అవివేకం-Foolishness

व्याळम् बाल्मृणालतन्तुभिरसौ रोद्धुम् समुज्जृम्भते
भेत्तुम् वज्रमणिम् शिरीषकुसुमप्रान्तेन सन्नह्यति
माधुर्यम मधुबिंदुनाा रचयितुं क्षाराम्बु धेरीहते
मूरखान्यः प्रति नेतुमिच्छाति बलात्सूक्तैः सुधास्यन्दिभिः

వ్యాళం బాలమృణాళతన్తుభిరసౌ రోద్ధుం సముజ్జృమ్భతే
భేత్తుం వజ్రమణిం శిరీషకుసుమప్రాన్తేన సన్నహ్యతి
మాధుర్యం మధుబిన్దునా రచయితుం క్షారామ్బు ధేరీహతే
మూర్ఖాన్యః ప్రతి నేతుమిచ్ఛతి బలాత్సూక్తైః సుధాస్యన్దిభిః

व्याळम् means a wild elephant, बाल्मृणालतन्तु means a small and weak string that is present in the stem of Lotus flower. Is it really possible to stop a wild elephant with the tiny string of Lotus flower?
The diamond is the hardest material on the earth, is it possible to cut a diamond with soft and smooth flower petals??
Sea is a representation of infinity and salty in taste, is it possible to break the salty taste and make it sweet by mixing it with a drop of honey or a small limited quantity of honey??? In the same way, it is impossible to entertain or make a fool or a wicked person happy, even with nectorly nicer words from a small kid.
Here, the poet is correlating the amout of wild strength in the wild elephent, hardness of a diamond, and slatness of a sea. Any attempts to make him happy will become as small as string of lotus stem, flower petal made knife and few honey drops. eventually all the efforts will be wasted.

వ్యాళం అంటే ఏనుగు బాల మృణాళతంతు అంటే అప్పుడే పుట్టిన తామర తూడుల దారములతో అని, మదపుటేనుగును అలాంటి సన్నని పలుచనయిన తామరతూడుల దారంతో కట్టి దాన్ని రోద్దుం అంటే నిరోధించటం సాధ్యమా?
వజ్రం ప్రపంచంలోకెల్లా కఠినమైన పదార్ధం అలాంటి వజ్రాన్ని కోమలమైన పువ్యుతో కోసి ముక్కలు చెయ్యటంసాద్యమా?
అనంతం అని చెప్పటానికి సాగర జలాలను వుదహరిస్తారు, అంతటి అనంతమైన సాగరంలో ఉప్పతనం (క్షారం) తగ్గించటం ఒక మధు బిందు అంటే తేనె బొట్టు లేదా కొంత పరిమితమైన తేనె వలన సాధ్యమవుతుందా? అలాగే బాలాత్సూక్తై సుధాస్యన్దిభిః అంటే చిన్నపిల్లల మాటలు చిలకపలుకులు అంటాము అలాంటి చిలకపలుకులతో అమృతలాంటి మంచి విషయాలను చెప్పించి కూడా ఒక మూర్ఖునికి ప్రతి నేతుమిచ్ఛంతి అంటే రుచించవు. ఇక్కడ మూర్ఖత్వం మదపుటేనుగంత బలంగాను, వజ్రమంత కఠినంగానూ, సాగరజలాల్లో ఉప్పంత అనంతంగా వుంటాయి అని చెప్పటం, ఆ మూర్ఖత్వం తగ్గించటానికి లేదా మూర్ఖుడిని సంతోషపెట్టటానికి ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం తామరతూడుల దారంలా, పువ్వులాంటి కత్తిలాగా, చిన్న తేనె బొట్టులాగా నిరుపయోగం అయిపోతుంది.

Advertisements