Ek bar bidayi de maa…

Ekbaar biday de ma ghure ashi
Hasi hasi porbo phnashi dekhbe bharatbasi

Koler boma toiri kore
Dnariye chhilam rastar dhare Ma go
Borolatke marte giye
Marlam aarek Englandbashi

Haate jodi thakto chhora
Tor Khudi ki porto dhora Ma go
Rokte-mangshe ek koritam
Dekhto jagatbashi

Shonibaar bela doshtar pore
Judgecourtete lok na dhore Ma go
Holo Abhiram-er dwip chalan Ma
Khudiram-er phnashi

Baro lokkho tetris koti
Roilo Ma tor beta beti Ma go
tader niye ghor koris Ma
Bouder koris dasi

Dosh mash dosh din pore
Jonmo nebo mashir ghore Ma go
Tokhon jodi na chinte paris
Dekhbi golay phnashi

మన స్వాతంత్య్ర పోరాటానికి వంగ దేశానికి (బెంగాల్ ) చాలా సంబంధం వుంది. కొన్ని సార్లు నాకు చాలా ఆశ్చర్యమేస్తుంది కేవలం వంగదేశంలో నుంచే ఇంతమంది మహా మహా సమర యోధులు (రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర చటర్జీ, అరవిందో, సుభాష్ చంద్రబోస్, ఖుదీరాం బోస్) లాంటి వాళ్ళు ఎలా వచ్చారు? వారికి అంతటి స్ఫూర్తిని ఎవరు ఇచ్చారు అని? కాస్త లోతుగా ఆలోచిస్తే నాకు ఒక జవాబు దొరికింది అదే బెంగాల్ సాహిత్యం. ఇప్పటికీ వందేమాతరం విన్నా, జనగణమణ విన్నా అందరికీ వొళ్ళు పులకరిస్తుంది. గుండె ఆవేశంతో వేగంగా కొట్టుకుంటుంది.

అలాంటి ఎంతో అద్భుతమైన సాహిత్యాలలో ఈ పాట ఒకటి. ఇది అమర వీరుడైన ఖుదీరాంబోస్ ని ఉద్దేశించి రాసిన పాట. ఈ పాట ఎన్ని సార్లు విన్నా నాకు బాధ, ప్రేమ, ఆవేశం, భక్తి అన్నీ ఒకేసారి హృదయాంతరాళాలలోంచి బయటకు వస్తున్నాయి. నాకు బెంగాలీ రాదు, నాకున్న మిడిమిడి భాషా జ్ఞానం తో తెలిసిన అర్థం దానివలన కలిగిన అనుభూతి తో అందరికీ అదే భావన కలుగుతుందని ఇక్కడ రాస్తున్నాను.

బ్రిటిష్ వారి చేతికి చిక్కిన ఖుదీరాం ని ఉరి తీసే సమయం దగ్గరపడుతున్న క్షణం లో ఖుదీరాం తల్లి భారతమాతని ఉద్దేశించి అంటున్న మాటలుగా ఈ పాట సాగుతుంది.

పల్లవి:
అమ్మా (భారతమాతా!!!) ఈ ఒక్క సారికి నన్ను సాగనంపు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాను కదా!!! సాటి భారతీయులందరూ చూస్తుండగా నవ్వుతూ నీకోసం ఉరి కంభం ఎక్కుతాను మళ్ళి తిరిగి నీ ఒడి కే మన ఇంటికే తిరిగి వస్తాను.
(ఇక్కడ ఎంత సుకుమారంగా మృత్యువు ఒడిలోకి వెళుతూ కూడా తల్లితో ఇప్పుడే వచ్చేస్తాను అనగలిగే ధైర్యమూ, తిరిగి అదే తల్లికే పుట్టాలనే కాంక్ష పదాలలో స్పష్టంగా కనబడుతుంది).

చరణం-1:

చేతిలో బాంబు పట్టుకుని దేశాన్ని పట్టి పీడిస్తున్న ఒక గవర్నర్ ని చంపాలని దారికాచాను, కానీ పొరపాటున వేరొక ఇంగ్లాండ్ వాసి చనిపోయాడు. ఈ చరణం తను అనుకున్న వాడు కాకుండా వేరే ఎవరో మరణించేసరికి పగ వాడైనా కూడా వాడమీద జాలి, తన వలన జరిగిన తప్పుని నక్కచ్చిగా ఒప్పుకునే ధైర్యం ఈ చరణం లో కనిపిస్తాయి.

చరణం-2:
నేను భయపడి తెల్లదొరలకి దొరికిపోయాననుకుంటున్నావేమో. నా చేతిలో సమయానికి కత్తి లేదు వుండి వుంటే నా రక్తంతో స్నానం చేసి ప్రపంచానికి చూపించేవాడిని పోరాటం ఎలా చేయాలో…

చరణం-3:
శనివారం వేళ 10 గంటలకి జడ్జి కోర్టులో తీర్పు ఇస్తారు నా స్నేహితుడు అభిరామ్ ని ద్వీపానికి (అండమాన్) పంపడం, ఖుదీరామ్ (నాకు) ఉరి.

చరణం-4:
అమ్మా!!! నేను లేకపోతే నువ్వు బెంగ పెట్టకోవక్కరలేదు నీకు 33 కోట్ల 12 లక్షల మంది పిల్లున్నారు, వారందరితోనూ ఇంటి వృద్ధి చేయి, వారిని నీ చరణ దాసులుగా చేసుకో అందరూ నా కన్నా గొప్పగా నిన్ను సేవించ గల వారే…

చరణం-5:
నేను లేనని చింతించద్దు. సరిగ్గా పది నెలల పది రోజులకి మళ్ళీ తిరిగి వస్తాను. ఒక వేళ నన్ను గుర్తు పట్ట లేకపోతే నా మెడ మీద ఉరి తాడు గాటుని చూసి గుర్తు పట్టవచ్చు అందుకని ఏ మాత్రం దిగులు పడకుండా ఈ సారి కి నన్ను ఇలా సాగనంపు తల్లీ భరతమాతా నీకు వందనం

ఇలాంటి అద్భుతమైన సాహిత్యం అందిచిన బెంగాల్ కవులకి, దాని స్ఫూర్తితో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన యోధులనీ తలచుకుంటూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

Advertisements

రామాయణం ఒక సందేశం

Srirama while he is about to leave to exile, he told Seeta that you stay here and I am leaving to exile as you don’t have to come with to exile also as a queen you can’t bear the difficulties of a forest. After listening to Rama, Seeta told him as below.

శ్రీరాముడు వనవాసానికి వెళ్లేముందు సీతమ్మని కలసి, నా తండ్రిగారు నన్ను వనవాసం చేయమని ఆజ్ఞాపించారు, అందుకని నేను వెళుతున్నాను, నువ్వు ఇక్కడే వుండి, తమ్ముడు మహారాజైన భరతుని ఆజ్ఞలు శిరసావహించు, అంతే కాక రాజకోట సుఖాలలో పెరిగిన నువ్వు వనవాసంలో కష్టాలను అనుభవించలేవు. అందుచేత నేను వెళుతున్నాను అని చెప్పాడు. దానికి సీతమ్మ ఇలా చెప్పింది.

भर्तुर्भाग्यं तु भार्यैका प्राप्नोति पुरुषर्षभ।
अतश्चैवाहमादिष्टा वने वस्तव्यमित्यपि ||

భర్తుర్భాగ్యం తు భార్యైకా ప్రాప్నోతి పురుషర్షభ!.
అతశ్చైవాహమాదిష్టా వనే వస్తవ్యమిత్యపి ৷৷2.27.4৷৷

A wife alone, O best of men shares the destiny of her husband. I am also therefore, ordered to dwell in the forest. ( a command to you is a command to me).

భర్త భాగ్యాన్ని కేవలం భార్య మాత్రమే పంచుకుంటుంది. అందుచేత వనవాసం నీకే కాదు నాకు కూడా ఆదేశించబడింది.

न पिता नात्मजो नात्मा न माता न सखीजनः।
इह प्रेत्य च नारीणां पतिरेको गतिस्सदा ||

న పితా నాత్మజో నాత్మా న మాతా న సఖీజనః.
ఇహ ప్రేత్య చ నారీణాం పతిరేకో గతిస్సదా ৷৷2.27.5৷৷

It is not her father or mother, nor her son or herself, nor her friends but her husband alone gives a woman the permanent refuge in this or in the next world.

తల్లి, తండ్రి, లేదా తోబుట్టువులు కానీ, మరే ఇతర సఖులు కానీ సంపూర్ణ ఆవాసం కల్పించలేరు, ధర్మానుసారం నారికి “పతిః ఎకో గతిః సదా” అంటే భార్యకి ఎల్లప్పుడూ భర్త మాత్రమే పరమాగతి.

यदि त्वं प्रस्थितो दुर्गं वनमद्यैव राघव।
अग्रतस्ते गमिष्यामि मृद्नन्ती कुशकण्टकान् ||

యది త్వం ప్రస్థితో దుర్గం వనమద్యైవ రాఘవ!.
అగ్రతస్తే గమిష్యామి మృద్నన్తీ కుశకణ్టకాన్ ৷৷2.27.6৷৷

ఓ రాఘవా, ఒకవేళ నువ్వు ఇప్పుడే ఈ రాజకోటని వదిలి వనవాసానికి వెళ్ళాలి అన్నాకూడా నేను నీకూడా రావాలి అంతేకాదు, అగ్రతస్తే గమిష్యామి మృద్నన్తీ కుశకణ్టకాన్ అంటే నీ ముందు నడచి ఆ కాళీ బాటలో వున్న ముళ్ళు నేను తొక్కి బాటని నీకు సుగమం చేస్తాను .

O son of the Raghus if you set out for the impenetrable forest now itself, I shall also go, walking ahead of you and crushing the thorns and (spiky) kusa grass (rendering the path comfortable for you to walk).

ईर्ष्यारोषौ बहिष्कृत्य भुक्तशेषमिवोदकम्।
नय मां वीर विस्रब्धः पापं मयि न विद्यते ||

ఈర్ష్యారోషౌ బహిష్కృత్య భుక్తశేషమివోదకమ్.
నయ మాం వీర! విస్రబ్ధః పాపం మయి న విద్యతే৷৷2.27.7

ఓ వీరా !! పాపం మయి న విద్యతే అంటే నాలో ఏ పాపం లేదు (ఒక వేళ నేను ఎదో తప్పు చేశాననుకుని నన్ను తీసుకెళ్ళటంలేదేమో). ఎలా అయితే భుక్త శేషం ఇవ ఉదకం, అంటే తాగగా మిగిలిన నీటిని ఎలా విడిచి పెట్టేస్తారో అలాగే నామీద వున్న ఈర్ష్య, రోషాలను వదిలిపెట్టి, నా మీద నమ్మకంతో నన్ను నీతో వనవాసానికి తీసుకెళ్ళు.

Oh, brave man! By abandoning, as water left over after drinking, the impatience and anger and having faith, take me. There is no sin in me.

ఇలా చెప్పిన సీతమ్మ తన భర్త ధర్మానికి ప్రతి రూపం అయిన రాముడు అడుగుజాడలలోనే నడిచింది, జీవిత భాగస్వామి అన్నదానికి నిలువెత్తు ఉదాహరణ సీతమ్మ అందుకే సీతారాములు ఆదర్శ దంపతులు అయ్యారు.

శయన ఏకాదశి

రంగపుర విహార జయ కోదండ-
రామావతార రఘువీర శ్రీ

అనుపల్లవి:
అంగజ జనక దేవ బృందావన
సారంగేంద్ర వరద రమాంతరంగా
శ్యామలాంగ విహంగ తురంగ
సదయాపాంగ సత్సంగ

చరణం:
పంకజాప్త కుల జల నిధి సోమ
వర పంకజ ముఖ పట్టాభిరామ
పద పంకజ జిత కామ రఘురామ
వామాంక గత సీత వర వేష
శేషాంక శయన భక్త సంతోష
ఏణాంక రవి నయన మృదు-తర భాష
అకళంక దర్పణ కపోల విశేష ముని-
సంకట హరణ గోవింద
వేంకటరమణ ముకుంద
సంకర్షణ మూల కంద
శంకర గురు గుహానంద

ముత్తు స్వామి దీక్షితార్ రచించిన అద్భుతమైన కీర్తన ఇది.

రంగపురంలో (అనే ప్రదేశంలో ) విహరించే వాడా, జయ కోదండం చేతపట్టి రామావతారమెత్తి రఘు వంశంలో వీరుడిగా పేరు గాంచిన వాడా

(అంగజ జనక) మన్మధుని తండ్రి, (దేవ) దేవతలకూ, బృందావనంలో విహరించే (సారంగేంద్ర) ఏనుగులకూ (వరద) వరమిచ్చేవాడా (రమాంతరంగా)లక్ష్మి మనస్సులో వుండేవాడా, (శ్యామలాంగ) నీలి రంగు మేను కలవాడా (విహంగ తురంగ) విహం గమయతి ఇతి విహంగం అంటుంది అమరం అంటే ఆకాశం లో గమనం చేసేది కాబట్టి విహంగం అంటారు అంటే పక్షి ఇక్కడ గరుత్మంతుడు తురంగ అంటే వాహనం. గరుడుడిని వాహనంగా కలవాడా తన సత్సాగత్యంలో వున్నవారిని తన ఓర చూపుతో (అపాంగ) ఎల్లప్పుడూ దయతో (సదయా) చూసుకునే వాడా

(పంకజాప్త కుల) సూర్యవంశం అనే (జలనిధి ) సముద్రంలో చల్లగా నిండుగా వెలుగే (సోమా) చంద్రుడా, (వర పంకజ) పద్మములాంటి అందమైన ముఖాన్ని వరంగా కలిగిన పట్టాభిరామా
తన పద్మాలవంటి పాదాలతో (జిత కామ) కోరికలు జయించిన రఘురామా. తన వామభాగం లో సీతమ్మని కలిగిన వరాలిచ్చే వేషధారీ, శేష పానుపు మీద శయనించి వాడా, భక్తులకు సంతోషం కలిగించే వాడా, రవి చంద్రులనే (ఏణాంక) పెద్దకన్నులు గా కలిగినవాడా, మృదువుగా భాషించేవాడా, (అకళంక) మచ్చలేని (దర్పణ) అద్దంలా మెరిసే (కపోల) చెక్కిళ్ళు కలవాడా, విశేషంగా మునుల సంకటాలను హరించేవాడా, వేంకట రమణా, గోవిందా, (సంకర్షణ) పవిత్రమైన (మూల కంద) మూల పురుషుడా, శంకరులవంటి గురువుల హృదయాలను ఆనందింపచేసేవాడా…

What is liberation: మోక్షం అంటే?

देहस्य मोक्षो नो मोक्षो न दंडस्य न कमंडलोः
अविद्या हृदयग्रन्धि मोक्षो मोक्षो यतस्तः

దేహస్య మోక్షో నో మోక్షో న దండస్య కమండలోః
అవిద్యా హృదయగ్రన్ధిమోక్షో మోక్షో యతస్తతః

మోక్షం అంటే ఏమిటో ఈ శ్లోకంలో జగత్గురువులు శంకరభగవత్పాదులు తన వివేక చూడామణి లో వివరించారు. ఇది అందరూ చదివి తరించవలసిన గ్రంధం

దేహాన్ని విడిచిపెట్టడం మోక్షమా? కాదు
మోక్షో న దండస్య కమండలోః అంటే జీవితపు చరమాకంలో ఇంక పొందటానికి కానీ కోల్పోవడానికి ఏమీ లేని సమయంలో దండ కమండలాలు పట్టుకుని సన్యాసాశ్రమంలో చేరటమూ మోక్షం కాదు. మరి మోక్షం అంటే???
అవిద్యా హృదయగ్రన్ధి మోక్షం. మన హృదయన్ని అంటి పెట్టుకున్న అవిద్య అహం అనే చిక్కుముడుల నుండి విముక్తి పొందటమే మోక్షం.

What is moksha?? This is explained in vivekachodamani by jagatguru aadi sankaracharya. Unfortunately English doesn’t have exact equivalent word for moksha. But liberation is what they feel is equivalent. So I use the same to explain the meaning.
Leaving the body is not liberation; Neither giving up the last set of posessions is mOksha. When the release from the “knot of ignorance” in the name of Ego happens it is the real liberation.

సత్సాంగత్యం: Good Company

सत्संगात भवतिः साधूना खलानां साधूनां न हि खलसंगतः खलत्वं
आमोदं कुसुमभवं मृदेव दत्ते मृद्गन्धं न हि कुसुमानि धारयन्ति

This subhashita tells about the greatness of association with good people or sages.

Like the fragrance of a flower is passed on to mud, and never the bad smell of the mud is taken by the flowers. A wicked person will become a good if he is associated with good people, where as a good person will never leave his nature even if he is associated with a group of wicked people.

That is why adisankaracharya says association with good people is the first step for the seeker of ultimate liberation (moksha).

सत्संगत्वे निः संगत्वं निः संगत्वे निर्मोहत्वं
निर्मोहत्वे निश्चलतत्वं निश्चलतत्वे जीवनमुक्तिः

With the association of good people one will realise the materialistic nature of the world and start dissociating him self with the bad things, slowly this dissociation will teach us to get rid of love and affection on the materialistic will world. Eventually one will be able to concentrate on the heavenly things leading to the moksha.

That is why, we should maintain distance from the mud like bad smell and intentionally make sure we are always in association with good people who can pass on their flower like fragrance to us.

సత్సంగాత్భవతిః సాధూనా ఖలానాం
సాధూనాం న హి ఖలసంగతః ఖలత్వం
ఆమోదం కుసుమభవం మృదేవ దత్తే
మృద్గంధం నహి కుసుమాని ధారయంతి

దుష్టునికి సజ్జన సాంగత్యం వల్ల సుజనత్వం వస్తుంది. సజ్జనునికి దుష్ట సాంగత్యం వల్ల దుష్టత్వం వస్తుంది. పూల సువాసన మట్టికి అంటుతుంది. మట్టి వాసన పూలకు రాదు కదా.

అందుకే ఆదిశంకరాచార్యుల వారు సత్సాంగాత్యాన్ని మోక్షమార్గాన్ని పొందటానికి మొదటి మెట్టుగా భజగోవింద స్తోత్రంలో వర్ణించారు.

సత్సంగత్వే నిః సఙ్గత్వం నిఃసఙ్గత్వే నిర్మోహత్వం|
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః||

సజ్జన సాంగత్యం వలన ప్రాపంచిక విషయ సుఖాలమీద అవగాహన పెరిగి వాటి సాగాత్యనికి దూరమవుతాము, ఎప్పుడైతే విషయ సుఖాలకు దూరమయ్యమో వాటి మీద వున్న మమకారం, వ్యామోహం, ఆసక్తి తగ్గిపోతుంది. అలా నిశ్చలంగా వాటిమీద ఆసక్తి వదులుకోగలగటమే ఏకాగ్రత, ఏకాగ్రత సాధించిననాడు భాగవత్ధ్యాస మీద నిశ్చలమైన ఏకాగ్రత పెరిగి చివరగా మూక్షానికి బాట వేస్తుంది.

అందుచేత ముముక్షువుకి సత్సాంగత్యం మొదటి మెట్టు. మోక్ష సాధన చేసే ప్రతి ఒక్కరూ మట్టిలా బురద చల్లే దుస్సంగత్యాన్ని వదిలి, ప్రయత్నపూర్వకంగా పువ్వులా పరిమళం వెదజల్లే సత్సాంగాత్యాన్ని వెతుక్కోవాలి.

పరోపకారం: Giving others (Benevolence)

परोपकारशून्यस्य धिक् मनुष्यस्य जीवितम् ।
जीवन्तु पशवो येषां चर्माप्युपकरिष्यति ॥

పరోపకారశూన్యస్య ధిక్ మనుషస్య జీవితం

జీవంతు పశవో ఏషామ్ చర్మా ప్యుపకరిష్యతి


It is disgusting to lead a life without the practice of benevolence! because one can’t do any service after his death, unlike animals. May the animal live long, whose leather also will do some service to others by being manufactured into shoes and woolens etc…


పరోపకారం అంటే తెలియని మనిషి జీవితం వ్యర్థం. అంతకన్నా జంతు జీవితం ఎన్నో రెట్లు గొప్పది ఎందుకంటే ఒక జంతువు మరణించిన తరువాత అయినా కూడా తన చర్మం తో తయారు చేయబడిన చెప్పులు బట్టల ద్వారా పరులకి సహాయ పడుతుంది. అదే మనిషి జీవించి ఉండగా పరోపకారానికి ఒడికట్టకపోతే అతని శరీరం కూడా దేనికి పనికి రాదు. అటువంటివాడి జీవితం వలన ఏమీ ఉపయోగం ఉండదు. అందుకే ప్రయత్నపూర్వకంగా పరోపకారాన్ని అలవాటు చేసుకోవాలి.

 

 

ఏది ఆభరణం: What is a real ornament

ऐश्वर्यस्य विभुषणम् सुजनता शौर्यस्य वाक्सम्यमो
झानस्योपशम श्रुतस्य विनयो वित्तस्य पात्रे व्ययः
अक्रोधस्तपसः क्षमा प्रभवितुः धर्मस्यमिर्व्याजता
सर्वेषामपि सर्वकारणमिदम् शीलम् परम् भुषणम्

ఐశ్వరస్య విభూషణం సుజనతా, శౌర్యస్య వాక్సంయమో,
ఙ్ఞాన స్యోపశమ, శ్రుతస్య వినయో,విత్తస్య పాత్రే వ్యయః,!
అక్రోధస్తపసః,క్షమా ప్రభవితుః,ధర్మస్యమిర్వ్యాజతా
సర్వేషామపి సర్వకారణ మిదం శీలంపరం భూషణం!!

This is a great subhashita which explains what are right ornaments.
ऐश्वर्यस्य विभुषणम् सुजनता being humble or down to earth in spite of being rich is an ornament for the rich person.
शौर्यस्य वाक्सम्यमो for a valor or warrior ornament is maintaining calm and to speak less
झानस्योपशम for a knowledgeable person controlling the urge of his sensual pleasures becomes his ornament.
श्रुतस्य विनयो for a student his submissive nature is the ornament.
वित्तस्य पात्रे व्ययः for a powerful man his nature of identifying capabilities for getting the work done is the ornament.
अक्रोधनस्तपसः for a sage control of his anger is the ornament.
क्षमा प्रभवितु धर्मस्यमिर्व्याजता, influential person should have kshama and following dharma is the ornament.

For all of us and everyone sheelam is the important and must have ornament.
Just have a revisit at the meaning of the sloka, if those ornaments are not possessed by respective people those are not respected in the society rather they are treated evils. We normally listen to a proverb as absolute power corrupts. Ownership on any of the materialistic things makes them corrupt so one should be careful in not getting into the materialistic trap.
Unfortunately, without understanding the meaning of ornament everyone thinks the one that makes us merely look good treat as an ornament is utter foolishness.

ఇదొక అద్భుతమైన సుభాషితం, ఆభరణం అంటే అర్థం ఏమిటో ఎవరెవరికి ఎటువంటి ఆభరణం వుండాలి చెబుతుంది.
సుజనతా ఐశ్వర్యస్య విభూషణం ఎన్ని సిరి సంపదలున్నా మానవత్వం మంచితనం లేని వాడకి సమాజంలో విలువివ్వరు కనుక సుజనతా ఐశ్వర్యవంతుడి ఆభరణం.
శౌర్యస్య వాక్సంయమో శూరుడైనా కూడా బలంవంతుడునాకేమని అన్నట్లు ఏది పడితే అది వాగకుండా మితభాషి అయి వుండటం ఆభరణం.
జ్ఞానస్యోపశమ జ్ఞాని కి ఇంద్రియ లౌల్యం నుంచి ఉపశమనం పొందటం ఆభరణం. శ్రుతస్య వినయ శ్రుతం అంటే వినడం విని నేర్చుకునే వాడు శ్రోత, విద్యార్థి వారికి వినయం ఆభరణం. విత్తస్య పాత్రే వ్యయః ఇక్కడ విత్తం అంటే అధికారం అని అన్వయంచేస్తే అధికారం వున్నవాడికి పాత్రత తెలుసుకుని వ్యవహరించడం ఆభరణం.
అక్రోధస్తపసః అంటే తపస్వికి కోపం లేక పోవటం ఆభరణం అందుకే వశిష్ఠుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు మహర్షి అయ్యారు.
ప్రభవతు క్ష మా, ధర్మస్య మిర్వ్యాజతా ఉన్నత స్థాయిలో వున్నావాడికి క్ష మా గుణం ధర్మం తప్పకుండా ఆచరించడం ఆభరణం.
ఇవికాక సర్వ కాల సర్వావస్థలలోనూ అందరూ కలిగివుండవలసిన ఆభరణం సౌశీల్యం.
ఒక్కసారి తిరిగి శ్లోకం లోకి వెళితే పైకి కనిపించే ఆభరణం ధరించకపోతే అందవిహీనంగా ఎలా వుంటారో అలాగే ఈ ఆభరణాలు లేనివాడికి మానసిక అందం వుండదు. ఇంకొక్క విషయం ఏమిటంటే పైన చెప్పిన ఆభరణాలు లేకపోతే ఆ వ్యక్తి భగవత్కృప వలన లభించిన తన అయిహిక సుఖశాంతులను తన సొంతంగా భావించి విర్రవీగి చివరగా వాటి కోసం పడే తపన రాక్షసత్వం గా మారిపోయేలా చేసుకుంటాడు.
ఆభరణం అంటే ఏమిటో, దాని విలువ తెలియక, మూర్ఖ మానవుడు పైకి కనిపించే వస్తువులనే ఆభరణాలని భ్రమ పడి సంబరపడిపోతుంటాడు.