కాల గణన-1

కాల గణన (Western Style)
కాలాన్ని అసలు మనం ఎందుకు లెక్క కట్టాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే చాలామందికి సమాధానం దొరకకపోవచ్చు. అసలు కాలం లెక్క కట్టటానికి మూల కారణం, మన పూర్వీకులు కాలం ఒక నిర్దిష్టమైన రీతిలో మరల మరల తిరిగి వస్తుంది అని గుర్తుపట్టారు. అలా గుర్తుపట్టటం వలన మన పూర్వీకులకు పంటలు ఎప్పుడు వెయ్యాలి కోతలు ఎప్పుడు కొయ్యాలి లాంటి విషయాలమీద ఒక అవగాహన కలిగింది. ఆ జ్ఞానాన్ని నిస్వార్థంగా మన పూర్వీకులు పంచాంగం రూపంలో మనకు అందచేశారు.

అనంతమైన కాలాన్ని గణించడం అంత సులభం కాదు. మన భారతీయ కాలమానం గొప్పతనం తెలుసుకునే ముందు ప్రస్తుతం మనమందరమూ పాటిస్తున్న పాశ్చాత్య కాల గణన గురించి తెలుసుకుందాం.

క్యాలెండరు అన్నమాట లాటిన్ భాషలోని క్యాలండీ నుండి పుట్టింది అంటే పద్దుల పుస్తకం (account book), ఇచ్చిన అప్పులు మొదటి రోజున వసూలు చేసుకోవటానికి దీని ఆసరాగా పనిచేసేవారు. తరువాత పౌర అనుశాసనమునకు ప్రజా ప్రయోజన కార్యాచరణమునకు ఇది పాశ్చాత్యులు ఉపయోగించేవారు. దీనిని వీరు కాల క్రమేణ Almanec అని గూడా అన్నారు. నిజానికిది Al – manakh అంటే వాతావరణ సూచిక అని అన్వయించుకొనవచ్చును. ఈ పదము Spanish Arabic భాషలకు చెందినది.

నేడు మనముపయోగించే క్యాలాండరు రోము, ఈజిప్టు గ్రెగొరీ విధానాల కలయిక. రోము రాజ్యాన్ని పాలించిన రోములస్ కాలంలో ఏడాదికి 304 రోజులుండేవి. సంవత్సరానికి 10 నెలలుండేవి. మార్చి నుండి కొత్త సంవత్సరం మొదలయ్యేది. ఒక్క సారి ఆలోచించండి రెండు నెలల కాలాన్ని తప్పుగా గణిస్తే, పంటల కోతల సమయం అనుకున్నదానికన్నా తరువాత రావటం కానీ ముందు రావటం కానీ జరుగుతుంది కదా. ఈ తేడాని గమనించి తరువాత కాలంలో దీనిని 10 నుండి 12 నెలలకు మార్చి, సంవత్సరమునకు 354 రోజులుగా సరిచేశారు. ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే చాంద్రమాన సంవత్సరంలో 354 రోజులుంటాయి. మన భారతీయ కాల గణన ప్రకారం చంద్రుడు 27 నక్షత్రాలలో ఇంచుమించు ఒక్కొక్క రోజు ఒక్కొక నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ లెక్కన 27 నక్షత్రాలకు ~29.5 రోజులు X 12 మాసాలు = 354.3 రోజులు.

పంపీలయస్ చక్రవర్తి క్రీ ||పూ|| 7వ శతాబ్దంలో తిరిగి సరి సంఖ్య మంచిదికాదనుకొని 355 రోజులుగా మార్చారు (చాలా హాస్యాస్పదం ఏమిటంటే సూర్య, చంద్ర భూమి యొక్క గమనాలతో పని లేకుండా రాజుకి నచ్చలేదు కనుక ఒక రోజు సంవత్సరం లో పెంచేశారు).

ప్రపంచమంతటా నూతన సంవత్సరము మొదలయ్యేది వసంత ఋతువు (spring) లో అంటే మార్చ్ నెలలో. ‘Spring’ అప్పుడే కదా వచ్చేది. ఎందుకంటే వసంత ఋతువు లోనే చెట్లు చిగురుతొడుగుతాయి అదీ ఒక రకమైన పుట్టుకే కదా, అందుచేత నూతన సంవత్సరం కూడా వసంత ఋతువు లోనే పుట్టేది (ఒకప్పుడు) అప్పటికి వారి సంవత్సరంలో తక్కువ రోజులున్నా కూడా their new year used to start in the month of march or april i.e in the spring sesson.

శిశిర (autumn) ఋతువులో (మన ప్రస్తుత జనవరి నెలలో) అంతా చలి ఆ చలికి తట్టుకోలేక శరీరం జర్జరీభూతం అయ్యి ముడతలు పడటం జరుగుతుంది. చెట్ల ఆకులు పళ్ళు రాలిపోయి మట్టిలో కలిసి ఖననం అయిపోతాయి, అంటే ఒకరకంగా మరణం, కాని పాశ్చాత్యులు వేడుకలు spring (March) లో కాదని శిశిరం (autumn) అంటే జనవరి లో చేయటం మొదలుపెట్టారు. క్రీ ||పూ|| 153 లో సంవత్సరాన్ని జనవరికి మార్చటం జరిగింది. మరల దానిని ఎందుకో మార్చికి మార్చారు.

తరువాత క్రీ ||పూ|| 46 వ సంవత్సరములో అప్పటి రోమన్ చక్రవర్తి అయిన జూలియస్ సీజరు ఈజిప్ట్ వెళ్ళినపుడు అక్కడి క్యాలెండరు విధానాలను గమనించి ఖగోళ శాస్త్రజ్ఞుడైన సోసీజెనాస్ అనే అతని సహయంతో రోమను సంవత్సరానికి 365.25 రోజులుగా నిర్ణయించి, అప్పట్లో 30 రోజులుండే ఫిబ్రవరి (అప్పుడు సంవత్సరానికి చివరి నెల) నుండి ఒక రోజును తీసి, మార్చి నుండి 5 వ నెలయైన పెంటలిస్ (పెంట=5 -పంచమి) కు చేర్చాడు. ఏప్రిల్, జూన్, ఆగష్టు, సెప్టెంబరు, నవంబరు నెలలకు 30 రోజులనుంచి, ఫిబ్రవరి కి 29 రోజులు చేసి, సంవత్సరమును తిరిగి జనవరితో మొదలు అని శాసనం చేశాడు, పెంటలిస్ పేరును తన పేరుతో జులై గా మార్చుకొని సంవత్సరారంభం జనవరి తో చేయ ప్రారంభించినారు. 0.25 తేడాను, 4 సంవత్సరములకు ఒక రోజు ఔతుంది కాబట్టి దానిని ఫిబ్రవరి నెలకు కలిపి (29+1) 30 రోజులు చేయటం జరిగింది. దీనిని leap year అన్నారు.

సీజరు మేనల్లుని కొడుకైన ఆగస్టస్స్ సీజరు 27 B.C. లో రోము చక్రవర్తియైన పిమ్మట సెక్ష్టలిస్ అను నెలకు (సెక్స్ట్టట =6 -షష్టి) తన పేరుతో ఆగస్ట్ అని పెట్టి దానికి ఫిబ్రవరి నుండి ఒక రోజు తీసి, అంటే దానిని 28 రోజులుగా చేసి, ఆగష్టుకు కలిపి దానిని కుడా 31 రోజుల నెలగా చేసినాడు. లీపియరును 3 సంవత్సరములకు మార్పు చేసి , ఫిబ్రవరి కి కలిపేవారు.

తరువాత కాలంలో రోజుల లెక్కలో ఖచ్చితత్వము పెరిగి సంవత్సరానికి 365.242199 రోజులు చేసారు. ఇందువల్ల ఏడాదికి 11 నిముషాల 14సెకన్లు తేడావస్తుంది. దీనిని 13 వ పోపు గ్రెగొరీVIII, కొందరు ఖగోళ శాస్త్రజ్ఞుల కూటమిని ఏర్పరచి , క్రీ ||శ|| 1582 లో గ్రెగోరియన్ క్యాలెండరు పేరుతో క్రొత్త క్యాలెండరును ప్రవేశ పెడుతూ లీపియర్ ను తిరిగి 4 సంవత్సరములకొకసారి చేస్తూ ఫిబ్రవరి కి ఆ ఒక రోజును కలిపేవారు.
ఆలా చేయటం వలన ఒక సంవత్సరానికి .007801 రోజు ఎక్కువగా వస్తుంది. దీనిని సరిదిద్దటానికి 4, 400 తో భాగింపబడే శతాబ్ది సంవత్సరములు మాత్రమె లీపు సంవత్సరములుగా తీసుకొని 100 చేత భాగింపబడినవి తీసుకొనకుండా వదిలివేసేవారు. ఇంత పెద్ద మార్పుని అప్పటికే బాగా అలవాటు పడిన కాలెండర్ లో సరి చెయ్యటానికి, october 4, 1582 తరువాత, అక్టోబరు 15, 1582 గా ప్రకటింపబడినది.

 

అంటే 10 రోజులు, ఆ క్యాలెండరు లో కనిపించవు. అందువల్ల వారి పండుగ తేదీలకు వారు పండుగ చేసుకొను సందర్భములకు పొంతన లేదని వారి శాస్త్రజ్ఞులే వక్కాణిస్తున్నారు. క్రీ ||శ|| 1582 వారికి సరియైన కాలగణనా విధానమే లేకుంటే వారి పండుగలకు వారి తేదీలకు పొంతన రాదు కదా. కొత్త సంవత్సరం ఎప్పుడు ఎందుకు రావాలో చెప్పటానికి ఋతువుల ఆధారాంగా కాకుండా రాజు యొక్క అధికార బలం వలన జరుపుకోవడం దురదృష్టం.

రాజు బలం, భయం వలన జరుపుకునే పండుగ రోజు మార్చగలరు కానీ అలవాట్లు కాదు కదా, అందుకే పద్దు పుస్తకాలను మూసి కొత్త పద్దు మొదలు పెట్టడం లాంటివి (closing of account books starting a new account books with fresh opening balance) ఇప్పటికీ మార్చి నెలాఖరులోనే జరుగుతాయి. ఇంకా కొంతమంది అప్పటి రాజు బెదిరింపులకు భయపడకుండా ఏప్రిల్ ఒకటి నే కొత్త సంవత్సరంగా జరుపుకునేవారి అలవాటు మార్చటానికి ఏప్రిల్ ఒకటి ఫూల్స్ డే గా ప్రచారం చేసారు. కాలక్రమేణా జనవరి ఒకటి కొత్త సంవత్సరం అని ప్రజల మీద రుద్దబడింది.

మనం నూటికి నూరుపాళ్ళు శాస్త్రీయమైన మనదైన భారతీయ కాలమానం వదిలి ఇంతటి అవకతవకలున్న అశాస్త్రీయమైన కాలమానాన్ని పాటించమే కాకుండా అదే గొప్పది అని వాదించే గొప్ప నాగరీకులంగా మారిపోయాం.
అసలు మన భారతీయ కాల గణన శాస్త్రీయం అని చెప్పటానికి మన పంచాంగం తయారీ ఏ రాజు యొక్క హస్తక్షేపం లేదు

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s