Virata parva & Rains-విరాటపర్వం-వానల రాక

మనకు సాధారణంగా వర్షాలు రాకపోతే, కరువు సంభవిస్తే విరాటపర్వం చదవమని చెబుతారు. అది నిజమేనా? నిజంగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అసలు విరాటపర్వంలో వర్షాలు కురిపించటానికి ఏముంది?

అజ్ఞాతవాసంలో (విరాటుని కొలువులో) వున్న పాండవులను పసిగట్టి వారిని తిరిగి వనవాసానికి పంపాలనే కుట్రతో దుర్యోధనుడు పాండవులని వెతకసాగాడు. ఎంతకీ దొరకకపోయే సరికి భీష్ముని చేరి తాతా నీకు వాళ్ళెక్కడున్నారో తెలిసినా చెప్పటంలేదు అని అపనింద వేసాడు. అప్పుడు, భీష్ముడు వారున్న చోటు నాకు తెలియదు, కానీ వారున్న చోటుని గుర్తించటానికి కొన్ని లక్షణాలు చెబుతాను విను అని ఇలా చెప్పాడు. ఆ సన్నివేసాన్ని ఆంధ్రమహాభారతంలో తిక్కన సోమయాజులు రాసారు. వ్యాస భారతంలో అయితే ఈ సన్నివేసానికి ఏకంగా ఒక సర్గే వుంది.

బ్రాహ్మణభక్తియుఁ, బరహిత శక్తియు నిర్మల మతియును, నీతి రతియు,
సత్యభాషణమును, సాధుపోషణమును జిరవితరణమును, సేవ్యగుణము,
సన్మార్గరక్షయు, నున్మత్తశిక్షయు నంచితోదయముఁ, గృపాతిశయము,
బంధు సంప్రీతియు, భవ్య విభూతియు శాస్త్రోపగమము, నస్ఖలితదమము

సజ్జన స్తవనీయ సౌజన్యములును ధర్మసంచిత బహు ధన ధాన్యములును
గలుగు నక్షీణ పుణ్యదోహలుఁడు ధర్మ సూనుఁ డున్న దేశంబున మానవులకు.

1. బ్రాహ్మణభక్తియు = బ్రాహ్మణుల పైన భక్తి (ఇక్కడ బ్రాహ్మణులు అంటే ఒక జాతినుద్దేశించినది కాదు. వేదం చదువుకున్నవారు అని)
2. పర హిత శక్తి = పర హితంకోసం ఉపయోగించే శక్తి
3. నిర్మల మతి = స్వచ్ఛమైన బుద్ధి
4. నీతిరతి= నీతిమీద ఆసక్తి
5. సత్యభాషణము = నిజం మాట్లాడటం
6. సాధుపోషణము= సాధువులను అంటే మంచివారిని ఆదరించటం
7. చిరవితరణము= చిరకాలం నిలిచే దానం చేయటం
8. సేవ్యగుణమూ= సేవించదగిన గుణమూ
9. సన్మార్గ రక్షయూ= మంచి నడవడికను కాపాడటమూ
10. ఉన్మత్త శిక్షయూ= దుర్మార్గులను శిక్షించటమూ
11. అంచితోదయము= న్యాయమైన అభ్యుదయమూ
12. కృపాతిశయమూ= అతిశయమైన అంటే చెప్పలేనంత కృప
13. బంధుసంప్రీతియు= బంధువులు మీద ప్రీతి
14. భవ్యవిభూతి= శుభకరమైన ఐశ్వర్యమూ
15. శాస్త్రోపగమమూ= శాస్త్ర ప్రకారము నడవడిక
16. అస్ఖలిత దమమూ= జారిపోని ఇంద్రియ నిగ్రహమూ
17. సజ్జన స్తవనీయ సౌజన్యములును= మంచివారిచేత కీర్తింపబడే మంచితనమూ
18. ధర్మసంచిత బహు ధన ధాన్యములును= ధర్మబద్ధంగా సంపాదించిడిన పెక్కు ధనధాన్యములు

అక్షీణ పుణ్యదోహలుఁడు ధర్మ సూనుఁ డున్న దేశంబున = అక్షయమైన పుణ్యాన్ని సంపాదిచాలనే ఉత్సాహం కలిగిన ధర్మరాజు వున్న దేశంలో మానవులందరకీ

ఈ గుణాలు అబ్బుతాయి అని ధర్మరాజుని పొగుడుతూ, రాజ్యంలో ప్రజలంతా ఇన్ని మంచిగుణాలతో మెలిగితే ఆ రాజ్యం కరువు కాటకాలు లేకుండా సుసంపన్నంగా వుంటుంది. కనుక నువ్వు సుసంపన్నంగా వున్న రాజ్యాలను వెతుకు అని భీష్ముడు చెబుతాడు.

ఇక్కడ మనం గమనించాల్సినది విరాటపర్వంలో ధర్మరాజు గుణగణాలను మనం కూడా అవలింబిస్తున్నామా లేదా అని, ఆ మహానుభావుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మనం అనుసరిస్తే మన దేశం కూడా సుసంపన్నంగా వుంటుంది కానీ వేదిక మీద ఒకాయన విరాటపర్వం చదివినంతమాత్రాన, పది లేదా వంద మంది విన్నంత మాత్రాన వర్షాలు పడి కరువు తప్పిపోదు. దురదృష్టం ఏమిటంటే ప్రస్తుతం మనం అందరం కర్మ చేయడానికి ఇచ్చే ప్రాధాన్యత ఆ కర్మ ఎందుకు చేస్తున్నామో అర్ధం చేసుకోవటానికి ప్రయత్నం చేయటంలేదు.

As per our mythology, there is a general belief that if any place is suffering from drought, then read Virata Parva of Mahabharata in that place as a ritual. Is it true? just by reading few verses from a text will give us rains? what is there in Virata Parva which is so powerful enables the rains to come?

Duryodhan wants to identify where Pandavas are hiding during their ajnatavasa, with a bad intention of sending them back to vanavasa (exile). After many unsuccessful attempts, he approached his grandfather Bhishma, and asked, do you know where are they hiding? Are you not telling me the information of their whereabouts? Then Bhishma replied saying I don’t know where they are hiding. But I can tell you a clue where you can find them. In telugu mahabharata tikkana somayaji has writtnen in a small peom about this situation. In vyasa mahabharata there is complete chapter to explain about this situation.

brahmNa bhktiyu parahita Saktiyu nirmala matiyunu neeti ratiyu
satya saMbhaShNaamU saadhUpoShNamu chiravitaraNamu, sEvya guNamu
sanmaarga rakShayu, unmatta SikShyu saMchitOdayamu, kRupatiSayamu
baMdhU saMpreetiyu, bhavya vibhUtiyu, SastrOpgamamU asKalitadamamu

sajjanastavanIya saujanyamulunu dharma saMchita bahu dhanadhaanyamulunu
kalugu nakShINa puNyadOhaluDu dharma sUnuDunna dESamuna maanavulaku

1. brahmNa bhktiyu= Giving respect to bhrahmanas (knowledgable people)
2 prahita Saktiyu= spending our energy for the welfare of others
3. nirmala matiyunu= clean and good thinking mind
4. neeti ratiyu=showing interest to moral values
5. satya saMbhaShNamU =speaking only truth
6. saadhUpoShNamu= taking care of sages
7. chiravitaraNamu=donating which is useful for a longer life,
8. sEvya guNamu= quality of doing helping others
9. sanmaarga rakShayu= protecting the people who are righteous,
10. unmatta SikShyu= punishing the bad,
11. saMchitOdayamu= progress made for the welfare of the people,
12. kRupatiSayamu= plenty of kRupa
13. baMdhU saMpreetiyu= maintaining good relations with relatives and friends
14. bhavya vibhUtiyu= wealth which is gathered on the basis of righteous,
15. SastrOpgamamU= A life style told as per the the Sastras
16. asKalitadamamu= full control over sensual pleasures
17. sajjanastavanIya saujanyamulunu = good qualities that are being appreciated by sages
18. dharma saMchita bahu dhanadhaanyamulunu= Wealth gathered by means of dharma

kalugu nakShINa puNyadOhaluDu dharma sUnuDunna dESamuna maanavulaku= will happen in a state where dharmaraja is residing.

So Bhishma has praised dharmaraja, where ever he stays that entire kingdom will never suffer any drought.

Here one important thing to observe is a state not suffering from any drought is due to the life people lead with dharmaraja. So in order to have rains just by reading few verses will not help in getting rains, it is the life style that matters to have a peaceful life. unfortunately we simply get trapped in a ritualistic society than understanding the essence of the karma to be performed.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s