సనాతన ధర్మం అంటే…

సనాతన ధర్మం అంటే ఏమిటో ఒక్క మాటలో చెప్పగలిగే నిర్వచనం కాదు. సనాతన అంటే ఎప్పుడూ వుండేది అని అర్థం, ఇంచుమించు శాశ్వతానికి పర్యాయపదం.

ధర్మం అంటే సత్యాన్ని కాపాడుకుంటూ వుండే ఒక జీవనశైలి (ఇంచు మించు నాగరికత అని అనవచ్చు). మరి సత్యం అంటే ఏమిటి అని అడుగుతారేమో…

నారదుడు ఇంద్రుడి చెరనుండి ప్రహ్లాదుడి తల్లిని (ప్రహ్లాదుడు గర్భంలో వున్నప్పుడు) విడిపించి తనకు సత్యం అంటే ఏమిటో ఇలా చెప్తాడు.

సత్యస్య వచనం శ్రేయః సత్యాదపి హితం వదేత్

యావత్భూతానాం హితం ఏతత్ సత్యం మతం మమ.

నిజం మాట్లాడటం మంచిది, నిజం కన్నా హితం మాట్లడటం అలవాటు చేసుకోవాలి. యావత్ భూతానాం అంటే సకల చరాచర జగత్తుకు హితం చేసేది సత్యం అని నా అభిమతం అంటాడు.

ఇక్కడ ముఖ్యంగా మూడు పదాలున్నాయి ఒకటి సత్యం, మతం చివరగా ధర్మం. నారదుడంతటివాడు ఇది సత్యం నా అభిమతం అన్నాడు, మతిః ఇతి మతం అంటే ఒకరి ఆలొచనలనుంచి పుట్టేది మతి దాన్ని ఆచరిస్తే అది మతం. కానీ అందరి ఆలోచనలు అందరికీ హితం చేసేలా వుండవు కదా, ఆయా ప్రకారంగా మతాలూ వాటి బోధనలు ఏర్పడ్డాయి. నారదుడి ఆలోచన ప్రకారం రాక్షస రాజు భార్యని బిడ్డను కాపాడటం హితం (యావత్ భూతానాం ) కాబట్టి దాన్ని కాపాడటం ధర్మం.

ధర్మం అనే పదానికి పర్యాయ పదాలు లేవు. అసలు ధర్మం అనే పదం వేరే ఏ దేశ భాషలలోను లేదు. వారికి అర్థం అయినంత వరకు మతమూ ధర్మమూ ఒక్కటే, మన దురదృష్ట వశాత్తూ భావదాస్యంలో వున్న మనం మన గొప్పతనాన్ని మరిచి వారు చెప్పిన నిర్వచనాలు అవలంబించాలో లేదో తెలియని అయోమయ స్థితికి దిగజారిపోయాం. పాస్చాత్య నిర్వచనం ప్రకారం మతం అంటే ఒక గ్రంధం ఒక దేవుడు ఓకే ప్రవక్త ఉండాలి, మరి హైందవం ఆకోవలోకి రాదు కానీ దాన్ని బలవంతంగా హిందూ ధర్మాన్ని హిందూ మతం అని వ్యవహరించటం మొదలు పెట్టాం.

నిజానికి సప్త సింధు అంటే 7 నదుల మధ్య వున్నా భూభాగంలో వున్న ప్రజలు అవలంబించిన జీవనశైలి సింధు నాగరికత ఆ సింధు కాలక్రమేణా హిందూ రూపంతరం చెందింది. ఇది హిందూ ధర్మం అని అనకూడదు సనాతన ధర్మం అని అనాలి ఎందుకంటే, ఈ విధమైన భారతీయ జీవన శైలి ఎప్పుడు నుండి అవలంబించటం మొదలు పెట్టారో ఎవ్వరికీ తెలియదు ఎన్ని యుద్ధాలు దండయాత్రలు జరిగిన చెదిరిపోకుండా నిలబడింది అందుకే అది సనాతనం అయ్యింది. సనాతన ధర్మం కాకుండా ప్రపంచ పటంలో ~49 రకరకాల జీవన శైలులు (నాగరికతలు) వున్నాయి అని చరిత్ర (ఈజిప్టియన్లు , మెసపొటేమియన్లు , రోమన్లు , గ్రీకులు, మయాన్లు , కుషాణులు ఇంకా చాలా…) కానీ మతాంధకారంలో జరిగిన దండయాత్రల వలన ఆ జీవన శైలులన్నీ తుడిచిపెట్టుకుపోయి కేవలం క్రిస్టియన్, ఇస్లాం లాంటి మతాలుగా మారిపోయాయి. కానీ సనాతన ధర్మం మాత్రం ఎన్ని దండయాత్రలు చవిచూసినా చెక్కు చెదరలేదు అందుకే సనాతనం.
సనాతన ధర్మం గురించి ఇంకొక్క మాట గర్వంగా చెప్పుకోగలిగినది ఏమిటి అంటే

భగవత్గీత లో కృష్ణుడు జాతస్య హి మరణం ధృవం అంటే పుట్టిన వాడు మరణిస్తాడు, మరణించిన వాడు వేరే రూపంలో మళ్ళీ పుడతాడు అని చెబుతాడు. మరి ఆలోచనల ద్వారా వచ్చిన మతాలకి పుట్టుక వుంది కాబట్టి వాటికి ఒక జీవన కాలం ఉంటుంది అది చరిత్ర ద్వారా మనకు తెలుసు కూడా, సనాతన ధర్మం పుట్టుక లేనిది అంటే దానికి జీవన కాల పరిమాణం కూడా ఉండదు అది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది.

అదీ నాకు తెలిసిన నాకు అర్థం అయ్యిన సనాతన ధర్మం కథ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s