ముక్తి మార్గానికి సోపానం: Road to Eternity

व्याधस्याचरणं ध्रुवस्य च वयो विद्या गजेन्द्रस्य का,
का जातिर्विदुरस्य यादवपतेरुग्रस्य किं पौरुषम् ।
कुब्जायाः किमु नाम रूपमधिकं किं तत्सुदाम्नो धनं,
भक्त्या तुष्यति केवलं न च गुणैर्भक्तिप्रियो माधवः ॥

వ్యాధస్యాచరణం ధృవస్య  చవయో విద్యా గజేంద్రస్య కా
కా జాతి విదురస్య యాదవపతోరుగ్రస్య కిం పౌరుషం
కుబ్జాయాః కిమునామ రూపమధికం కిం తత్సుధామో ధనం
భక్త్యా తుష్యతి కేవలం న చ గుణైర్భక్తిప్రియో మాధవః

What conduct was great of Vyaadha ? Where was Dhruv that old? What knowledge did Gajendra have ? Where was Vidur of a higher class ? What was the negotiable workings of Yadupati Ugrasena ? Where was there any beauty in Kubja ? Where was there any wealth possessed by Sudama ? Even then all of them realized God! Because to God, only devotion and love are dear to him. He is only satisfied with devotion, not due to their conduct, knowledge or qualities.

ఒక భక్తుడు మాధవుడు లేదా పరమేశ్వరుడు ఏమి చేస్తే తృప్తి పొందుతాడు అని ఆలోచించసాగాడు.
మంచి ఆచార వ్యవహారాల వలనా? కాదు వ్యాధ అంటే వేటగాడు ఇక్కడ గుహుడు, కన్నప్ప,వీరికి ఏమి ఆచార వ్యవహారం తెలుసు? కాస్త వయస్సులో పెద్దవాళ్ళని చూసి తృప్తి పొందుతాడా? కాదు కాదు ధృవుడి వయస్సు ఎంత?
వారి జ్ఞానం వలనా? అదీ కాదు గజేంద్రుడి ఏమి జ్ఞానం వుంది? పోనీ వారి జాతి కులం బట్టి తృప్తి చెందుతాడా? ఇది అసలు కానే కాదు విదురుడి జాతి ఏమిటి? వారి సౌర్య పరాక్రమాలు వలనా? కానే కాదు యాదవులరాజుకున్న పౌరుషం ఏమిటి? అందచందాల వలనా? కుబ్జ కున్న అందమేమిటి? వారి సిరి సంపదల వలన అయ్యి ఉండవచ్చా? అహ కాదు సుధాముడికున్న సిరిసంపదలు ఏమిటి? ఇవి ఏమీ లేకుండానే వీరందరినీ తన అక్కున చేర్చుకున్నాడే. మరి దేనివలన పరమేశ్వరుడు తృప్తి పొందుతాడు? ఆ కేవలం భక్త్యా తుష్యతి భక్తి వలన మాత్రమే వారికి భగవత్సాక్ష్యాత్కారం కలిగింది వారి గుణ గణాల వలన, రూపు రేఖలు, వయో విజ్ఞానాలు, సౌర్య పరాక్రమాలు, సిరిసంపదలు కాదు. కేవలం భక్తి వలన మాత్రమే పరమేశ్వరుడు తృప్తి పొందుతాడు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s