కాల గణన-2

ఇక నెలలకు పెట్టిన పేర్లను గూర్చి తెలుసుకొందాము.

జనవరి: జానస్ అన్న రెండుతలల దేవుడు స్వర్గంలో ప్రధాన ద్వారం వద్ద వుంటూ ఒక తలతో జరిగిన వర్షమును ఒక తలతో జరగబోయే వర్షమును చూస్తూఉంటాడట. ఆయన పేరుతో ఈ నెల ఏర్పడింది. 29 రోజులు కల్గిన ఈ నెల 31 రోజుల నేలగా జూలియస్ సీజరు చేసినాడు.

ఫిబ్రవరి: రోమన్ల పండుగ ఫిబ్రువా అన్నది లూపర్కాస్ అన్న దేవుని పేరుతో పునీతుడవటానికి (to get purified) జరుపుకుంటారు. దీనికి కొంతకాలం 23, 24 రోజులుండేవి. తరువాత 30 రోజులై ఆతరువాత జూలియస్ సీజరు, అగస్తస్ సీజరు ల వల్ల 28 రోజులై కూర్చుంది.

మార్చి: మార్స్ రోమనుల యుధ్ధ దేవత. ఈయన ఒక చేతితో శూలం మరొక చేతితో డాలును ధరించి రెండు గుర్రాలమీద వస్తాడు. ఈయన పేరుతో ఈ నెల ఏర్పడింది.

ఏప్రిల్: రోమన్ల వసంత దేవత పేరు అమ్నియో ఏప్రిట్. ఈమెను రోమన్లు ఎంతో అందమైనదిగా, పునరుజ్జీవనకు నాందిగా భావిస్తారు.

మే: భూగోళాన్ని తన భుజస్కంధాలపై మోసే అట్లాసు యొక్క ఏడుగురు కూతుళ్ళలో మేయో ఒకటి. అట్లాసు ఈ ఏడు మందిని ఏడు నక్షత్రములుగా మార్చివేసాడు (మన సప్తర్షి మండలం) దీనిని అంటే ఈ నెలను వయసులో పెద్దవాళ్ళకు (maiores) అంకితమిచ్చినారు.

జూన్: జూపిటర్ భార్య జూనో ఈ జూన్ మాస స్థానానికి ఈవిడ జూనియస్ అన్న దేవునితో పోరాడుతుంది. వారిరువురి పేర్లతో జూన్ వచ్చింది. దీనిని యువతకు (juniores) అంకితమిచ్చారు.

తరువాత నెలల పేర్లు పెంటలిస్, సేక్స్టలిస్, సెప్టంబర్,అక్టోబర్, నవంబర్, డిసెంబర్ గ ఉండేవి. 5, 6 నెలలైన పెంటలిస్, సేక్స్టలిస్ లను జూలై, ఆగష్టులుగా తమ పేర్లతో జూలియస్, అగస్టస్ సీజర్లు మార్చుకున్నట్లు ఇంతకు వివరించాను. 7వ నెలనుండి 10వ నెలవరకు పేర్లు అలాగే వుండి, వారి తప్పుడు లెక్కలకు సాక్ష్యాలుగా నిలిచాయి.

సెప్టెంబర్ – సెప్ట్ అంటే సప్తమి 7వ నెల
అక్టోబర్ – అక్ట్ అంటే అష్టమి 8వ నెల
నవంబర్ – నవ అంటే నవమి 9వ నెల
డిసెంబర్ – డెస్సి అంటే దశమి 10వ నెల

దీనిని బట్టి ఈ మార్పులకు ముందు 11వ నెలగా జనవరి, 12వ నెలగా ఫిబ్రవరి వున్నట్లు రూఢియై పోయింది.

ఇన్ని మార్పులు చేర్పులు కూర్పులు జరిగిన తరువాత కుడా వారి కాలమానము భూభ్రమణముతో పోల్చి చూస్తే 26 సెకన్ల తేడా వున్నది. ఆ సెకన్లు 3323 సంవత్సరములకు ఒకరోజు ఔతుంది. దానిని ఆ సంవత్సరములోని ఒక నెలకు (బహుశ ఫిబ్రవరికేనేమో) కలుపుకోవలసివస్తుంది.

సాధారణంగా లెక్కలు సరిగా రాని వాడి దగ్గరకు మనం మన పిల్లలను లెక్కలు నెర్కకోవటానికి పంపం, ఇక్కడ మన దౌర్భాగ్యం చూడండి, కాలాన్ని లెక్క గట్టటంలో ఇన్ని తప్పులు చేసిన వారి కాలమానాన్నే పాటించవలసి వస్తోంది. పోనీ ప్రపంచం అంతా పాటిస్తున్న ఈ కాలమానాన్ని మన జీవన భుక్తి కోసం తప్పక పాటించాలి అని సరిపెట్టుకుంటే పరవాలేదు. కానీ మన భారతీయ కాలమానాన్ని కించపరిచేలా మాట్లాడటం, అసలు పూర్తిగా ఆ పద్ధతిని మరిచిపోవటం చాలా గర్హనీయమైన విషయం. మన తరువాతి తరానికి ఈ జ్ఞానాన్ని అందచేసి, మన సంస్కృతిని పునరుద్ధరణ చేయటం మనందరి బాధ్యత.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s