కాల గణన-4

ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే పాశ్చాత్యులు వారికి విజ్ఞానం పరిధిలో ఒక సంవత్సరం అంటే భూమికి సూర్యుని చుట్టూ తిరగటానికి 365.24… రోజులు పడుతుంది అని అంటే రోజుకు 24 గంటల సమయం అని కొంత సేపు పగలు కొంత రాత్రి కలిపి ఒక రోజు అని నిర్ధారణ చేసేసారు. అంటే వారి ఉద్దేశ్యం ప్రకారం సూర్యుడు కదలడు భూమి మాత్రమే కదులుతుంది కాబట్టి కదలని సూర్యుడిని ఆధారంగా చేసుకుని కాలం లెక్కకడితే సరిపోతుంది అని అభిప్రాయం. నిజానికి సూర్యుడు కదలటంలేదా? కాదు యావత్ నక్షత్ర మండలం (గెలాక్సీ) కదులుతున్నప్పుడు సూర్యుడు కదలడా? ఇదే పాశ్చాత్యుల ప్రతిపాదన ప్రకారం బిగబాంగ్ థీరీ లో సృష్టి లో అనేక నక్షత్ర మండలాలున్నాయి మన నక్షత్ర మండలం పేరు మిల్కీవే పాలపుంత అని చదువుకున్నాం పై ఈ నక్షత్ర మండలాలు కూడా కదులుతున్నాయి అని వారి ప్రతిపాదన. అందుచేత దూరాలు కాలాలు కొలిచే టప్పుడు ఒక కదలని వస్తువుని ఆధారంగా చేసుకుని కొలవాలి. లేదా రెండు మూడు కదిలే వస్తువుల ఆధారంగా చేసుకుని కొలవాలి. పాశ్చాత్యులు చేసిన తప్పు అదే.

కానీ భారతీయులు కాలమానం తయారు చేయటానికి సుర్యడు చంద్రుడు భూమిల మద్య దూరాలను ఆధారంగా చేసుకుని తయారు చేసారు.
మన నూతన సంవత్సరం చైత్రమాసం శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. అక్కడి నుంచే మన కాలమానం కూడా…

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యుడు చంద్రుడు భూమీ ఒకే సరళ రేఖలో వుంటాయి. అంటే చంద్రుడు భూమి సూర్యడి మద్య కోణం 0 డిగ్రీలు. అదే మన మొదటి తిథి. అసలు తిథి గురించి తెలుసుకునే ముందు కొంత ఉపోద్ఘాతం అవసరం.

నిజానికి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతన్నా భూమి మీద నిలబడిన మనకి భూమి స్థిరంగా నూ సూర్యుడు, చంద్రుడు కదులుతున్నట్లు కనిపిస్తాయి. దీన్నే ఇంగ్లీషు లో relative motion అంటారు. మన లెక్కలు అన్నీ ఇలాంటి relative frame of reference మీద ఆధారపడి వుంటాయి.

భూమి మీద వుండి చూసే మనకు సూర్య చంద్రుల మద్య కోణం మారుతున్నట్లు కనిపిస్తుంది. తిథి అంటే రోజులో కొంత సమయం. సూర్యుడికి చంద్రుడికి మద్య కోణం 12 డిగ్రీలు మారితే, అలా మారడానికి పట్టే సమయాన్ని తిథి అంటారు. 12 డిగ్రీలు ఎందుకని అడుగుతారేమో… ఇంతకు ముందు చెప్పినట్లు మనకు ఒక నెల అంటే ముప్పై తిథులు (శుక్ల పక్షంలో 14 తిథులు, కృష్ణ పక్షంలో 14 తిథులు అమావాస్య, పౌర్ణమి కలిపి 30). 360 డిగ్రీలు/30 తిథులు అంటే 12 డిగ్రీలు.

అంటే ఇప్పుడు చంద్రుడు, భూమి సూర్యుల మధ్య కోణం
0-12 డిగ్రీలు ఉంటే ప్రథమ తిథి పాడ్యమి
12-24 డిగ్రీలు విదియ లేదా ద్వితీయ
24-36 తదియ లేదా తృతీయ
36-48 చవితి
tithi_calculationఇలా లెక్క కట్టుకుంటూ పోతే మొత్తం 30 తిథులు పూర్తి అవుతాయి. సులభంగా అర్థం కావాలంటే తూరుపు తిరిగి సూర్యుడిని చూసిన తరువాత చంద్రుడిని చూడాలంటే ఆ రోజు తిథి ప్రకారం అన్ని డిగ్రీలు పక్కకు తిరిగితే చంద్రుడు కనబడతాడు.

తిథి ఆ 12 డిగ్రీలు కోణం మారే సమయం 19 గంటల నుంచి 26 గంటల సమయం పడుతుంది. ఇంగ్లిష్ రోజే బాగుంది సరిగ్గా 24 గంటల తరువాత రోజు మారుతుంది అనుకుంటారేమో…
మన సిద్ధాంతం ప్రకారం తిథి వార నక్షత్రాలలో ఏది మారినా ఆ మార్పు ప్రకృతి సిద్ధంగా కనిపిస్తుంది, కానీ అర్ధరాత్రి 12 గంటలకు ప్రకృతి లో ఏ మార్పు లేని సమయంలో రోజు మారదు.

ఇక ఈ తిథి కాల వ్యవధి 19-26 గంటలు ఎందుకు మారుతుందో చూద్దాం.

భూమి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో(elliptical orbit) తిరుగుతుంది అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఆలా తిరుగుతున్నప్పుడు భూమి గతి వేగములని కెప్లర్ గమన నియమాలు (keplar laws of planetary motion) అని మనకు చిన్నప్పుడు అదేదో ఒక ఆంగ్లేయుడు ప్రతిపాదించినట్లు నేర్పించేవారు. అదే కెప్లర్ గమన నియమాల ప్రకారం భూమి సూర్యునికి దూరంగా వున్నప్పుడు నెమ్మదిగాను దగ్గరగా వున్నప్పుడు వేగంగాను కదులుతుంది. అందుకే భూమికి సూర్యునికి మధ్య వేగం తక్కువగా వున్నప్పుడు తిథి 26 గంటలు పడుతుంది.
kepler-second-law
అంటే భూమి యొక్క గతి విధులను ఆంగ్లేయుడు పుస్తకాలలో ప్రతిపాదించటానికి ముందే మన దేశంలో ప్రతి వూరిలో పంచాగం లెక్కకట్టే ప్రతి వారికి తెలుసన్నమాట, దురదృష్ట వశాత్తు మన చరిత్రను మనమే మర్చిపోయి పక్కవాడు చెప్పినదే చరిత్రగా చదువుకుంటున్నాం.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s