు చేసినాడు.

ఫిబ్రవరి: రోమన్ల పండుగ ఫిబ్రువా అన్నది లూపర్కాస్ అన్న దేవుని పేరుతో పునీతుడవటానికి (to get purified) జరుపుకుంటారు. దీనికి కొంతకాలం 23, 24 రోజులుండేవి. తరువాత 30 రోజులై ఆతరువాత జూలియస్ సీజరు, అగస్తస్ సీజరు ల వల్ల 28 రోజులై కూర్చుంది.

మార్చి: మార్స్ రోమనుల యుధ్ధ దేవత. ఈయన ఒక చేతితో శూలం మరొక చేతితో డాలును ధరించి రెండు గుర్రాలమీద వస్తాడు. ఈయన పేరుతో ఈ నెల ఏర్పడింది.

ఏప్రిల్: రోమన్ల వసంత దేవత పేరు అమ్నియో ఏప్రిట్. ఈమెను రోమన్లు ఎంతో అందమైనదిగా, పునరుజ్జీవనకు నాందిగా భావిస్తారు.

మే: భూగోళాన్ని తన భుజస్కంధాలపై మోసే అట్లాసు యొక్క ఏడుగురు కూతుళ్ళలో మేయో ఒకటి. అట్లాసు ఈ ఏడు మందిని ఏడు నక్షత్రములుగా మార్చివేసాడు (మన సప్తర్షి మండలం) దీనిని అంటే ఈ నెలను వయసులో పెద్దవాళ్ళకు (maiores) అంకితమిచ్చినారు.

జూన్: జూపిటర్ భార్య జూనో ఈ జూన్ మాస స్థానానికి ఈవిడ జూనియస్ అన్న దేవునితో పోరాడుతుంది. వారిరువురి పేర్లతో జూన్ వచ్చింది. దీనిని యువతకు (juniores) అంకితమిచ్చారు.

తరువాత నెలల పేర్లు పెంటలిస్, సేక్స్టలిస్, సెప్టంబర్,అక్టోబర్, నవంబర్, డిసెంబర్ గ ఉండేవి. 5, 6 నెలలైన పెంటలిస్, సేక్స్టలిస్ లను జూలై, ఆగష్టులుగా తమ పేర్లతో జూలియస్, అగస్టస్ సీజర్లు మార్చుకున్నట్లు ఇంతకు వివరించాను. 7వ నెలనుండి 10వ నెలవరకు పేర్లు అలాగే వుండి, వారి తప్పుడు లెక్కలకు సాక్ష్యాలుగా నిలిచాయి.

సెప్టెంబర్ – సెప్ట్ అంటే సప్తమి 7వ నెల
అక్టోబర్ – అక్ట్ అంటే అష్టమి 8వ నెల
నవంబర్ – నవ అంటే నవమి 9వ నెల
డిసెంబర్ – డెస్సి అంటే దశమి 10వ నెల

దీనిని బట్టి ఈ మార్పులకు ముందు 11వ నెలగా జనవరి, 12వ నెలగా ఫిబ్రవరి వున్నట్లు రూఢియై పోయింది.

ఇన్ని మార్పులు చేర్పులు కూర్పులు జరిగిన తరువాత కుడా వారి కాలమానము భూభ్రమణముతో పోల్చి చూస్తే 26 సెకన్ల తేడా వున్నది. ఆ సెకన్లు 3323 సంవత్సరములకు ఒకరోజు ఔతుంది. దానిని ఆ సంవత్సరములోని ఒక నెలకు (బహుశ ఫిబ్రవరికేనేమో) కలుపుకోవలసివస్తుంది.

సాధారణంగా లెక్కలు సరిగా రాని వాడి దగ్గరకు మనం మన పిల్లలను లెక్కలు నెర్కకోవటానికి పంపం, ఇక్కడ మన దౌర్భాగ్యం చూడండి, కాలాన్ని లెక్క గట్టటంలో ఇన్ని తప్పులు చేసిన వారి కాలమానాన్నే పాటించవలసి వస్తోంది. పోనీ ప్రపంచం అంతా పాటిస్తున్న ఈ కాలమానాన్ని మన జీవన భుక్తి కోసం తప్పక పాటించాలి అని సరిపెట్టుకుంటే పరవాలేదు. కానీ మన భారతీయ కాలమానాన్ని కించపరిచేలా మాట్లాడటం, అసలు పూర్తిగా ఆ పద్ధతిని మరిచిపోవటం చాలా గర్హనీయమైన విషయం. మన తరువాతి తరానికి ఈ జ్ఞానాన్ని అందచేసి, మన సంస్కృతిని పునరుద్ధరణ చేయటం మనందరి బాధ్యత.

కాల గణన-1

కాల గణన (Western Style)
కాలాన్ని అసలు మనం ఎందుకు లెక్క కట్టాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే చాలామందికి సమాధానం దొరకకపోవచ్చు. అసలు కాలం లెక్క కట్టటానికి మూల కారణం, మన పూర్వీకులు కాలం ఒక నిర్దిష్టమైన రీతిలో మరల మరల తిరిగి వస్తుంది అని గుర్తుపట్టారు. అలా గుర్తుపట్టటం వలన మన పూర్వీకులకు పంటలు ఎప్పుడు వెయ్యాలి కోతలు ఎప్పుడు కొయ్యాలి లాంటి విషయాలమీద ఒక అవగాహన కలిగింది. ఆ జ్ఞానాన్ని నిస్వార్థంగా మన పూర్వీకులు పంచాంగం రూపంలో మనకు అందచేశారు.

అనంతమైన కాలాన్ని గణించడం అంత సులభం కాదు. మన భారతీయ కాలమానం గొప్పతనం తెలుసుకునే ముందు ప్రస్తుతం మనమందరమూ పాటిస్తున్న పాశ్చాత్య కాల గణన గురించి తెలుసుకుందాం.

క్యాలెండరు అన్నమాట లాటిన్ భాషలోని క్యాలండీ నుండి పుట్టింది అంటే పద్దుల పుస్తకం (account book), ఇచ్చిన అప్పులు మొదటి రోజున వసూలు చేసుకోవటానికి దీని ఆసరాగా పనిచేసేవారు. తరువాత పౌర అనుశాసనమునకు ప్రజా ప్రయోజన కార్యాచరణమునకు ఇది పాశ్చాత్యులు ఉపయోగించేవారు. దీనిని వీరు కాల క్రమేణ Almanec అని గూడా అన్నారు. నిజానికిది Al – manakh అంటే వాతావరణ సూచిక అని అన్వయించుకొనవచ్చును. ఈ పదము Spanish Arabic భాషలకు చెందినది.

నేడు మనముపయోగించే క్యాలాండరు రోము, ఈజిప్టు గ్రెగొరీ విధానాల కలయిక. రోము రాజ్యాన్ని పాలించిన రోములస్ కాలంలో ఏడాదికి 304 రోజులుండేవి. సంవత్సరానికి 10 నెలలుండేవి. మార్చి నుండి కొత్త సంవత్సరం మొదలయ్యేది. ఒక్క సారి ఆలోచించండి రెండు నెలల కాలాన్ని తప్పుగా గణిస్తే, పంటల కోతల సమయం అనుకున్నదానికన్నా తరువాత రావటం కానీ ముందు రావటం కానీ జరుగుతుంది కదా. ఈ తేడాని గమనించి తరువాత కాలంలో దీనిని 10 నుండి 12 నెలలకు మార్చి, సంవత్సరమునకు 354 రోజులుగా సరిచేశారు. ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే చాంద్రమాన సంవత్సరంలో 354 రోజులుంటాయి. మన భారతీయ కాల గణన ప్రకారం చంద్రుడు 27 నక్షత్రాలలో ఇంచుమించు ఒక్కొక్క రోజు ఒక్కొక నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ లెక్కన 27 నక్షత్రాలకు ~29.5 రోజులు X 12 మాసాలు = 354.3 రోజులు.

పంపీలయస్ చక్రవర్తి క్రీ ||పూ|| 7వ శతాబ్దంలో తిరిగి సరి సంఖ్య మంచిదికాదనుకొని 355 రోజులుగా మార్చారు (చాలా హాస్యాస్పదం ఏమిటంటే సూర్య, చంద్ర భూమి యొక్క గమనాలతో పని లేకుండా రాజుకి నచ్చలేదు కనుక ఒక రోజు సంవత్సరం లో పెంచేశారు).

ప్రపంచమంతటా నూతన సంవత్సరము మొదలయ్యేది వసంత ఋతువు (spring) లో అంటే మార్చ్ నెలలో. ‘Spring’ అప్పుడే కదా వచ్చేది. ఎందుకంటే వసంత ఋతువు లోనే చెట్లు చిగురుతొడుగుతాయి అదీ ఒక రకమైన పుట్టుకే కదా, అందుచేత నూతన సంవత్సరం కూడా వసంత ఋతువు లోనే పుట్టేది (ఒకప్పుడు) అప్పటికి వారి సంవత్సరంలో తక్కువ రోజులున్నా కూడా their new year used to start in the month of march or april i.e in the spring sesson.

శిశిర (autumn) ఋతువులో (మన ప్రస్తుత జనవరి నెలలో) అంతా చలి ఆ చలికి తట్టుకోలేక శరీరం జర్జరీభూతం అయ్యి ముడతలు పడటం జరుగుతుంది. చెట్ల ఆకులు పళ్ళు రాలిపోయి మట్టిలో కలిసి ఖననం అయిపోతాయి, అంటే ఒకరకంగా మరణం, కాని పాశ్చాత్యులు వేడుకలు spring (March) లో కాదని శిశిరం (autumn) అంటే జనవరి లో చేయటం మొదలుపెట్టారు. క్రీ ||పూ|| 153 లో సంవత్సరాన్ని జనవరికి మార్చటం జరిగింది. మరల దానిని ఎందుకో మార్చికి మార్చారు.

తరువాత క్రీ ||పూ|| 46 వ సంవత్సరములో అప్పటి రోమన్ చక్రవర్తి అయిన జూలియస్ సీజరు ఈజిప్ట్ వెళ్ళినపుడు అక్కడి క్యాలెండరు విధానాలను గమనించి ఖగోళ శాస్త్రజ్ఞుడైన సోసీజెనాస్ అనే అతని సహయంతో రోమను సంవత్సరానికి 365.25 రోజులుగా నిర్ణయించి, అప్పట్లో 30 రోజులుండే ఫిబ్రవరి (అప్పుడు సంవత్సరానికి చివరి నెల) నుండి ఒక రోజును తీసి, మార్చి నుండి 5 వ నెలయైన పెంటలిస్ (పెంట=5 -పంచమి) కు చేర్చాడు. ఏప్రిల్, జూన్, ఆగష్టు, సెప్టెంబరు, నవంబరు నెలలకు 30 రోజులనుంచి, ఫిబ్రవరి కి 29 రోజులు చేసి, సంవత్సరమును తిరిగి జనవరితో మొదలు అని శాసనం చేశాడు, పెంటలిస్ పేరును తన పేరుతో జులై గా మార్చుకొని సంవత్సరారంభం జనవరి తో చేయ ప్రారంభించినారు. 0.25 తేడాను, 4 సంవత్సరములకు ఒక రోజు ఔతుంది కాబట్టి దానిని ఫిబ్రవరి నెలకు కలిపి (29+1) 30 రోజులు చేయటం జరిగింది. దీనిని leap year అన్నారు.

సీజరు మేనల్లుని కొడుకైన ఆగస్టస్స్ సీజరు 27 B.C. లో రోము చక్రవర్తియైన పిమ్మట సెక్ష్టలిస్ అను నెలకు (సెక్స్ట్టట =6 -షష్టి) తన పేరుతో ఆగస్ట్ అని పెట్టి దానికి ఫిబ్రవరి నుండి ఒక రోజు తీసి, అంటే దానిని 28 రోజులుగా చేసి, ఆగష్టుకు కలిపి దానిని కుడా 31 రోజుల నెలగా చేసినాడు. లీపియరును 3 సంవత్సరములకు మార్పు చేసి , ఫిబ్రవరి కి కలిపేవారు.

తరువాత కాలంలో రోజుల లెక్కలో ఖచ్చితత్వము పెరిగి సంవత్సరానికి 365.242199 రోజులు చేసారు. ఇందువల్ల ఏడాదికి 11 నిముషాల 14సెకన్లు తేడావస్తుంది. దీనిని 13 వ పోపు గ్రెగొరీVIII, కొందరు ఖగోళ శాస్త్రజ్ఞుల కూటమిని ఏర్పరచి , క్రీ ||శ|| 1582 లో గ్రెగోరియన్ క్యాలెండరు పేరుతో క్రొత్త క్యాలెండరును ప్రవేశ పెడుతూ లీపియర్ ను తిరిగి 4 సంవత్సరములకొకసారి చేస్తూ ఫిబ్రవరి కి ఆ ఒక రోజును కలిపేవారు.
ఆలా చేయటం వలన ఒక సంవత్సరానికి .007801 రోజు ఎక్కువగా వస్తుంది. దీనిని సరిదిద్దటానికి 4, 400 తో భాగింపబడే శతాబ్ది సంవత్సరములు మాత్రమె లీపు సంవత్సరములుగా తీసుకొని 100 చేత భాగింపబడినవి తీసుకొనకుండా వదిలివేసేవారు. ఇంత పెద్ద మార్పుని అప్పటికే బాగా అలవాటు పడిన కాలెండర్ లో సరి చెయ్యటానికి, october 4, 1582 తరువాత, అక్టోబరు 15, 1582 గా ప్రకటింపబడినది. అంటే 10 రోజులు, ఆ క్యాలెండరు లో కనిపించవు. అందువల్ల వారి పండుగ తేదీలకు వారు పండుగ చేసుకొను సందర్భములకు పొంతన లేదని వారి శాస్త్రజ్ఞులే వక్కాణిస్తున్నారు. క్రీ ||శ|| 1582 వారికి సరియైన కాలగణనా విధానమే లేకుంటే వారి పండుగలకు వారి తేదీలకు పొంతన రాదు కదా. కొత్త సంవత్సరం ఎప్పుడు ఎందుకు రావాలో చెప్పటానికి ఋతువుల ఆధారాంగా కాకుండా రాజు యొక్క అధికార బలం వలన జరుపుకోవడం దురదృష్టం.

రాజు బలం, భయం వలన జరుపుకునే పండుగ రోజు మార్చగలరు కానీ అలవాట్లు కాదు కదా, అందుకే పద్దు పుస్తకాలను మూసి కొత్త పద్దు మొదలు పెట్టడం లాంటివి (closing of account books starting a new account books with fresh opening balance) ఇప్పటికీ మార్చి నెలాఖరులోనే జరుగుతాయి. ఇంకా కొంతమంది అప్పటి రాజు బెదిరింపులకు భయపడకుండా ఏప్రిల్ ఒకటి నే కొత్త సంవత్సరంగా జరుపుకునేవారి అలవాటు మార్చటానికి ఏప్రిల్ ఒకటి ఫూల్స్ డే గా ప్రచారం చేసారు. కాలక్రమేణా జనవరి ఒకటి కొత్త సంవత్సరం అని ప్రజల మీద రుద్దబడింది.

మనం నూటికి నూరుపాళ్ళు శాస్త్రీయమైన మనదైన భారతీయ కాలమానం వదిలి ఇంతటి అవకతవకలున్న అశాస్త్రీయమైన కాలమానాన్ని పాటించమే కాకుండా అదే గొప్పది అని వాదించే గొప్ప నాగరీకులంగా మారిపోయాం.
అసలు మన భారతీయ కాల గణన శాస్త్రీయం అని చెప్పటానికి మన పంచాంగం తయారీ ఏ రాజు యొక్క హస్తక్షేపం లేదు