ఆనతి నీయ్యరా…

ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిది చేరగా

ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిది చేరగా

ఆనతి నీయరా హరా  

తన మీద దయ చూపని గురువుగారి ని శివుని తో పోల్చి గురువుని స్తుతించటానికి, (పూజించటానికి) గురువు సన్నిధి చేరటానికి సమ్మతి (అనుమతి) కోరటం ఈ పాట లోని ప్రత్యేకత. 

నీ ఆన లేనిదే రచింప జాలున వేదాల వాణితో విరించి విశ్వ నాటకం

నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయతో మురారి దివ్యపాలనం

వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై

వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై

 కదులును గా సదా సదాశివ ఆనతి నీయరా హరా 

ని నీ స ని ప నీ ప మ గ స గ ఆనతి నీయరా

అచలనాధ అర్చింతును రా ఆనతి నీయరా

 పమ పని పమ పని పమ పని గమ పని

సని సగ సని సగ సని సగ పని సగ

గమగసా నిపమ గమగస మగసని ఆనతి నీయరా  

జంగమ దేవర సేవలు గొనరా

మంగళ దాయక దీవెనలిడరా

సాష్ఠాంగమున దండము చేతు ర ఆనతి నీయరా 

ఇక్కడ పరమ శివుని (తన గురువు)  గొప్పతనాన్ని చెప్పటానికి ప్రయత్నం చేయతం జరిగింది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఆ విషయాన్నే మరింత గొప్పగా వివరించతం జరిగింది. నీ (శివుడు) ఆజ్ఞ లేకుండా విరించి అంటే బ్రహ్మ దేవుడు కూడా వేదాల రూపంలో విశ్వనాటకాన్ని రచించ గల్గేవాడేకాదు, శివుని అనుమతి లేనిదే మురారి అంటే మురాసురుని చంపినవాడు (కృష్ణుడు) అంటే శ్రీమహావిష్ణువు ముల్లోకాలని ఏలేవాడే కాదు. శివుడికి వున్న పేర్లలో అచలనాధుడు అనేది కూడా ఒక పేరు. జంగముడు అంటే బసవన్నని (నందిని) పూజించేవాడు, జంగమ దేవర అంటే శివుడు,   ఎల్లప్పుడూ పశుపతిని అధిష్ఠించి కదిలే ఓ సదాశివా, ఓ పరమశివా నా సేవలు అందుకుని మంగళదాయకమైన దీవెనలు ఇయ్యినాకు నీదరి చేరటానికి, నిన్ను స్తుతించటానికీ అనుమతి ప్రసాదించు అని శిష్యుడు కోరుతున్నాడు. 

సానిప గమపనిపమ, గమగ పప పప మపని పప పప

గగమ గస సస నిసగ సస సస సగ గస గప పమ పస నిస గసని సగ సగ

 సని సగ సగ పగ గగ గగ సని సగ గ గసగ గ

 పద గస గ మ స ని పమగ గ ఆనతి నీయరా 

 శంకరా శంకించకురా వంక జాబిలిని తలను ముడుచుకొని

విషపు నాగులను చంకనెత్తుకొని నిలకడ నెరుగని గంగనేలి

ఏ వంకలేని  నా వంకనొక్కకడగంటి చూపు పడనీయవేమి

ఈ తరుణిగ  సేవించుకొందురా ఆనతి నీయరా 

పరమ శివుని (గురువుగారి) మెప్పు పొందటానికి చాలా మార్గాలుంటాయి, అందులో ఒకటి పక్కవాడిలో లొపాన్ని చూపించి వాడికన్నా నేను మంచివాడినే అనిపించుకోవటం, దీన్నే చాలామంది reverse engineering అంటారు.  ఇక్కడ కూడా అలాటిదే, ఓ శంకరా నన్ను బ్రోవటానికి శంకించవలసిన అవసరం లేదు, వంక జాబిల్లిని తలన ముడుచుకున్నావు, విషపునాగులను మెడను చుట్టుకున్నావు, నిలకడ అంటూ ఎరుగని గంగని నెత్తి కెక్కించుకున్నావు, ఇన్ని వంకలున్న వీరందరినీ అక్కున చేర్చుకున్నావు మరి ఏ వంక లేని నా వైపు నీ ఓరకంట కూడా చూడవేమి? అలా చూసినా చాలు ఆ తరుణం కోసం నిన్ను సేవించటానికై ఎదురు చూస్తున్నాను.  

పప పమప నినిపమగస గగ

పప పమప నినిపమగస గగ

గమపని గ మపనిస మ పనిసగ ని స ప ని మ పా గా మా స

 పప పమప నినిపమగస గగ

 గమపని గా మపనిస మా

పనిసగ ని స ప ని మ ప గ మ స గా మ

పప పమప నినిపమగస గగా

గమపని గమపని స మపనిసగని

గమపని గమపని స మపనిసగని

స పని మ ప గ మ స గ మ

పప పమప నినిపమగస గ గా

గామపని గమాపాని స మపానిసగని

స పని మ ప గ మ స గ మ

పప పమప నినిపమగస గ గా గా

గగ మమ పప నిగ తక తకిట తకదిమి

మమ పప నినిసమ తక తకిట తకదిమి

పపనినిసస గని తక తకిట తకదిమిసపని

మప గమ సగమ

 పప పమప నినిపమగస గ గా 

రక్ష ధర శిక్షా దీక్ష ధ్రక్ష

విరూపాక్ష నీ కృపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష చేయక

పరీక్ష చేయక రక్ష రక్ష అను ప్రార్ధన వినరా

ఆనతి నీయరా హరాసన్నుతి సేయగ సమ్మతి నీయరా

దొరా సన్నిధి చేరగాఆనతి నీయరా హరా 

ఓ విరూపాక్షా నీ కృపావీక్షణ కోసం ఆశ తో ఎదురు చూస్తున్నాను, ఇంక ఆలస్యము చేయక నన్ను ఇంక పరీక్ష చేయక నా మొర విని నిన్ను స్తుతించటానికి, నిన్ను స్తుతించటానికి అనుమతినివ్వు. ఈ పాటను విన్నప్పుడు నాకు గజేంద్రమోక్షము గుర్తుకు వస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా గజేంద్రుడు మొదట మద గర్వంతో శ్రీమహావిష్ణువుని వేడగా విష్ణుమూర్తి కదలలేదు కానీ లావొక్కింతయు లేదు అన్నీ నువ్వే అని వేడితే విష్ణుమూర్తి దిగి వచ్చాడు. ఇక్కడ శిష్యుడు కూడా అదే మాదిరిగా ముందు పక్కవాళ్ళ లోపాలని చూపి వేడటం ఆ తరువాత రక్ష రక్ష అని ప్రార్థించటం జరిగింది.

2 thoughts on “ఆనతి నీయ్యరా…


  1. ఆ విషయాన్నే మరింత గొప్పగా వివరించతం జరిగింది. నీ (శివుడు) ఆజ్ఞ లేకుండా విరించి అంటే బ్రహ్మ దేవుడు కూడా వేదాల రూపంలో విశ్వనాటకాన్ని రచించ గల్గేవాడేకాదు, శివుని అనుమతి లేనిదే మురారి అంటే మురాసురుని చంపినవాడు (కృష్ణుడు) అంటే శ్రీమహావిష్ణువు ముల్లోకాలని ఏలేవాడే కాదు.

    ఇక్కడ శివునికి లక్ష్మీవిష్ణువులతో వాణీబ్రహ్మలతో ఉన్న బంధాన్ని వివరిస్తున్నట్టుగా గోచరిస్తోంది. అంటే బ్రహ్మాదివందితా అనే ప్రయోగం లాగా అన్నమాట. వీరందరూ శివుణ్ణి మన్ననతో చూచేవారు అని చెప్తున్నారు.
    ఇక్కడ పాటకీ వ్యాఖ్యకూ ఎక్కడో sync తప్పింది అనిపించింది. మీ వ్యాఖ్యలో లక్ష్మీ, శారదల గురించి కనబడలేదు. దీనికి కారణం (నేను అనుకోవడం) – మీరు అర్థాలు, భావాలు కలిపి ఒకేసారి చెప్పడం. ఉదాహరణకి మురారి అంటే చెప్పారు – అది వ్యుత్పత్త్యర్థము – అది ముందుగానే ప్రేక్షకుడికి చెప్పేస్తే తరువాత భావం simpleగా వ్రాయవచ్చు అని నా అభిప్రాయం. (at least for classical telugu songs)

    Liked by 1 person

  2. “ఈ తరుణిగ” — ఇది “కింకరునిగ” అంటే – సేవకుడిగా అని అర్థం

    “దక్షధ్వరశిక్షా దీక్షా దక్షా” – ఇది ఒక అమోఘమైన ప్రయోగం.

    దక్ష – అంటే “సమర్థుడు” (సాధించగలిగినవాడు)
    అని శివుణ్ణి అన్నాడు అనుకునేలోపుగా “దక్షాధ్వరశిక్ష” అన్నాడు – అంటే దక్షుణి ఆధ్వర్యంలో జరుగుతున్న యఙంలో పాలుపంచుకున్నవారిని శిక్షించినవాడా అనే అర్థం వస్తోంది అనుకుంటున్నాను. మరి నమ్మకంగా చెప్పలేను.

    దీక్షాదక్షా – ఎంతో సమ్నియమంతో కటిక సన్యాసిలాగా ఉండగలవాడు మన శివుడు – ఆయన పరమయోగి.

    Like

Leave a comment